Sunday, 25 September 2016

అమృత

నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 14 వ తేదీ. 
రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. అతను స్కూల్ కి వెళ్లలేదని మర్నాడు తెల్సింది.
అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ దిగాలు పడి ఉన్నారు. అన్న ముఖం వేలాడేసుని వచ్చాడు. బోలెడు దుఖం తో అతను నిలువునా మునిగి ఉన్నాడు. 
అన్న కి చిన్న చెల్లెలు ని నేను. నేనంటే అన్న ఎంతో ప్రేమగా ఉండేవాడు. 
“అన్నా ఎందుకింత ఆలస్యం అయింది.? ఎక్కడికెల్లావు ?” అని నేను ఆందోళనగా అడిగాను. 
“ఏమి తెచ్చానో చూడు” చేతి లో జేబులోంచి తీసిన ఎర్ర సీసాని చూపించాడు.
అందులో మట్టి ఉంది. మట్టి రంగు ఎరుపుగా ఉంది. తడిగా ఉంది.
“ఏమిటిది?” నేను భయంగా అడిగాను.
“ఇందులో ఉన్నది 360 మంది భారతీయుల రక్తం తో తడిచిన మట్టి ఉంది. రోలర్ చట్టానికి శాంతియుత నిరసన తెలపటం కోసం సమావేశమయిన వేలాది ప్రజలమీద కి, నిన్న జనరల్ డయ్యర్ మరఫిరంగులతో కాల్పులు జరిపాడు. ఎందరో చనిపోయారు. ఆ వీరుల రక్తం తో తడిచిన జలియన్ వాలా బాగ్ మట్టి ఈ సీసా లో ఉంది.” అన్న దుఖం తో ఒక్కో మాట చెప్పాడు.
అక్కడ ఏమి చూశాడో, ఏమి విన్నాడో తడబడుతు చెప్పాడు.
ఈ రోజు అన్న ఆహారం ముట్టలేదు. తోటలో నుండి చాలా పూలు తెచ్చి ఆ సీసాని అలంకరించాడు. దానికి మోకరిల్లాడు. తనలో తానే ఏవేవే మాట్లాడుకున్నాడు. బహుశా మనసులోనే ఏవో స్థిరంగా నిశ్చయించుకుని ఉంటాడు.
ఈ హుతాత్ముల రక్తం తో ఆయనకి సన్నిహిత సంభందం ఏర్పడింది. అందుకే తను గూడా విప్లవ కారులకు నాయకుడై ఆత్మ బలిదానం చేశాడు.
మీ కింతకి మా అన్న పేరు చెప్పలేదు కదూ... ఆయన్ని మీరు ఎరుగుదురు . ఆయన పేరు భగత్ సింగ్.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...