ఒక వ్యక్తి కష్టాలలో ఉన్నవారికి ప్రేమ భావంతో తనకు చేత నయిన సేవ చేస్తూండే వాడు.
తిరిగి ఏమి ఆశించేవాడు కాదు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మేవాడు.
ప్రతి మానవుడు దైవస్వరూపమే అని మానవునికి సేవ చేస్తే అది దైవానికి
చేరుతుందని దృడంగా నమ్మేవాడు.
ఒక రోజు రాత్రి అంతనికి ఘాడ నిద్రలో మెలకువ వచ్చింది.
కిటికీ నుండి వెన్నెల కురిసే చోట ఒక దేవదూత కూర్చుంది.
ఒక బంగారు పుస్తకం లో ఏదో వ్రాస్తూ ఉంది. అతను నెమ్మదిగా లేచాడు.
ఆమె వద్దకు నడిచాడు. ఆమె అతనిని చూసి పలకరింపుగా నవ్వింది.
ఇద్దరి మధ్య కొంత సంభాషణ నడిచింది.
“ఏమి వ్రాస్తున్నావు?” అతను అడిగాడు.
“బగవంతుని ప్రేమిస్తున్న వారి జాబితా వ్రాస్తున్నాను.” అందామే.
“అందులో నా పేరు ఉందా?” అతను విస్మయంగా అడిగాడు.
ఆమె మందహాసం తో ఆ పుస్తకం అతనికి ఇచ్చింది. అతను తన పేరు కోసం
అంతా వెతికాడు.
అందులో తన పేరు లేదు.
తలెత్తి చూసేసరికి దేవదూత కూడా లేదు.
***
కొన్నాళ్ళకి మరో వెన్నెల రోజు ఆమె వచ్చింది. కాంతి పుంజం లో కూర్చుని మరో పుస్తకం వ్రాస్తూ
ఉంది.
“ఈ సారి ఏమి వ్రాస్తున్నావు?”
ఆమె నవ్వి “భగవంతుడు ప్రేమిస్తున్న వారి జాబితా” అంది.
మళ్ళీ అతను అదే ప్రశ్న వేశాడు. “నా పేరు ఉందా?”
ఆమె వ్రాయటం పూర్తయ్యాక అతని చేతిలో పుస్తకం ఉంచింది.
అతను పుస్తకం యదాలాపంగా చూశాడు. మొదటి పేజీ లోనే అతని పేరు ఉంది .
(పిల్లల కోసం)
No comments:
Post a Comment