బార్య కి పాడయిపోయిన
స్మార్ట్ ఫోన్ బదులు మరో ఫోన్ కొనిపించడం మర్చి
పోయిన శ్యాం కి ఇంట్లో శనివారం పొద్దుటే టిఫిన్
పెట్టలేదు.
ATM సాఫ్ట్ వేర్ మైంటనెన్స్ చేసే శ్యాం కి ఆ పూట కి వీది చివర్లో ఉన్న మిత్రుడి
హోటల్ కి వెళ్ళాడు.
కాషియర్ సీట్లో
నుంచి లేచి వచ్చి న మిత్రుడు, పలకరింపుగా నవ్వి “ఏం కావాలి?” అని అడిగాడు, గ్లాసులోకి నీళ్ళు వంచుతూ..
“ఎమున్నాయి?”
“ఇడ్లీ, వడ, దోసె, పూరీ, పెసర, మసాలా దోశె “
“మసాలా దోశె చెప్పండి”
“లేదు”
“పెసర?”
“లేదు”
“మరి ఏమి ఉంది?”
“ఏమీలేదు”
“ఏమి లేవని మొదట్లో నే చెప్పొచ్చుగా?” శ్యాం చిరాకు పడ్డాడు.
“మీ ATM సంగతేమిటి.? కార్డు సరిగా ఇన్సర్ట్ చెయ్యమంటుంది!, 1 నుండి 15 లోపు అంకె నొక్క మంటుంది.1 PIN నెంబరు అడుగుతుంది.
మొదట్లో ఏం భాష కావాలి అంటుంది!, బ్యాంకింగ్, కాష్ విత్ డ్రాయల్ అని అడుగుతుంది!. ఎంత కావాలి అంటుంది!, రశీదు కావాలా వద్దా!! అంటుంది. తీరా చివర్లో “ నో సఫిషియంట్ బాలన్స్!!!” అంటుంది.
! మరి మాకు మండదా ???
No comments:
Post a Comment