ఏసి మార్చురి పెట్టె లు సప్లయి చేసే ముత్యాలరావు, తెల్లవారుఝామున తన బార్యని తట్టి లేపాడు.
విపరితమయిన
నొప్పి అతని బొడ్డు వద్ద ప్రారంభమయి రెండు ఊపిరితిత్తుల మధ్యగా పైకి తంతూ ఉంది.
రిబ్స్
దిగువ ప్రాంతం లో బయంకరమయిన నొప్పి.
ఆమె కి కాళ్ళు వణికాయి.
పక్కింటి వాళ్ళని సాయం
అడగటం 108 లో అరగంటలో హాస్పిటల్ కి చేర్చడం వెంటనే ట్రీట్మెంట్ మొదలయ్యే ఐసియూ లో
చేర్చడం జరిగిపోయాయి.
ఫార్మల్
టెస్ట్ లు అన్నీ చేశారు.
కిడ్నీలో రాళ్ళు,ఉన్నాయని అది పగలటం తో భరించలేనంత నొప్పి వచ్చిందని డాక్టర్ ప్రాధమికంగా ఒక
నిర్ణయానికి వచ్చారు.
ప్రాధమిక
వైధ్యం అందాక, ఐసియూ లో అతని పక్కనే కూర్చున్న అతని బార్య అడిగింది
“మార్చురి బాక్సు షాపుకి
మన పెద్దవాడిని పొమ్మని చెప్పనా?”
అక్కడున్న
నర్సు ఆమెని అయోమయంగా చూసి
“అంత తొందర ఏమి లేదండీ. సారుకి తగ్గే అవకాశం కూడా ఉంది” అంది.
No comments:
Post a Comment