Monday, 18 May 2015

పాపం -పెద్దాయన

రాకేశ్ మాదాల వీకెండ్ కి ఫ్రెండ్స్ తో కలసి
చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు.
పార్టీ అంటే పెద్ద పార్టీ ఏమి కాదు .
డెలివరీకి బార్య పుట్టింటికి వెళ్లటంతో .
ఇంట్లో నే పాక శాస్త్ర నిపుణులతో మంచి నాన్ వెజ్ ఐటెమ్స్ చేయించుకుని, 
ఇష్టమయిన డీవీడీ లు కార్డ్స్, గేమ్స్ , గాసిప్స్, పాత ఫ్రెండ్స్ కి ఫోన్లు .....
.
పక్కనే టచ్చింగ్ తో గాంగ్ అంతా కలిసి కార్డ్ ఆడుతున్నప్పుడు...
కాలింగ్ బెల్ మోగింది...
రాకేశ్ వచ్చి తలుపు తీశాడు..
.
లాల్చీ పైజమా వేసుకున్న ఒక పెద్ద వయస్కుడు..సన్నగా పొడవుగా..
"ఎవరు కావాలి?"
"బాబు నువ్వు మాదాల భ్రమయ్య కొడుకువేగా? "
కీర్తి శేషుడయిన తండ్రి పేరు చెప్పేసరికి రాకేశ్ అలర్ట్ అయ్యాడు.
రండి కూర్చోండి.అంటూ ముందు గదిలోకి ఆహ్వానించాడు.
.
వాటర్ తాగుతారా అంకుల్?
"లేదు బాబు .. నేను మీ నాన్న గారు అప్పట్లో దోర్నాల లో పనిచేసే వాళ్ళం "
చిన్న నాప్కిన్ తో ముఖం తుడుచుకుంటూ చెప్పాడాయన.
.
పెద్ద కుటుంబం అప్పట్లో ఆర్ధిక ఇబ్బందులు ... ఒక్క నిమిషం ఆగాడు ఆయన.
'మీ నాన్న చొక్కాలోంచి ఆయనకి తెలియకుండా 230 రూపాయలు తీశాను."
అలా చాలామంది మిత్రుల నుండి పది పరక ... తప్పని సరి పరిస్థితులు ..
అతని గొంతు వణికింది. తల దించుకుని మాట్లాడుతున్నాడు.. చిన్న గొంతుతో ..
....
ఇప్పుడు రిటైర్ అయ్యాను . పిల్లలు సెటిల్ అయ్యారు.
నేను డబ్బు తీసుకున్న అందరి పేర్లు అమౌంట్ వ్రాసిపెట్టుకుని ఉన్నాను
జేబులోంచి చిన్న పస్తకం తీశాడు ఆయన.
దాంతో పాటు ఒక వెయ్యి కాగితం. ...
.
ఎవరి డబ్బు వారికి ఇచ్చేస్తే గాని మన శాంతి ఉండదు.. 230 తీసుకో బాబు
ఆయన వెయ్యి నోటు ముందుకు చాపాడు.
.
రాకేశ్ కి నోట మాట రాలేదు.
" పాపం .. జరిగినది ఏదో జరిగింది..
వదిలేయ్యండి అంకుల్ మర్చి పొండి. పెద్ద మొత్తం కూడా కాదు ."
.
అతను చేతులు పట్టుకోబోయాడు.
కాదు నాయనా నన్ను అపరాధభావం వృద్దాప్యం లో వెంటాడుతుంది
నువ్వు తీసుకోకోపొతే ఎప్పటికీ నేను బాదపడుతూనే ఉండాల్సి వస్తుంది. .
.
కొద్దిసేపట్లోనే ఆయన పట్టు వదలడని తెలుసుకున్న రాకేశ్
లోపలికి వెళ్ళి 770/- తెచ్చి ఇచ్చి 1000 తీసుకున్నాడు.
..
తలుపు వేసి లోపలికి రాగానే మిత్రులతో నవ్వుతూ
ఇలాటి వాళ్ళు కూడా ఉంటారా? అంటూ వెయ్యి కాగితం చూపించి జరిగినది చెప్పాడు.
చాపల పులుసులో చపాతీ నానబెట్టి తింటున్న బాంకు కాషియర్ మిత్రుడు,
.
"ఆరే రాకీ ఇది దొంగ నోటురా " వేళ్ళు నాక్కుంటూ చెప్పాడు.
smile emoticon grin emoticon tongue emoticon

No comments: