Monday 18 May 2015

Dr.సదాశివం

సంధ్య వేళ ..
..
డాక్టర్ .. సదాశివం గారి కారు అలవాటు లేని ఇరుకు వీదులలో
ప్రయాణించి ఒక సన్నటి కాలి బాట ముందు ఆగింది.
..
ఆయన కారు దిగి, అక్కడే ఆడుకుంటున్న పిల్లవాళ్లలో ఒక పెద్ద పిల్లాడిని పిలిచి
ఒక పది నోటు అతనికి ఇచ్చాడు..
." అరగంటలో వస్తాను కారు చూస్తుండు "
..
చుట్టూ ఒకసారి దీర్గంగా పరిశీలించాక , ..
అక్కడి నుండి ఫర్లాంగు దూరం లోని ఆమె ఇంటికి వెళ్ళాడు.
..
అతనలా నేరుగా ఇంటికే వస్తాడని ఏమాత్రం ఊహించని ..
ఆవిడ కొద్ది సేపు ఏమి జరుగుతుందో తెలియక నిలబడి పోయింది.
..
అయినా సరే తాను తన మాట మీదే ఉండాలనుకుంది...
డబ్బుకు బీదే కానీ ఆత్మాభిమానానికి కాదు. లోపలే అనుకుంది.
..
“లోపలికి రమ్మనవా?” అడిగాడాయన ....
..
“ఒక్కసారిగా ఈలోకం లోకి వచ్చినట్లు ఉలిక్కిపడి రండి కూర్చోండి అంది” , ..
ఇంట్లో మంచిగా ఉన్న కుర్చీ ని పమిటతో తుడుపుతూ.
..
”ఏమి చేస్తున్నావు? పిల్లలేరీ?” అవసరం లో ఉన్నప్పుడ మగవాడి..
గొంతులో తెచ్చిపెట్టుకునే మృదుత్వం ఉంది.
..
ఆమె చుట్టూ పక్కల వారు ఎవరైనా గమనిస్తున్నారేమో నని ..
ఒరకంటి తో గమనిస్తూనే ఉంది.
..
“కూర్చో “ సదాశివం చెప్పాడు...
..
ఆమె గడప వద్ద బయటనుండి చూసేవారికి పూర్తిగా కనబడేట్టుగా కూర్చుంది...
..
డాక్టర్ గారే ప్రారంబించేరు “ జరిగినది ఏదో జరిగింది. ..
అన్నీ మరిచిపో .. రేపట్నుండి నువ్వు వచ్చేయి”
..
“ ఇక మర్చిపోండి. నేను చాలా బాద పడుతున్నాను...
నేనిక రాలేను “ చెప్పిందావిడ.
..
ఆయన సూదంటు రాయిలా నవ్వాడు. ..
ఆ ఆకర్షణకి ఆమె అతీతురాలు ఏమీ కాదు.
అందుకే అతని నవ్వు గమనించకుండా ఊరుకుంది.
..
“నిన్ను బాగా చూసుకుంటాను .. ..
మరెప్పుడు ఇలాంటి పరిస్తితి రానీకుండా జాగార్త పడతాను .
మీ పెద్దోడిని ప్రైవేట్ స్కూల్ లో చేర్పిస్తాను.” సాలోచనగా ఆగాడు అతను.
..
“కానీ .. మీ మేడమ్ తో నేను పడలేను..
“ మెత్తబడిందావిడ. ఇక రిసల్ట్ తేలిపోయింది.
కొన్ని ముగింపు మాటలు మాత్రమే మిగిలాయి.
..
ఆ ముగింపు మాటలు పూర్తయ్యాక
డాక్టర్ గారికి వీడ్కోలు లబించించిది హామీతో బాటు.
.....
..
కారు దగ్గరికి తిరిగి వచ్చిన ఆయనకి ఆ పిల్లాడు మిగతా పిల్లలు ..
కారు పై దాడి చేయకుండా ఇంకా చూడటాన్ని
గమనించి మరో పది నోటు ఇచ్చాడు.
..
ఇరుకు సందులో కారు రివర్స్ చేశాక ..
అందాక ఏసీ వేసుకుని కూర్చునున్న బార్యతో చెప్పాడు.
“ఎంత డబ్బు పెట్టినా మంచి పనిమనుషులు దొరకటం కష్టం.
చిన్న చిన్న విషయాలకు కేకలు వెయ్యడం మానుకో “

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...