Saturday, 17 September 2016

యుద్దం లో గెలుపే ముగింపు

యుద్దం లో న్యాయం అన్యాయం అనేవి ఉండవు. కేవలం గెలుపే ముగింపు.
రక్తపాతమే మార్గం. ఇది చరిత్ర పుటల్లో ఎక్కడయినా తారసపడే నిజం.
షాజహాన్ తన ప్రియమయిన  మూడవ బార్య ముంతాజ్ (అర్జుమన్ భాను బేగం) 14 గవ బిడ్డకు జన్మనిస్తూ 38 వ యేట 1631 లో  గుర్రపువాతం తో చనిపోయింది.
షాజహాన్ కుంగి పోయాడు. ఆమె గుర్తుగా 22 ఏళ్లపాటు తన ధనాగారం మొత్తాన్ని  వెచ్చించి అగ్రాలో యమునా తీరం లో  తాజ్మహల్ నిర్మించాడు.
అక్కడి నుండి మైలు దూరం లో నే అతని కోట. బార్య చనిపోయిన 26 ఏండ్ల తర్వాత 1657 ప్రాంతం లో మొఘల్ చకరవర్తి షాజహాన్ కి జబ్బు చేసింది.
తండ్రి త్వరగా కాలం చేస్తే సింహాసనం ఆక్రమించవచ్చు అని నలుగురు కుమారులు కాచుకుని ఉన్నారు.
ఆదిపత్యం కోసం తమలో తాము పోరాడు కున్నారు. పెద్ద కొడుకు దారాసుఖోవ్’, ఔరంగజేబ్ చేతిలో ఓడిపోయి ఆగ్రా కోటకి పారిపోయాడు. కోటలో షాజహాను తో కలిసి ఆత్మరక్షణ చేసుకున్నాడు. కోట తలుపులు మూసివేసి సైన్యం తో సహా లోపలే ఉండి పోయారు.
ఆగ్రా కోట అత్యంత బలమైనది. దానిలో ప్రవేశించడం ఔరంగజేబుకి క్లిష్టమయింది. అతనొక పన్నాగం పన్నాడు. కోటలో జబ్బుచేసి ఉన్న తండ్రికి ఒక లేఖ వ్రాశాడు. నేను మహా పాపిని జహాపనా.. నీతో యుద్దం చేయటం, మహా నేరం తప్పు అని తెలుసుకున్నాను. నా మనసు దుఖం తో పూడుకుని ఉంది. నేను వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటే తప్ప నాకు మనసు కి ప్రశాంతత లేదు. కోట తలుపులు తెరిపించు. ని ఇష్టం వచ్చిన కుమారునికి సింహాసనం ఇవ్వు. నా కెటువంటి అభ్యంతరం లేదు”

ఎంతయినా తండ్రి కదా?!!, ప్రక్కనున్న పెద్ద కుమారుడు వారిస్తున్న వినకుండా కోట తలుపులు తెరిపించాడు. ఔరంగజేబు సైన్యం తో పాటు కోటలోకి ప్రవేశించాడు. మొదట తండ్రిని ఖైదు చేశాడు. అన్నకి శిరో ముండనం చేయించాడు. వీధుల్లో ఊరేగించాడు. ఆ తర్వాత అతన్ని హేయంగా చంపించాడు.
షాజహాను మరో తొమ్మిదేళ్లు జీవించాడు. అంత కాలము ఖైదీ గానే జీవించాడు. తనకు అత్యంత ప్రియమయిన తాజ్మహల్ ని చూడాటానికి పోనివ్వమంటే, ఔరంగజేబు తండ్రికి అనుమతి ఇవ్వలేదు.
ఆగ్రా కోటలో తను బంధిగా ఉన్న గదిలో ఉన్న చిన్న కంత గుండా మైలు దూరం లో ఉన్న తేజోమయమయిన తాజ్ మహల్ ని చూస్తు.. చచ్చేంత వరకు తొమ్మిది సుదీర్గ సంవత్సరాలు కాలం గడిపాడు.

అందుచేత.. యుద్దం లో గెలుపే ప్రధానం. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...