Saturday, 3 September 2016

బర్త్ డే గిఫ్ట్.

ఆఫీసు లో మేనేజర్ బర్త్ డే సెలబ్రేట్ చేయాలని స్టాఫ్ ఫిక్స్ అయ్యారు.
సాయంత్రం ఆఫీసు అవర్స్ అయ్యాక ఆయన కేబిన్ లో అందరూ సమావేశం అయ్యారు.
గుడ్ లుక్స్ కోసం పాటుపడే కొందరు శాలువా కప్పారు. బర్త్ డే కేక్ కట్ చేయించారు.
బొకెలు, షేక్ హ్యాండ్లు .. అభినందనలు. హగ్ లు...
స్టాఫ్ అంతా కలిసి ఒక బాగా పాక్ చేసిన కార్టన్ ఒకటి బహుమతిగా ఇచ్చారు. 
 మేనేజర్ పాకెట్ ఊపి చూశాడు.
పెట్టె ఒక వైపు తడిగా ఉండటం గమనించి , వేలు నోట్లో పెట్టుకుని రుచి చూసి, 
“థాంక్స్ ఫర్ ది షాంపైన్” చెప్పాడు.
“కాదండీ” అన్నారు స్టాఫ్.
ఈ సారి మళ్ళీ టేస్ట్ చేసి “వైన్??”
“ఊహూ “
“స్కాచ్???” పాకెట్ ని గట్టిగా వాసన చూసి అడిగాడాయన.
మళ్ళీ కాదనే సమాదానం
క్యూరియాసిటీ ఆపుకోలేక అప్పుడే ఆ గిఫ్ట్ పాక్ ఓపెన్ చేశాడాయన.

తెల్లటి పర్ తో  క్యూట్ గా ఉన్న పప్పి ఉంది అందులో. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...