Monday 18 May 2015

కొత్త అబార్కి విధానం

నిన్నసాయంత్రం నెల్లూరు నుండి వస్తూ ఉంటే.. ఒక డజను పనస తొనలు తీసుకున్నాను,
వాటిని తినేసి కాగితం పారవేయ బొతు యదాలాపంగా చూస్తే ఇలాఉంది. 
..
ప్రభుత్వం లో కి కొత్త సలహాదారులు ప్రవేశించాక 
అబార్కి విధానం మీద అనేక చర్చలు ప్రయోగాలు జరిగాయి.
..
ముఖ్యంగా రంబీర్ కపూర్ లాటి IAS అదికార్లు కొత్త సలహాలతో ముందుకు వచ్చారు.
ముఖ్యమయిన బుల్లెట్ పాయింట్లు ..
..
• కొత్త అబార్కి విధానాన్ని అమలు చేయాలి.
..
• ఉధ్యోగస్తులకి ప్రతి నెలా జీత బత్యాలు 70:30 శాతం తో
నగదు మరియు మధ్యం సరఫరా జరగాలి...
.
• మహిళలకి 50:50 వరకు సరఫరా ఇవ్వటం ద్వారా వారిని ప్రోత్సహించొచ్చు.
మహిళా సాధికారత సాదించవచ్చు.
..
• గ్రామీణ ప్రాంతాల్లో ఆహార బద్రత పదకాల ద్వారా చేపట్టే పనులకి కూలీ బదులుగా వారికి మద్యం ఇవ్వొచ్చు.తద్వారా గ్రామీణ సాధికారత కి పూర్తి అవకాశం ఉంది.
..
• ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో మద్యం నిలవలు అందుబాటులో ఉంచాలి.
వారం రోజులు పూర్తి పనిగంటలు పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు గా కొంత మధ్యాన్ని ఏర్పాటు చేయొచ్చు. తద్వారా ఉధ్యోగుల ను పూర్తి సామర్ధ్యం తో పని చేయించ వచ్చు..
..
• కొత్త పి‌ఆర్‌సి ఫిట్మెంట్ కి సమానంగా ఉద్యోగస్తులకి పెరిగే జీత బత్యాలకి
సమానంగా మధ్యం సరఫరా చేయాలి.
..
• బంగారం కుదవ కార్యాలయాలు ఏర్పాటు ప్రబుత్వమే చేపట్టాలి.
..
• చిన్న చిన్న మోతాదులో మద్యాన్ని కరెన్సీ లాగా వాడుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి.
..
• మహిళా ఉద్యోగులు తాము ప్రయాణం చేసే, పాసింజర్ రైళ్లు, బస్సు స్టాండ్ ప్రాంగనాలలో బ్లాకులో సీసాలు అమ్ముకునే అవకాశం కలిపించాలి.
..
• వృదాప్య మరియు వికలాంగ పెన్షన్ ల స్థానం లోనూ మద్యం ప్రవేశపెట్టే అల్లోచనలని ఆహ్వానించాలి.
..
నాకు కళ్ళు తిరగటం మొదలయ్యింది. కారు అద్దాన్ని దించి కాగితం బయట పారేశాను.
మిత్రులకి శుభోదయం. smile emoticon grin emoticon tongue emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...