పూర్వం
ఒక రాజ్యం లో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను బలమయిన ఏనుగులను సేకరించి పోషిస్తూ వాటిని
రాజుగారి సైన్యానికి సరఫరా చేసేవాడు. వృద్దాప్యం తో మరణ శయ్యపై ఉన్నప్పుడు తన ఆస్తి
మొత్తాన్ని ముగ్గురు కుమారులకు పంచుతూ వీలునామా వ్రాయించి కాలం చేశాడు.
కుమారులు
శ్రద్దగా తండ్రికి అంత్య క్రియలు నిర్వహించారు. ఖర్మాతరం తీరిగ్గా కూర్చుని వీలునామా
చూచారు. తండ్రి చెప్పిన విదంగా అన్నీ పంచుకోగలిగారు కానీ ఆస్తిలో ఎక్కువ విలువ చేసే
ఏనుగులను మాత్రం పంచుకోలేక పోయారు. పెద్ద కుమారునికి
సగభాగం (1/2) అని, రెండవ వానికి మూడో వంతు(1/3) అని, చిన్న వాడికి తొమ్మితో
వంతు (1/9) అని వీలునామా సారాంశం .
ఉన్న
17 ఏనుగులను ఇలా పంచుకోవటం వారికి సాధ్యం అవలేదు. తమలో తాము కలహించుకోసాగారు.
విషయం
వ్యాపారి వద్ద రాజు గారి తరపున ఏనుగులు కొనుగోలు
చేసే సైన్యాధికారి వద్దకి చేరింది.
ఆయన
వచ్చి కుమారులని పరామర్శించి, వీలునామాను చదివి సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నాడు.
తను
అదిరోహించి వచ్చిన ఏనుగును వీటితో కలిపాడు. మొత్తం 17+1=18 ఏనుగులయ్యాయి.
పెద్ద
కుమారుడికి సగభాగం అంటే 18/2=9 ఏనులను పంచాడు.
రెండవ
కుమారునికి ముడవబాగం అంటే 18/3=6 ఏనుగులను పంచాడు.
మూడవవానికి
తొమ్మిదవ బాగం గా 18/9=2 ఏనుగులను తీసుకోమన్నాడు.
ముగ్గురు
17 ఏనుగులను పంచుకోగా మిగిలిన తన ఏనుగు ఎక్కి తాపీగా వెళ్లిపోయాడు.
***
జీవితం
తో మనకి వచ్చే సమస్యలు ఇలాటివే.
వాటిని
పరిష్కరించుకోవటానికి సైన్యాదికారి గారి ఏనుగు లాటిది ఏదో కావాలి .
అదే
‘దైవ సహాయం.’
...
మిత్రులకి
శుభోదయం.
No comments:
Post a Comment