Sunday 4 September 2016

వాళ్లంతే

జయశ్రీ ఉదయం పేపర్ చూసేటప్పుడ్ ఒక ఆటొ న్యూస్ కనబడింది.
 
ఎప్పుడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని, టూర్స్ తిరిగి, ఎంజాయ్ చేసే ఆవిడ కి ఒక ఆలోచన వచ్చింది. 

ఒక ఆటొ డ్రైవర్ ని పిలిపించి, తన ఆలోచన చెప్పింది. 
ఒక కొత్త సి‌ఎన్‌జి ఆటొ కొని ఇచ్చేట్టు వంద రోజుల పాటు తనని తను చూడాలనుకుంటున్న ప్రదేశాలన్నిటికి తిప్పేట్టు ఒప్పందం

వ్యాపారం లాభసాటిగా ఉండటం తో సరే అని అతను ఒప్పుకోవటం వెంటనే ఆటో కొనివ్వటం, యాత్ర కి బయలు దేరాటం జరిగిపోయాయి.
 మహాబలిపురం లోని సీ రాక్ టెంపల్ వద్ద మొదలయినప్రయాణం, తిరుత్తణి, తిరుపతి, కంచి, ............... కొనసాగింది. 

సరిగ్గా వందవ రోజు పూర్తి అయ్యేసరికి ఆటొ ఒంగోలు, రైల్వ్యే స్టేషన్ కి చేరింది.
 జయశ్రీ అప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు. 

వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది. “ఇక ఆటో ని స్వంతం” చెప్పారావిడ. 


“మంగమూరు రోడ్డు మర్రిచెట్టు దగ్గర మా తమ్ముడు ఉన్నాడు.

 వాళ్ళ ఇంటి వద్ద నన్ను దించేసి వెళ్ళి పో “ చెప్పిందావిడ. 

పక్కనున్న ఆటో వాళ్ళతో అడ్రెస్ చెప్పించుకుని అతను


“కుదరదండీ తిరుగు బేరాలు ఉండవు గిట్టుబాటు కాదు. మరో ఆటో మాట్లాడుకోండి” చెప్పాడతను.    

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...