Tuesday, 6 September 2016

హార్మోనియం

వినాయకుని పందిట్లో నవరాత్రులు బజన  చేయటానికి ఒప్పుకున్న బృందం లో హార్మోనియం వాయించే అతన్ని వాలెంటిర్లు పోలీసులకి పట్టించారు. స్వామి వారి కి పూజ చేయటానికి తెచ్చిన వెండి దీపపు కుందులు  తస్కరించడం గమనించి.
***
ప్రోగ్రాం లో హార్మోనియం వాడకుండానే మర్నాడు పూజా  కార్య క్రమానంతరం బజన బృందం కార్యక్రమం నిర్వహించింది గాని బక్తులని అంతగా రంజింపలేక పోయింది.
***
తాత్కాలికంగా నాలుగు రోజులు హార్మోనిస్టు దొరుకుతాడేమోనని తెలిసీన డ్రామా కంపనీ ల్యాండ్ లైను కి ఫోన్ చేశాను.
బజన బృందం లో రెగ్యులర్ గా ఒకరు ఉంటారే?” సందేహం వెలిబుచ్చాడు అటునుండి కంపెనీ అతను.
“ఉంటాడు. అతన్ని మా కుర్రాళ్ళు పోలీసులకి పట్టించారు”
“ఓహో .. అలాగా ఒక గంట ఆగి కనుక్కుని ఫోన్ చేస్తాను” అని ఫోన్ నెంబరు తీసుకున్నాడు
***
ఒక పదినిమిషాలు ఆగి అటునుండి మళ్ళీ ఫోను.. అతనే..
“పోలీసులకి పట్టించినతను అంత చండాలంగా వాయించాడా?”


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...