ఒక ఆలయానికి ఒక
బొమ్మ ఏనుగు కావాల్సి వచ్చింది. దానిని చెయ్యమని
ఒక వడ్రంగి కి చెప్పారు. అతడు మూడు నెలల పాటు శ్రమించి ఒక ఏనుగు తయారు చేశాడు. దాని నాణ్యత పరిశీలించడానికి మరో వడ్రంగి వెళ్ళాడు.
కూడా అతని చిన్న
వయసు కుమార్తె కూడా వెళ్లింది.
ఏనుగును చూడగానే
ఆ పాప “నాన్నా ! ఏనుగు వద్దకు వెళ్లకు, అది మిమ్మల్ని ఏమయినా చేస్తుంది” అని భయపడుతూ హెచ్చరించింది.
కానీ తండ్రి ఆమెని
పట్టించుకోకుండా వెళ్ళి ఏనుగు ని తడిమి చూసి, అబ్బురంగా చూస్తుండి పోయాడు. తయారీకి వాడిన కలప
నీ, శిల్పి పని తనాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు.
వడ్రంగి కి ‘ఏనుగు’ కనిపించలేదు.
కుమార్తె కి ‘కలప’ కనిపించలేదు.
వస్తువు ఒక్కటే.
భావన మాత్రం భిన్నం.
పరమాత్మ స్వరూపాన్ని
ఎక్కడని వెతకటం? పరమాత్మ, పంచభూతాలు రెండు వేరు కాదు.
పరమాత్మ వేరు
అని మనం భావించినప్పుడు పంచ భూతాలు మాత్రమే
కనిపిస్తాయి.
అదే పరమాత్మ అనుకుంటే..
పంచ భూతాలు మాయమవుతాయి.
మనకి ఏమి కావాలి?? అనేది మనకే తెలుస్తుంది.
*****
(శైవ సిద్ధాంత
సంబందమయిన గ్రంధాలను ‘తిరుముర్తే’ అంటారు. తిరుమూలర్ అను యోగీశ్వరుడు వ్రాసినది
మొదటి తిరుమూర్తే . అందులో ఆయన వ్రాసిన ఒక పధ్యం సారాంశాన్ని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి
స్వామి వారు చెప్పారు.)
No comments:
Post a Comment