Tuesday 13 September 2016

నిజాయితీ

వాళ్ళిద్దరూ ఫామిలీ సెక్షన్ లో కూర్చుని మంచి బోజనం చేస్తుంటే, కూర్చున్న టేబుల్ కింద ఒక చిన్న చేతి పర్సుపడి ఉండటం గమనించాడతను.
అంతకు ముందు బోజనానికి వచ్చిన వారు ఎవరో మర్చి పోయినట్లుంది.
ఫింగర్ బౌల్స్ లో చేతులు శుభ్రం చేసుకుని ఆ పర్సు తీసి చూస్తే.. అందులో నాలుగు బంగారు గాజులు ఉన్నాయి. 
కొత్తవి. తూకం చీటి కూడా ఉంది. అరవై గ్రాముల బరువు సుమారుగా లక్షన్నర విలువ చేసేవి. 
వాళ్ళిద్దరూ కౌంటర్ వద్దకి వచ్చి మేనేజర్ కి చెప్పి ఆ పర్సు అప్పగించారు. 
మేనేజర్ ఈ మద్య కాలం లో ‘మనుష్యులని’ చూడని వాడిలా, ఆశ్చర్యపోయాడు.
కౌంటర్ లోంచి లేచి ‘చేతులు’ కలుపుతూ “ఈ రోజుల్లో ఎవడండి ? ఇంత గొప్ప నిజాయితీ గా ఉండేది” అంటూ అభినందించసాగాడు. నాలుగురయిదుగురు చుట్టూ చేరారు. ఎవరో లోకల్ టి‌వి కి ఫోన్ చెయ్య బోయారు.
అతను వారించానడు. మరెవరో ఇన్సిడెంట్ అంతా ఫోన్ లో ఫోటో తీసుకోబోయారు.
లేదండీ.. ఇలాటి విషయాలు ప్రజలకి తెలియాలి. నిజాయితీ ఇంకా మన మద్య మిగిలే ఉంది అని తెలియాలి. మేనేజర్ పట్టు పట్టాడు.
“మీ. గోల మీదేనా? మా సమస్యలు మాకుండవా? ఇంటివద్ద మా ఆవిడకి టీవి న్యూస్ చూసే అలవాటు ఉంది.”
అతను ప్రాదేయపడ్డాడు. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...