Wednesday, 7 September 2016

లస్సీ దొంగ

తనవద్ద పని చేసే ‘రంగడి’ ని రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు కిశోర్.
మూడు నెలల నుండి గమనిస్తూ ఉన్నాడు అతను. తన మిత్రుల దగ్గర నుండి తెచ్చుకున్న ఖరీదయిన ‘లస్సీ’(లిక్కర్) దొంగచాటుగా తస్కరించి తాగటం, అనుమానం రాకుండా మినరల్ వాటర్ తో నింపడం. 
రుచి లో మార్పు అనుభవజ్ఞులకి వెంటనే తెలిసిపోతుంది 
బార్యతో ఒక రోజు హల్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతూ 
“రంగడు నా మందు తాగుతున్న విషయం వాడి చేతే చెప్పిస్తాను చూడు “ అన్నాడు. 
**
“ఒరేయ్ రంగా “ పిలిచాడు.
“సార్ “ సమాదానం వచ్చింది.
“బాటిల్ లో లస్సీ(లిక్కర్) దొంగతనంగా తాగేస్తున్నావు కదూ?”
“________”
“ఒరేయ్ రంగా?”
“సార్”
“లస్సీ దొంగవి నువ్వే కదా?”
“________”
కిషోర్ కి వళ్ళు మండింది.
కోపంగా కిచెన్ లోకి వచ్చి పిలిస్తే పలుకుతావు, ఏదయినా అడిగితే సమాదానం చెప్పవే ?
“సార్ .. ఇక్కడ ఈ వాషింగ్ మిషన్ ముందు ఒక తమాషా గా ఉంది. ఏదో ఒక్క పిలుపే వినబడుతుంది మిగిలినవన్నీ ఏమి వినబడటం లేదు “
“నిజమా? “
“అవును సార్ “
“సరే నేను ఇక్కడ ఉంటాను . నువ్వు హాల్లో కి వెళ్ళి మాడమ్ గారి దగ్గర ఉండి మాట్లాడు”
రంగడు హాల్లోకి, కిశోర్ కిచన్ లోనూ ఉండి మాట్లాడుకోవటం మొదలెట్టారు.
“సార్ “ పిలిచాడు. రంగడు.
“ఆ రంగా వినబడుతుంది”
“ఆర్నెళ్ళ క్రితం పని మానేసిన అమ్మాయిని, నిన్న మెటర్నటి హాస్పిటల్ వద్దకి తీసుకువెళ్లారు, ఎందుకు?” రంగడు అడిగాడు.
కిశోర్ రొప్పుకుంటూ హాల్లోకి పరిగెత్తి “ నిజమేరోయ్ అక్కడ పిలుపు ఒక్కటే వినబడుతుంది . నువ్వేళ్లి పని చూసుకో “
ఇప్పుడతను తలెత్తి మాడమ్ గారిని చూడాలి.
తరవాత ఏమయి ఉంటుంది ?
A. ఎగిరి కాళ్ళు పట్టుకోవటం.
B. నాకేమీ సంభందం లేదని బుకాయించడం
C. మిగిలిన లస్సీ మొత్తం వితౌట్ టచ్చింగ్ తాగేయ్యటం.
D. అర్జెంటు గా పని గుర్చొచ్చి రెండు జతలు బట్టలు పెట్టుకుని కాంపు కి వెళ్ళటం.
మీ ఆప్షన్ ని A/B/C/D ఆని టైప్ స్పేస్ ఇచ్చి,………….. అని టైప్ చేసి కిశోర్ గారికి పంపండి.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...