ఒక
వ్యక్తి సంచి నిండా ఇంట్లో చాన్నాళ్లుగా ఉన్న గులక రాళ్ళు పోసుకుని ఊరి వెలుపలికి వెళ్ళాడు. అక్కడ ఒక
నది పారుతూ ఉంది. నది ఒడ్డున ఒక పొడవాటి చెట్టు ఉన్నది. దాని కొమ్మల మీద పక్షులు ఉన్నాయి.
రంగు రంగుల పక్షులు.
అతను
సంచి లోని రాయి తీసుకుని గురి చూసి ఒక పక్షి మీదకు విసిరాడు. అది పక్షికి తగల లేదు ప్రవహించే
కాలవలో పడిపోయింది. మరొకటి విసిరాడు. అది కూడా తగల లేదు. ఏదో ఒకటి తగలక పోతుందా అని
విసురుతూనే ఉన్నాడు.
పక్షులు
ఒక చోట నుండి మరొక చోటకి ఎగురుతున్నాయి గాని దేనికి రాళ్ళు తగల లేదు. రాళ్ళన్ని నదిలోకి
పోయి పడ్డాయి.
ఆఖరుకు
ఒక రాయి మిగిలింది. మెరుస్తున్న దానిని తీసుకుని అతను వెనక్కి వచ్చాడు. ఊరి మొదట్లో
ఒక దుకాణాదారునికి దాన్ని చూపించాడు. వ్యాపారి దాన్ని చూసి అబ్బురం చెందాడు. “ఇది మామూలు
గులక రాయి కాదు. చాలా విలువయినది. దీని ఖరీదు కూడా నేను చెప్పలేను. నిపుణులయిన వారు
మాత్రమే చెప్పగలరు” అన్నాడు
అప్పుడా
వ్యక్తి ‘అయ్యో నేను విలువయిన రాళ్ళు వృధాగా నదిలో జారవిడుచుకున్నానే’.. అని భాదపడి ‘మిగిలిన ఒక్క దానిని అయినా సద్వినియోగం
చేసుకోవాలి’ అనుకున్నాడు.
ఆ
రాళ్లే జీవితకాలం లో విలువయిన తిరిగిరాని సంవత్సరాలు, నెలలు. చెట్టుమీదున్న
పక్షులే ఆశలు, కోరికలు. ఆ నదే మృత్యువు. వ్యాపారే గురువు.
ఇది
ఒక క్రైస్తవ నీతి కధ.
No comments:
Post a Comment