Monday 18 May 2015

తాళి ఆగట్రుం విళా

.“తాళి ఆగట్రుం విళా” ఉత్సవం జరుగుతున్న వేదిక కి
దగ్గరలో పుల్ల అయిసు బండి వద్ద కొంతమంది ఐసు తింటున్నారు
రక రకాలుగా ఆస్వాదిస్తున్నారు .
.
కొత్తగా చెన్నై వచ్చిన ఇద్దరు మిత్రులు ఒక చెట్టు కింద కూర్చుని వారిని గమనిస్తున్నారు.
ఉబుసుపోక ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు.
.
“ఈ చెట్టుమీద ఉన్న 3 కాకుల్లో ఒక దాన్ని కాల్చామనుకో ఇంకెన్ని ఉంటాయి ?”
.
“ఏమీ ఉండవు సౌండ్ కి ఎగిరి పోతాయి.”
.
“కాల్చినది ఉంటది గదరా? ఏమైనా నీ లాజిక్ బాగుందిరా “ అబినందించాడు మిత్రుడు.
.
ఇప్పుడు రెండో వాడి వంతు వచ్చింది.
.
“అక్కడ అయిసు తింటున్న ఆ ముగ్గురు ఆడవాళ్ళలో, ఆదేరా ఎర్ర చీర , పచ్చ చీర , బులుగు చీర కట్టుకున్న వాళ్ళలో పెళ్లి అయిన ఆవిడ ఎవరు?
.
“పచ్చ చీర ఆమె “. టక్కున చెప్పడతాను
.
“ఓరి యదవా కాళ్ళ కున్న మెట్టెలో , మెడలోని తాళో చూసి చెప్పల్రా ? – any way I like the way you think ..” నవ్వుతూ చెప్పాడు మిత్రుడు.
..

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...