Friday, 2 September 2016

డియర్ బా ..

“డియర్ బా ..” 
ఒక్క సారి ఉలిక్కి పడ్డాడు అతను. లంచ్ అవర్లో బోజనం చేయటానికి కూర్చున్నప్పుడు, లంచ్ కారేజి, నాప్కిన్ తో బాటు బయట పడింది ఆ కాగితం. 
తనని బార్య మాత్రమే పిలిచే పేరు అది.. అవును అంజలి వ్రాసిన ఉత్తరం తనకే... ఒకే ఇంట్లో ఉంటూ ఫోన్లు, వ్హాట్సప్ప్ లు, imo లో ఇన్ని ఉండగా స్వదస్తూరితో ఉత్తరం...
"డియర్ బా ..
నెల రోజులుగా గమనిస్తున్నాను. నేను అడగకుండానే, ప్రత్యేకమయిన సందర్బాలు లేకుండానే నువ్వు ఈ మద్య నాకు బహుమతులు తెస్తున్నావు.. అవి నన్ను తాత్కాలికంగా సంతోష పెట్టినా.. ఒంటరిగా ఉన్నాప్పుడు వేటాడుతున్నాయి.
ఏదో బార్య కి ఇష్టం లేని పని చేసినప్పుడు, సహజంగా బర్త ఇచ్చే కాంపన్సేషన్ బహుమతులు అనిపిస్తుంది. 

అలాటి పరిస్తితి అయితే, దానినుండి బయటకు రావటం కూడా మీ చేతిలోనే ఉంది.
మనమిద్దరం 'మనం' గా ఉండి పోవటానికి నా వంతు గా నేను సిద్దంగా ఉన్నాను.
కాలం తో పాటు మోనాటని కూడా పెరుకుపోతుంది మన మధ్య..
వెంటనే ఒక వారం సెలవు పట్టండి. పనులెప్పుడు ఉంటాయి.. మనం కొచ్చిన్ వెళ్దాం. నన్ను తీసుకెళ్తానని పదేళ్ళ క్రితం నుండి చెబుతున్నారు.
ఇంతకు మించి .. ఈ విషయం మీద మనం మాట్లాడుకోవద్దు.. మాటలు మన మద్య అఘాధాన్ని సృష్టిస్తాయి."
ప్రేమతో...నీ అంజలి. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...