Friday, 30 September 2016

ATM బాలన్స్

బార్య కి పాడయిపోయిన  స్మార్ట్ ఫోన్ బదులు మరో ఫోన్ కొనిపించడం మర్చి పోయిన శ్యాం కి ఇంట్లో శనివారం  పొద్దుటే టిఫిన్ పెట్టలేదు.
ATM సాఫ్ట్ వేర్ మైంటనెన్స్ చేసే శ్యాం కి ఆ పూట కి వీది చివర్లో ఉన్న మిత్రుడి హోటల్ కి వెళ్ళాడు.
కాషియర్ సీట్లో నుంచి లేచి వచ్చి న మిత్రుడు, పలకరింపుగా నవ్వి “ఏం కావాలి?” అని అడిగాడు, గ్లాసులోకి నీళ్ళు వంచుతూ..
ఎమున్నాయి?”
ఇడ్లీ, వడ, దోసె, పూరీ, పెసర, మసాలా దోశె “ 
“మసాలా దోశె చెప్పండి”
“లేదు”
“పెసర?”
లేదు”
“మరి ఏమి ఉంది?”
“ఏమీలేదు”
ఏమి లేవని మొదట్లో నే చెప్పొచ్చుగా?” శ్యాం చిరాకు పడ్డాడు.

“మీ ATM సంగతేమిటి.? కార్డు సరిగా ఇన్సర్ట్ చెయ్యమంటుంది!, 1 నుండి 15 లోపు అంకె నొక్క మంటుంది.1 PIN నెంబరు అడుగుతుంది. మొదట్లో ఏం భాష కావాలి అంటుంది!, బ్యాంకింగ్, కాష్ విత్ డ్రాయల్ అని అడుగుతుంది!. ఎంత కావాలి అంటుంది!, రశీదు కావాలా వద్దా!! అంటుంది. తీరా చివర్లో “ నో సఫిషియంట్ బాలన్స్!!!” అంటుంది. !     మరి మాకు మండదా ???

మనకి ఏమి కావాలి ??

ఒక ఆలయానికి ఒక బొమ్మ  ఏనుగు కావాల్సి వచ్చింది. దానిని చెయ్యమని ఒక వడ్రంగి కి చెప్పారు. అతడు మూడు నెలల పాటు శ్రమించి ఒక ఏనుగు తయారు చేశాడు. దాని నాణ్యత పరిశీలించడానికి మరో వడ్రంగి వెళ్ళాడు.
కూడా అతని చిన్న వయసు కుమార్తె కూడా వెళ్లింది.
ఏనుగును చూడగానే ఆ పాప “నాన్నా ! ఏనుగు వద్దకు వెళ్లకు, అది మిమ్మల్ని ఏమయినా చేస్తుంది” అని భయపడుతూ హెచ్చరించింది.
కానీ తండ్రి ఆమెని పట్టించుకోకుండా వెళ్ళి ఏనుగు ని తడిమి చూసి, అబ్బురంగా చూస్తుండి పోయాడు. తయారీకి వాడిన కలప నీ, శిల్పి పని తనాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు.
వడ్రంగి కి ఏనుగు కనిపించలేదు. కుమార్తె కి కలప కనిపించలేదు.
వస్తువు ఒక్కటే. భావన మాత్రం భిన్నం.
పరమాత్మ స్వరూపాన్ని ఎక్కడని వెతకటం? పరమాత్మ, పంచభూతాలు రెండు వేరు కాదు.
పరమాత్మ వేరు అని మనం  భావించినప్పుడు పంచ భూతాలు మాత్రమే కనిపిస్తాయి.
అదే పరమాత్మ అనుకుంటే.. పంచ భూతాలు మాయమవుతాయి.
మనకి  ఏమి కావాలి??  అనేది మనకే తెలుస్తుంది.
*****
(శైవ సిద్ధాంత సంబందమయిన గ్రంధాలను తిరుముర్తే అంటారు. తిరుమూలర్ అను యోగీశ్వరుడు వ్రాసినది మొదటి తిరుమూర్తే . అందులో ఆయన వ్రాసిన ఒక పధ్యం సారాంశాన్ని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు.)



Monday, 26 September 2016

దయామయుడయిన ప్రభువా!!

అనురాధ ట్రైని పైలెట్ తో టు మెన్ సీటర్ లో ఫ్త్లెయింగ్ ప్రాక్టీస్ చేస్తుంది.
అనుకోకుండా ట్రైనర్ కి కార్డియాక్ స్ట్రోక్ వచ్చింది.
వళ్లంతా చెమటలు పట్టాయి. మాట్లాడలేక పోతున్నాడు. ఊపిరి కూడా కష్టంగా ఉంది. కళ్ళు తేలేశాడు. 
అనురాధ కి పరిస్తితి అర్ధం అయింది. వెంటనే కంట్రోల్ రూముకి కనెక్ట్ అయింది.
"హలో.. హలో.. నేను ట్రైని పైలెట్ గయ్యాళి అనురాధని.
నా ట్రైనర్ కి హటాత్తుగా హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చింది. మన స్పృహలో లేడు.
అతని ప్రాణం పోయేలా ఉంది.
నాకు ఫ్లైట్ నడపటం పూర్తిగా రాదు. ఇన్స్త్రక్టర్ లేకుండా నాకేమీ తెలీదు మీరే కాపాడాలి."
రేడియో సిగ్నల్ నుండి ఒక లేడి గొంతు వినబడింది.
"ఏమి కంగారూ పడకు అనురాధా నేను కవితని.
ఇలాటివి చాలా డీల్ చేశాను. భయపడకుండా గుండెలనిండా గాలి పీల్చుకో. ప్రశాంతంగా ఉండు. కంగారూ పడితే ఎక్కువ తప్పులు చేసే ప్రమాదం ఉంది. .ఇప్పుడు ని ముందున్న డాష్ బోర్డు చూసి, నువ్వు ఉన్న ఎత్తు, పొజిషన్ సరిగ్గా చెప్పు"
అనురాధ వెంటనే చెప్పింది.
"ఎత్తు 165 సెంటీమీటర్లు. హై హిల్స్ తో కలిపి 171. కుడివైపు సీట్లో కూర్చుని ఉన్నాను"
అటునుండి కొద్ది సేపు మౌనం.
"నేను చెప్పేది పలుకు.. దయామయుడయిన ప్రభువా!! :p 

Sunday, 25 September 2016

అమృత

నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 14 వ తేదీ. 
రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. అతను స్కూల్ కి వెళ్లలేదని మర్నాడు తెల్సింది.
అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ దిగాలు పడి ఉన్నారు. అన్న ముఖం వేలాడేసుని వచ్చాడు. బోలెడు దుఖం తో అతను నిలువునా మునిగి ఉన్నాడు. 
అన్న కి చిన్న చెల్లెలు ని నేను. నేనంటే అన్న ఎంతో ప్రేమగా ఉండేవాడు. 
“అన్నా ఎందుకింత ఆలస్యం అయింది.? ఎక్కడికెల్లావు ?” అని నేను ఆందోళనగా అడిగాను. 
“ఏమి తెచ్చానో చూడు” చేతి లో జేబులోంచి తీసిన ఎర్ర సీసాని చూపించాడు.
అందులో మట్టి ఉంది. మట్టి రంగు ఎరుపుగా ఉంది. తడిగా ఉంది.
“ఏమిటిది?” నేను భయంగా అడిగాను.
“ఇందులో ఉన్నది 360 మంది భారతీయుల రక్తం తో తడిచిన మట్టి ఉంది. రోలర్ చట్టానికి శాంతియుత నిరసన తెలపటం కోసం సమావేశమయిన వేలాది ప్రజలమీద కి, నిన్న జనరల్ డయ్యర్ మరఫిరంగులతో కాల్పులు జరిపాడు. ఎందరో చనిపోయారు. ఆ వీరుల రక్తం తో తడిచిన జలియన్ వాలా బాగ్ మట్టి ఈ సీసా లో ఉంది.” అన్న దుఖం తో ఒక్కో మాట చెప్పాడు.
అక్కడ ఏమి చూశాడో, ఏమి విన్నాడో తడబడుతు చెప్పాడు.
ఈ రోజు అన్న ఆహారం ముట్టలేదు. తోటలో నుండి చాలా పూలు తెచ్చి ఆ సీసాని అలంకరించాడు. దానికి మోకరిల్లాడు. తనలో తానే ఏవేవే మాట్లాడుకున్నాడు. బహుశా మనసులోనే ఏవో స్థిరంగా నిశ్చయించుకుని ఉంటాడు.
ఈ హుతాత్ముల రక్తం తో ఆయనకి సన్నిహిత సంభందం ఏర్పడింది. అందుకే తను గూడా విప్లవ కారులకు నాయకుడై ఆత్మ బలిదానం చేశాడు.
మీ కింతకి మా అన్న పేరు చెప్పలేదు కదూ... ఆయన్ని మీరు ఎరుగుదురు . ఆయన పేరు భగత్ సింగ్.

చంద్ర శేఖర ఆజాద్

చంద్ర శేఖర తివారీ, జులై 23 న 1906 లో మద్య ప్రదేశ్ లోని 'భవ్రా' గ్రామంలో జన్మించారు. 
తండ్రి సీతారాం తివారి, తల్లి జాగ్రాని దేవి (మూడో బార్య). మొదటి ఇద్దరు బార్యలు చనిపోయారు. 
చంద్ర శేఖర్ ని తల్లి ఒక గొప్ప సంస్కృత పండితుడిగా చూడాలని కల కనేది. అందుకే ప్రఖ్యాత హిందూ విశ్వవియాలయం (బెనారస్) లో చంద్ర శేఖర్ ని చేర్పించారు. 15 ఏళ్ల వయసున్నప్పుడు, మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని డిసెంబర్ 1921 లో అరెస్టు అయ్యాడు. 
మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు తన పేరు ను ‘ఆజాద్’ అని తన తండ్రి పేరు ‘స్వతంత్ర’ అని తన భావజాలం లో ఉన్న పదాలని దిక్కార స్వరం తో చెప్పాడు.
జైలు నే తన ఊరు అని చెప్పి, 16 హంటర్ దెబ్బలని శిక్షగా పొందాడు.
'వందేమాతరం' నినాదం తో వాటిని స్వీకరించి, సొమ్మసిల్లి పోయాడు.
ఆనాటి నుండి అతను చంద్ర శేఖర ఆజాద్ అయ్యాడు. 



1922 లో జైలు నుండి విడుదల అయ్యాక అతను మరింత కరుడుగట్టిన స్వతంత్ర భారత అభిలాషి అయ్యాడు. HRA (హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్) స్తాపకుడు శ్రీ రామ్ ప్రసాద్ బిస్మిల్ తో పరిచయం అయినప్పుడు “ నీలో దేశభక్తి ని చూడాలను కుంటున్నాను” అన్నప్పుడు చంద్ర శేఖర్ ఒక వెలుగుతున్న దీపం మీద తన చేతిని ఉంచాడు. శరీరం కాలి వాసన వేస్తున్నా, అతను చలించలేదు. రామ్ ప్రసాద్ బిస్మిల్ అతన్ని వారించి HRA లో కి ఆహ్వానించాడు. అప్పటి నుండి చంద్ర శేఖర్ తను నమ్మిన HRA కి నిధులు వసూలు చేయటం మొదలెట్టాడు. ఎక్కువభాగం నిదులు బ్రిటిష్ ప్రభుత్వం నుండి కొల్లగొట్టనవి సేకరించేవాడు. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఒక నూతన ఇండియా ని నిర్మించాలని భావించాడు.
1925 లో జరిగిన కకొరి రైలు రాబరీ లో అతని పాత్ర ఉంది. 1926 లో విక్టోరియా రైల్ ను పేల్చే ప్రయత్నం చేశాడు.
మోతీలాల్ నెహ్రూ నుండి కూడా నిధులు వసూలు చేసేవాడు.
రైలు రాబరీ తర్వాత ఆజాద్ అజ్ఞాతవాసంలో కెళ్ళాడు.
ఝాన్సి సమీపం లోని అడవుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని తన అనుచరులకి తుపాకి కాల్చడం లో శిక్షణ ఇచ్చాడు . పరిసర గ్రామాలలోని యువకులని చేరదీసి దేశభక్తి నూరి పోసేవాడు, సైనిక శిక్షణ ఇచ్చేవాడు.
1929 మే 2న పార్లమెంటుపై జరిగిన బాంబు దాడి కేసులో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష ఖరారు చేశాయి న్యాయస్థానాలు. అది తెలిసి ఆజాద్ విచలితుడయ్యాడు. వారిని విడిపించేందుకు ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 1931 ఫిబ్రవరి 27న జవహర్‌లాల్ నెహ్రూని కలిశాడు ఆజాద్. విప్లవ వీరులైన భగత్‌సింగ్ తదితరుల్ని విడిపించేందుకు సహకరించమన్నాడు. నెహ్రూ అందుకు అవుననలేదు, కాదనలేదు. ఆజాద్ అక్కడి నుంచి నేరుగా అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కుకి వెళ్లాడు. ఓ చెట్టు కింద ఇద్దరు మిత్రులతో కూచున్నాడు. భగత్ త్రయాన్ని ఎలాగైనా విడిపించేందుకు వారితో చర్చిస్తున్నాడు. అంతలో వారిలో ఒకరు పోలీసు ఇన్‌ఫార్మర్ అని అనుమానమేసింది. చప్పున కుడిచేయి మోకాలి దగ్గరి రివాల్వర్ దగ్గరకు వెళ్లింది. అదే క్షణంలో పోలీసులు చుట్టు ముట్టారు . ఆజాద్ వెంటనే కాల్పులు జరిపాడు . ముగ్గురు పోలీసులు తూటాలకు బలైపోయారు. ఒక్క పోలీసు కూడా తనను ముట్టుకోకుండా తుపాకీని కాలుస్తూనే ఉన్నాడు ఆజాద్. ఇక ఒక్క బుల్లెట్ మాత్రమే మిగిలింది. అది కూడా అయిపోతే పోలీసులకు తాను పట్టుబడటం ఖాయం. బతికుండగా బ్రిటిష్ వారికి చిక్కడమా? నెవ్వర్!అనుకున్నాడు. అంతే! ఆ ఒక్క తూటాతో తననే కాల్చుకున్నాడు ఆజాద్.
నేల కొరిగాడు.అప్పటికి అతని వయసు 24 ఏళ్ళు మాత్రమే..


 సజీవంగా బ్రిటిష్ ప్రభుత్వానికి దొరకను అని చెప్పిన మాట నిలబెట్టుకున్న వీరుడు. “చంద్ర శేఖర ఆజాద్”

Saturday, 24 September 2016

ప్రశ్నించే అలవాటు

Israel Isaac Rabi (29 July 1898 – 11 January 1988)
సౌకర్యంగా 'డాక్టర్ రాబి' అందాం. 

1944 నోబెల్ బహుమతి తీసుకున్న ఫిజిక్స్ శాస్త్రవేత్త. 
మిక్రోవేవ్ రాడార్స్ & ఒవెన్స్ పని చేయటం లో కీలకమయిన ‘న్యూక్లియర్ మాగ్నెటిక్ రిసోనెన్స్ ని కనిపెట్టిన మేధావి’ 
నోబుల్ ప్రైజ్ స్వీకరించాక న్యూ యార్క్ లో ఒక పత్రికా విలేఖరి వారిని కలుసుకు ని ఇంటర్వ్యూ కోరాడు. 
“మీ విజయానికి వెనుక రహస్యం ఏమిటి?”
అందుకాయన ఏమాత్రం ఏమాత్రం ఆలోచించకుండా “ మా అమ్మ” అని సమాదానం ఇచ్చాడు.
విలేఖరి ఆశర్యపోయాడు. “అదెలా?” అని అడిగాడు .
అందుకాయన “రోజు నేను స్కూల్ నుండి రాగానే, మా అమ్మ నన్ను అడిగేది.
“ఈ రోజు స్కూల్ లో మీ క్లాస్ టీచర్ ని ఎమయినా మంచి ప్రశ్న వేశావా ?” అని
‘ టీచర్ ని మంచి ప్రశ్న అడగాలంటే ఆలోచించాలి. రోజు పడుకోబోయే ముందు మర్నాడు టీచర్ ని అడగటం కోసం ఒక మంచి ప్రశ్న సిద్దం చేసుకునేవాడిని. నా ఆలోచనలకి పదును పెట్టేవాడిని. మా అమ్మ నాకు నేర్పిన ప్రశ్నలు అడిగే స్వభావమే, నాకు నోబెల్ బహుమతి రావటానికి కారణం

Friday, 23 September 2016

మరొక్క ఛాన్స్


ఆడవాళ్ళ అఘాయిత్యం మీద, అజ్ఞానం మీద జోకులు వేస్తున్నారని ఎఫ్‌బి లో లేడీస్ అంతా మాట్లాడుకుని ఒక పెద్ద ఆడిటోరియమ్ లో ఆందోళన చేపట్టారు. భారిగా ఆడ లేడీస్ ని పోగుచేశారు. జయశ్రీ దీనికి నేతృత్వం వహిస్తుంది.
హోరున సౌండ్ వచ్చే ఆడియో సిస్టెమ్,
లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ పెద్ద శబ్దం తో  పాటలు ..సభ మొదలయ్యింది.
మైకులు, విరగొట్టేట్టు ఉపన్యాసాలు దంచేస్తున్నారు. ఒక పక్క కొత్త గా మార్కెట్ లోకి వచ్చిన చీరల ప్రదర్శన మన సిమ్రాన్ , కొత్త గా మార్కెట్ లోకి వచ్చిన జాకెట్లు డిజైన్లు ఒక స్టాల్ లో కృష్ణవేణి ఆ కార్యక్రమం చూస్తున్నారు, మరో స్టాల్ లో త్యాగరాయ కృతుల పుస్తకాలు, పాటల సీడీ లు వ్యవహారం కవితా చూస్తుంది. పబ్లిసిటీ వ్యవహారాలు, వైదేహి, సెక్యూరిటి వ్యవహారం, బెదిరింపు మాటలు వ్యవహారం అనురాధ చూస్తుంది, అందర్నీ క్రమశిక్షణ లో కూర్చోబెట్టటం, ఇందిరా దేవి పని. నేతి వంటకాల స్టాల్ జయదుర్గ చూస్తుంది. ఒన్ గ్రామ్ గోల్డ్ స్టాల్ వద్ద జ్యోతి ఉంది.
FB లో మహిలళని తక్కువ చేసి పోస్ట్ లు వ్రాస్తున్న విషయాన్ని మహిళలందరు గమనించాలని, నిర్లక్షం చేస్తే మహిళలే మహిళలని గేలి చేసుకోవాల్సి వస్తుందని ప్రారంభోపన్యాసం జయశ్రీ చేసింది.
ఒక్కక్కరుగా వచ్చి ఎఫ్‌బి లోని  ఏ పోస్ట్ లో ఏ అంశాలలో తమని తక్కువ చేశారో వివరించసాగారు. తరచుగా కొందరు సాహస వీరుల పేర్లు గూడా గుర్తుచేసుకున్నారు. మీడియా అంతా ఈ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేస్తూంది. విదేశాల లో ఉన్న వారి సౌకర్యార్ధం fb live వీడియో లో అప్లోడ్ చేస్తున్నారు.
మహిళలని పురుషుల తో పాటు సమాన తెలివితేటలు గల వారీగా గుర్తించాలని ఏక వాక్య  తీర్మానం తో స్లోగాన్స్ మొదలయ్యాయి. ఎవరో పెద్దగా కేకలేస్తున్నారు. కొత్తగా కొన్న నగలు, చీరలు కనిపించెట్టు ఒక్కొక్కరు వేదిక మీదికి వచ్చి ఒకటి రెండు మాటలు పావుగంట లో చెప్పి వెళ్తున్నారు.
ఇంట్లో కనీసం టిఫిన్ కూడా వండిపెట్టకుండా వచ్చిన బార్య  ఇందిర ని వెతుక్కుంటూ హెడ్మాస్టరుగా రిటైర్ అయిన ప్రసాద్ గారు వచ్చారు.
“నేను రాను .. ఈ విషయం ఆటో ఇటో తేలాల్సిందే .” గట్టిగా చెప్పింది ఆవిడ. అప్పుడే రెండు పెరుగు వడలు సుప్రియ తచ్చి ఇస్తే చాటుగా మింగి ఉంది.
“ఇక్కడికి వచ్చిన వాళ్లలో ఒక్కరికన్నా బుర్ర ఉందా?” ఆయన మందలింపుగా అన్నాడు.
విషయం డైవర్ట్ అయింది. ఒకరి కొకరు మాట్లాడుకోవటం చివరికి ఆడవాళ్ళ తెలివితేటలకి పరీక్ష పెట్టాలని నిర్ణయం జరిగి పోయింది.
వేదిక మీదకి ప్రసాదు మాస్టారు రావాల్సి వచ్చింది.
వేదిక మీదికి ఒక తెలివయిన మహిళని పిలిచారు.
“విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ కలర్ ఏమిటి?”
“నలుపు” అందావిడ వెంటనే
తప్పు. మాస్టారు చెప్పాడు
ఆడవాళ్ళందరూ తిరగబడ్డారు. సరళమయిన ప్రశ్నలు ఆడగాలని.
“డజను డజన్లు ఎంత ?” మాస్టారు మరొకరిని  వేదిక మీదికి పిలిచి అడిగారు.
“120” చెప్పిందావిడ . తప్పు అన్నాడు మాస్టారు. శ్రోతల్లో కలకలం.
సభికులందరూ ఇక్కొక్క ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కేకలెట్ట సాగారు.
“సరే.. తులానికి ఎన్ని గ్రాములు ?”
పన్నెండు  “ సమాదానం.
తప్పు .. మరొక్క ఛాన్స్ అంటూ పెద్దగా కేకలు.
మరొక ప్రశ్న. “ఆక్టోపస్ కి ఎన్ని కాళ్ళు ?”
“ఎనిమిది “ అనేది మరోకావిడ  సమాదానం.
***
మరొక్క ఛాన్స్ అంటూ సభికులందరూ పెద్దగా హోరు :D :p  



Thursday, 22 September 2016

గాయత్రి మంత్రం

మహాత్మా గాంధీ గారి హత్య జరిగిన రోజుల్లో .. 
ఒక మతి బ్రమించిన వ్యక్తి ‘రమణమహర్షి’ వద్దకు వచ్చి 
“గాందీ ని చంపిన గాడ్సే అందరి కి తెలిసాడు. నేను నిన్ను చంపి కీర్తి సంపాదిస్తాను” అన్నాడు ఉగ్రంగా.
భగవాన్ “చంపు నాయనా. నాకీ దేహ బాద తప్పుతుంది” అన్నాడు శాంతి వదనం తో. 
ఇంతలో ఆశ్రమ వాసులు అతన్ని అటకాయించి, దూరంగా తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారు.
భగవాన్ వారించి అతన్ని తనవద్దే ఉంచుకుని తనతో బోజనానికి తీసుకువెళ్లాడు. రెండు రోజులు అతను ఆశ్రమం లో ఉండి పోయాక అతని తాలూకు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు.
జరిగిన విషయం తలుసుకుని “మన్నించండి. అతనికి మనస్థిమితం లేదు. ఏదయినా తరుణో పాయం ఉపదేశించండి " అని వేడుకున్నారు.
“గాయత్రి చేయించండి” అన్నారు భగవాన్. 


కొన్ని నెలల తర్వాత అతను తిరిగి వచ్చాడు. “పరిస్తితి చాలా మెరుగయ్యిందని. సాదారణ జీవితం లోకి తనని గాయత్రి మంత్రం తీసుకువచ్చిందని దన్యవాదాలు చెప్పుకోటానికి వచ్చానని” చెప్పి భగవాన్ ఆశీర్వచనం తీసుకున్నాడు.
(ఈ సంఘటన ‘రమణ వాణి ‘ లో ప్రచురింపబడింది)

Wednesday, 21 September 2016

మానవ సేవ

ఒక వ్యక్తి కష్టాలలో  ఉన్నవారికి ప్రేమ భావంతో తనకు చేత నయిన  సేవ చేస్తూండే వాడు.
తిరిగి ఏమి ఆశించేవాడు కాదు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మేవాడు.
ప్రతి మానవుడు దైవస్వరూపమే అని మానవునికి సేవ చేస్తే అది దైవానికి చేరుతుందని దృడంగా నమ్మేవాడు.
ఒక రోజు రాత్రి అంతనికి ఘాడ నిద్రలో మెలకువ వచ్చింది.
కిటికీ నుండి వెన్నెల కురిసే చోట ఒక దేవదూత కూర్చుంది.
ఒక బంగారు పుస్తకం లో ఏదో వ్రాస్తూ ఉంది. అతను నెమ్మదిగా లేచాడు.
ఆమె వద్దకు నడిచాడు. ఆమె అతనిని చూసి పలకరింపుగా నవ్వింది. ఇద్దరి మధ్య కొంత సంభాషణ నడిచింది.
“ఏమి వ్రాస్తున్నావు?” అతను అడిగాడు.
“బగవంతుని ప్రేమిస్తున్న వారి జాబితా వ్రాస్తున్నాను.” అందామే.
“అందులో నా పేరు ఉందా?” అతను విస్మయంగా అడిగాడు.
ఆమె మందహాసం తో ఆ పుస్తకం అతనికి ఇచ్చింది. అతను తన పేరు కోసం అంతా వెతికాడు.
అందులో తన పేరు లేదు.
తలెత్తి చూసేసరికి దేవదూత కూడా లేదు.
***
కొన్నాళ్ళకి మరో వెన్నెల రోజు ఆమె  వచ్చింది. కాంతి పుంజం లో కూర్చుని మరో పుస్తకం వ్రాస్తూ ఉంది.
“ఈ సారి ఏమి వ్రాస్తున్నావు?”
ఆమె నవ్వి భగవంతుడు ప్రేమిస్తున్న వారి జాబితా” అంది.
మళ్ళీ అతను అదే ప్రశ్న వేశాడు. “నా పేరు ఉందా?”
ఆమె వ్రాయటం పూర్తయ్యాక అతని చేతిలో పుస్తకం ఉంచింది.
అతను పుస్తకం యదాలాపంగా చూశాడు. మొదటి పేజీ లోనే అతని  పేరు ఉంది .
(పిల్లల కోసం)


Monday, 19 September 2016

అరటిపళ్లు- ఒంటె

వైజాక్ లోని ఒక వ్యాపారి వద్ద 3000 ఆరటి పళ్ళు ఉన్నాయి. 
వాటిని 800 కిలోమీటర్ల దూరం లోని మద్రాసుకి ఒంటెమీద చేర్చాల్సి ఉంది. 
ఒకే ఒక ఒంటె అతని వద్ద ఉంది. 
ప్రతి కిలో మీటరు ప్రయాణానికి ఒంటె ఒక ఆరటి పండు తింటుంది. 
1000 అరటిపండ్ల కంటే ఎక్కువ మోయలేదు. మార్గమధ్యం లో ఎన్నిసార్లయినను పళ్ళు దించుకొనవచ్చు. 
సహాయకునితో బయలుదేరిన ఆయన   ఎన్నిఎక్కువ పండ్లు మద్రాసు చేర్చగలడు? ఎలా? 


..
(పండ్లు పాడగును/ ఒంటె అలసిపోవును/ తోడుగా వెళ్ళిన మావటి కొన్ని మోసుకు పోవును లాటి మార్గాంతరాలు వెతకొద్దు)..
..
Please give a try. :) :

Sunday, 18 September 2016

అప్పుడూ.. ఇప్పుడూ

ఒక యాక్సిడెంటు లో బార్యా బర్తలు సుఖంగా చనిపోయారు.
..
దయ్యాలై 'వైతరిణి' వద్ద కలుసుకున్నారు. 
..
"నువ్వేం మార్లేదు కాంతం. అలాగే ఉన్నావు" అంది మగ దెయ్యం

దైవ సహాయం

పూర్వం ఒక రాజ్యం లో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను బలమయిన ఏనుగులను సేకరించి పోషిస్తూ వాటిని రాజుగారి సైన్యానికి సరఫరా చేసేవాడు. వృద్దాప్యం తో మరణ శయ్యపై ఉన్నప్పుడు తన ఆస్తి మొత్తాన్ని ముగ్గురు కుమారులకు పంచుతూ వీలునామా వ్రాయించి  కాలం చేశాడు.
కుమారులు శ్రద్దగా తండ్రికి అంత్య క్రియలు నిర్వహించారు. ఖర్మాతరం తీరిగ్గా కూర్చుని వీలునామా చూచారు. తండ్రి చెప్పిన విదంగా అన్నీ పంచుకోగలిగారు కానీ ఆస్తిలో ఎక్కువ విలువ చేసే  ఏనుగులను మాత్రం పంచుకోలేక పోయారు. పెద్ద కుమారునికి సగభాగం (1/2) అని, రెండవ వానికి మూడో వంతు(1/3) అని, చిన్న వాడికి తొమ్మితో వంతు (1/9) అని వీలునామా సారాంశం .
ఉన్న 17 ఏనుగులను ఇలా పంచుకోవటం వారికి సాధ్యం అవలేదు. తమలో తాము కలహించుకోసాగారు.
విషయం వ్యాపారి వద్ద రాజు గారి తరపున  ఏనుగులు కొనుగోలు చేసే సైన్యాధికారి వద్దకి చేరింది.
ఆయన వచ్చి కుమారులని పరామర్శించి, వీలునామాను చదివి సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నాడు.
తను అదిరోహించి వచ్చిన ఏనుగును వీటితో కలిపాడు. మొత్తం 17+1=18 ఏనుగులయ్యాయి.

పెద్ద కుమారుడికి సగభాగం అంటే 18/2=9 ఏనులను పంచాడు.
రెండవ కుమారునికి ముడవబాగం అంటే 18/3=6 ఏనుగులను పంచాడు.  
మూడవవానికి తొమ్మిదవ బాగం గా 18/9=2 ఏనుగులను తీసుకోమన్నాడు.
ముగ్గురు 17 ఏనుగులను పంచుకోగా మిగిలిన తన ఏనుగు ఎక్కి తాపీగా వెళ్లిపోయాడు.
***
జీవితం తో మనకి వచ్చే సమస్యలు ఇలాటివే.
వాటిని పరిష్కరించుకోవటానికి సైన్యాదికారి గారి ఏనుగు లాటిది ఏదో కావాలి .
అదే   దైవ సహాయం.
...

మిత్రులకి శుభోదయం.  

Saturday, 17 September 2016

యుద్దం లో గెలుపే ముగింపు

యుద్దం లో న్యాయం అన్యాయం అనేవి ఉండవు. కేవలం గెలుపే ముగింపు.
రక్తపాతమే మార్గం. ఇది చరిత్ర పుటల్లో ఎక్కడయినా తారసపడే నిజం.
షాజహాన్ తన ప్రియమయిన  మూడవ బార్య ముంతాజ్ (అర్జుమన్ భాను బేగం) 14 గవ బిడ్డకు జన్మనిస్తూ 38 వ యేట 1631 లో  గుర్రపువాతం తో చనిపోయింది.
షాజహాన్ కుంగి పోయాడు. ఆమె గుర్తుగా 22 ఏళ్లపాటు తన ధనాగారం మొత్తాన్ని  వెచ్చించి అగ్రాలో యమునా తీరం లో  తాజ్మహల్ నిర్మించాడు.
అక్కడి నుండి మైలు దూరం లో నే అతని కోట. బార్య చనిపోయిన 26 ఏండ్ల తర్వాత 1657 ప్రాంతం లో మొఘల్ చకరవర్తి షాజహాన్ కి జబ్బు చేసింది.
తండ్రి త్వరగా కాలం చేస్తే సింహాసనం ఆక్రమించవచ్చు అని నలుగురు కుమారులు కాచుకుని ఉన్నారు.
ఆదిపత్యం కోసం తమలో తాము పోరాడు కున్నారు. పెద్ద కొడుకు దారాసుఖోవ్’, ఔరంగజేబ్ చేతిలో ఓడిపోయి ఆగ్రా కోటకి పారిపోయాడు. కోటలో షాజహాను తో కలిసి ఆత్మరక్షణ చేసుకున్నాడు. కోట తలుపులు మూసివేసి సైన్యం తో సహా లోపలే ఉండి పోయారు.
ఆగ్రా కోట అత్యంత బలమైనది. దానిలో ప్రవేశించడం ఔరంగజేబుకి క్లిష్టమయింది. అతనొక పన్నాగం పన్నాడు. కోటలో జబ్బుచేసి ఉన్న తండ్రికి ఒక లేఖ వ్రాశాడు. నేను మహా పాపిని జహాపనా.. నీతో యుద్దం చేయటం, మహా నేరం తప్పు అని తెలుసుకున్నాను. నా మనసు దుఖం తో పూడుకుని ఉంది. నేను వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటే తప్ప నాకు మనసు కి ప్రశాంతత లేదు. కోట తలుపులు తెరిపించు. ని ఇష్టం వచ్చిన కుమారునికి సింహాసనం ఇవ్వు. నా కెటువంటి అభ్యంతరం లేదు”

ఎంతయినా తండ్రి కదా?!!, ప్రక్కనున్న పెద్ద కుమారుడు వారిస్తున్న వినకుండా కోట తలుపులు తెరిపించాడు. ఔరంగజేబు సైన్యం తో పాటు కోటలోకి ప్రవేశించాడు. మొదట తండ్రిని ఖైదు చేశాడు. అన్నకి శిరో ముండనం చేయించాడు. వీధుల్లో ఊరేగించాడు. ఆ తర్వాత అతన్ని హేయంగా చంపించాడు.
షాజహాను మరో తొమ్మిదేళ్లు జీవించాడు. అంత కాలము ఖైదీ గానే జీవించాడు. తనకు అత్యంత ప్రియమయిన తాజ్మహల్ ని చూడాటానికి పోనివ్వమంటే, ఔరంగజేబు తండ్రికి అనుమతి ఇవ్వలేదు.
ఆగ్రా కోటలో తను బంధిగా ఉన్న గదిలో ఉన్న చిన్న కంత గుండా మైలు దూరం లో ఉన్న తేజోమయమయిన తాజ్ మహల్ ని చూస్తు.. చచ్చేంత వరకు తొమ్మిది సుదీర్గ సంవత్సరాలు కాలం గడిపాడు.

అందుచేత.. యుద్దం లో గెలుపే ప్రధానం. 

ఎవరు నేర్పారు?

తేనెటీగ జాతికి చెందిన ఒక ‘కందిరీగ’ ఉంది.


అది జీవితం లో ఒక సారి మాత్రమే గ్రుడ్లను పెట్టి చనిపోతుంది. తన బిడ్డలని తనెప్పుడు చూడదు. కానీ పుట్టబోయే బిడ్డలకు ముందుగానే ఆహారాన్ని సమకూరుస్తుంది. 
అది గడ్డి పురుగు (grass hopper) ని సంపాదించి దాన్ని వశం చేసుకుని సరిగ్గా ఎక్కడ కుట్టాలో అక్కడ కుడుతుంది.
 దాంతో ఆ పురుగు అచేతనం (unconscious) అవుతుంది. కానీ చావదు. బద్రపరచబడిన మాంసం రూపంలో అది బతుకుతుంది. 
ఆ కందిరీగ ఆ గడ్డి పురుగుని ఒక మట్టి అరలోకి తీసుకుపోతుంది. అక్కడ పురుగునకు తగినంత దగ్గరలో తన గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్లను పెట్టి అది ఎగిరిపోయి చనిపోతుంది. తన పిల్లలను ఎప్పుడు చూడలేదు. :(
గ్రుడ్ల నుండి పిల్లలు బయటకి వచ్చినపుడు అవి దగ్గరలో ఆ 'అచేతనమయిన' పురుగును కొద్ది కొద్దిగా కోరుక్కుని తింటూ ఏదుగుతాయి. కానీ చంపవు. వాటికి చచ్చిన పురుగుల మాంసం ప్రాణాపాయకారం.
తల్లి ఈగ తన గ్రుడ్ల నుండి రాబోయే పిల్లలకు ఆహారాన్ని సమకూర్చి ఎగిరి పోయి చనిపోవటం అనే ప్రక్రియ సృష్టి ఆరంభం నుండి జరుగుతూ ఉండి ఉండాలి. ఈ విధానాన్ని అది ఎక్కడో చూసి నేర్చుకొన్నదనటానికి అవకాశం లేదు.
'సృష్టికర్తే' దానికి బోదించి ఉండాలి.
(ఈ విషయం 1960 లో ప్రచురితమయిన Readers Digest, పత్రికలో ‘భగవంతుడు ఉన్నాడు అని విజ్ఞాన శాస్త్రవేత్తలు నమ్మటానికి ఏడు కారణాలు’ అనే వ్యాసం లోనిది.)
Good Morning.

Friday, 16 September 2016

బ్రహ్మచర్యం

ఒక్కోసారి సంభందం లేని మాటలు చాలా ఇబ్బంది పెడతాయి. 
సరిగ్గా గుడి ప్రసాదాల వితరణ సమయానికి కి పక్క అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి వస్తుంటాడు. నాలాగే :) 
మాట్లాడుకునే ప్రతి విషయం శ్రద్దగా వింటాడు. 
ఖచ్చితంగా అసందర్బపు మాట ఒకటో రెండో మాటలడతాడు. 
ఎందుకో మరి. 
ప్రసాదాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి అంతు చూసే బాద్యత మాలాటి కొంత మంది వీరులకి తప్పదు. బేసికల్ గా నేను వీరుడినే :D
గుడి బయట రోజు మాదిరిగానే చర్చ జరుగుతుంది.
మాల ధారణ, మండల దీక్ష లాటి విషయాలు ట్రైని పూజారి చెబుతున్నాడు.
రెండు పూటల స్నానము. ఒంటి పూట బోజనము, నేల పడక, సత్యవచనము, సత్య ప్రవర్తన, దీపారాధన, దైవపూజ
బ్రహ్మచర్యం ..
సరిగ్గా అప్పుడే అతను కల్పించుకుని “ఒక్కరేనా ఇద్దరూ పాటించాలా?” అన్నాడు.
***
“మాస్టారూ సుందరయ్య భవన్ రోడ్డు లో నాగేశ్వర రావు గారని మంచి చెవి డాక్టర్ ఉన్నారు, వెంటనే కలవండి” కొంచెం పెద్ద గొంతు తో చెప్పాను.

ఓనం విందు

‘ఓనం’ పండగ కి తమ ‘అరబ్’ బాస్ ని బోజనానికి ఆహ్వానించాడు సౌదీ లో మంచి కంపెనీ లో మంచి హోదా ఉద్యోగం చేస్తున్న పద్మనాభన్. 
పద్మనాభన్ అంటే మంచి అభిప్రాయం ఉన్న బాసుడు అంగీకరించాడు.
క్యూరియాసిటీ తో “veg ఆర్ non-veg” అడిగాడు.
“ఇది మా ట్రెడిషనల్ పండగ అండీ పూర్తి శాకాహారం. స్వామి ప్రసాదం వడ్డించినవి ఏమి వదలకుండా భక్తితో స్వీకరిస్తాం”
ఆయనకి అర్ధం అయ్యేట్టు ఆయన భాషలో పద్మనాభన్ వివరించాడు. 
ఎంతో గొప్ప బాసుడు అయినా ‘ఇంట్లో బాస్’ కి ఫోన్ చేసి బోజనానికి వెళ్తున్నవిషయం చెప్పాడు.
సంప్రదాయాలంటే విలువ ఉన్న బేగమ్ గారు “ వారు వెజిటబుల్స్ ఎక్కువగా వాడతారు మీకు నచ్చినా నచ్చక పోయినా సర్వ్ చేసినంతవరకు శుబ్రంగా తినండి “ అని హుకుం జారీ చేసింది.
***
మద్యాన్నం బాసుడు బోజనానికి వచ్చారు..
అలసందల తో చేసిన చిట్టి వడలు స్టాటర్ గా మొదలెట్టారు.
డైనింగ్ టేబుల్ మీద అరిటాకు పరిచి, రాగి గ్లాసుతో నీళ్ళు ఉంచారు.
వంట గదిలోనుండి కొబ్బరి వంటకాలు తీసుకు రావటానికి పద్మనాభం జంట లోపలికి వెళ్ళి వచ్చేసరికి
బాసుడు కష్టం గా గ్లాసులో నీళ్ళు తాగుతున్నాడు.
***
టేబుల్ మీద అరిటాకు మాయం.

(ఎత్తిపోతల పదకం .. నా మాటల్లో )

Thursday, 15 September 2016

చాయస్

ఫ్లయిట్ టెక్నికల్ క్లియరెన్స్ సమస్య వలన లేటయింది. 
గాల్లోకి ఎగరగానే, అనౌన్స్మెంట్ వినిపించింది. “ లేటయినందుకు క్షమాపణలు, నష్టపరిహారం గా మీకు ఫ్రీ డ్రింక్స్ సర్వీస్ ఉంది.”
అందమయిన ఫ్లయిట్ అటెండెంట్ వయ్యారంగా నడుచుకుంటూ డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. 
చివరి సీట్లో ఒక ‘పెద్ద మనిషి’ కూర్చుని ఉన్నారు. 
ఆయన ముఖం గంభీరంగా పెట్టి “ నేను adulteration కి అయినా సిద్దమే కానీ ప్రాణం పోయినా మధ్యం ముట్టుకోను” అన్నాడు. 
అప్పటికే డ్రింకు తాగేసిన పక్క సీటు అతను కంగారుగా ముందుకు వంగి తెల్లటి హోస్టేస్ ని ఆసక్తి గా చూస్తూ..
“ చాయస్ ఉందని నాకు తెలీదు.. ఇది తొండి .. నేనొప్పుకొను” బోరు మన్నాడు.
(పెద్ద పిల్ల కాయలకోసం :D :p :p )

రాజు గారు ఉత్తములు

‘శిస్తు’ కింద పది మూటల బియ్యం తీసుకుని, పది వడ్ల మూటల ఇచ్చే గుణం కలిగిన రాజు గారు పోయారు.
..
ప్రజలు పబ్లిక్ గా ఏడుస్తూ, ఆనందించారు. 
..
‘వేగులు’ ద్వారా రాజ్యాభిషేకం అయిన ‘యువరాజా’ వారికి విషయం పోక్కింది.
..
“ఆ ..రోజుల్లో మరి నాన్న గారికి .. ఆ ..ఆ మంచి పేరు తేవాలంటే? “ అని చర్చ లేవదీశారు.
..
పలక మీద ఉన్న గీత పక్కన పెద్ద గీత గీసి మంత్రి గారు 'హింటు' వదిలారు.
కొత్త శిస్తు పాలనలోకి వచ్చింది.
..
“పది మూటల బియ్యం, బదులు పది మూటల ‘పొట్టు’ ఇచ్చేట్టు దండోరా వేయబడింది.
..
(పిల్లల కోసం.. )

Wednesday, 14 September 2016

గయ్యాళి

వేగంగా వెళ్ళే కారు కి పెట్రోలింగ్ వెహికల్ అడ్డుగా వచ్చింది.
పెద్దావిడ డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే ముసలాయన కూర్చొని ఉన్నాడు. 
“ స్పీడ్ లిమిట్ దాటి నట్టున్నారు?” అన్నాడు హింది లో .
అవిడ 'ఏమంటున్నాడు?' అంది బర్తతో.
“ నువు వేగంగా వెళ్తున్నవని అడుగుతున్నాడు”
“మీ లైసెన్స్ చూడొచ్చా?”
ఆవిడ మళ్ళీ పెద్దాయన వైపు తిరిగింది.
తెలుగు లోకి తర్జుమా చేశాడీయన.
“ ఓహ్ మీ నేటివ్ ఆంధ్ర లో కనిగిరా? అక్కడ మా దూరపు బందువు ఒకావిడ ఉండేది. బహు గయ్యాళిది.” కాజువల్ గా చెప్పాడా పోలీస్ ఆఫీసర్.
“ఏమంటున్నాడు?” ఇటు తిరిగి అడిగింది ఆవిడ.
“నువ్వు తనకి తెలుసని అంటున్నాడు” 

మూడు రోజులు


రాణి గారికి జబ్బు చేసింది.
అనేక మందులు, వైద్య విధానాలు వాడారు. 
ప్రఖ్యాత జోతిష్యుడిని పిలిపించారు. “రాణి గారి జీవిత కాలం ఎంత ఉంది?” 
అనేక లెక్కలు వేసి ఆయన “మరో మూడు రోజులు మాత్రమే” అన్నాడు.
మూడు రోజులు గడిచాయి. రాణి గారు బక్కెట్టు తన్నేశారు.
రాజు గారికి కోపం వచ్చింది. సహజంగా అదికారం లో ఉన్న వారి కోపం 'మూలం' మీదికి వెళ్ళదు. లోకువ అయిన ఉద్యోగుల మీదికే వెళ్తుంది.
జోతిష్యుడిని మళ్ళీ పిలిపించారు.
“నువ్వు ఎన్నాళ్లు బతుకుతావో చెప్పు”
జోతిష్యుల వారికి సీన్ అర్ధం అయింది. చమట్లు పట్టాయి.
చాలా సేపు నక్షత్రాల లెక్కపెట్టాడు. గీతలు గీశాడు గ్రహాల స్తితి గతులు లెక్కేట్టాడు. ఎంతకీ సమాదానం రాదు.
“చెప్పవెం?” రాజు గారి గద్దింపు.
“నకత్రాల లెక్కలు తేలటం లేదు. రాజు గారి మరణానికి మూడు రోజుల ముందు అని తెలుస్తుంది. స్పష్టంగా కనిపెట్టే పనిలో ఉన్నాను” అన్నాడు. చావు తెలివితో..
(ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి చెప్పండి. బాగా ఎంజాయ్ చేస్తారు)

Tuesday, 13 September 2016

నా డైరీ లో ఒక పేజీ

ఇంటి దగ్గర బయలు దేరిన 19 గంటల తర్వాత కాలేజీ గేటు వద్దకి మేమిద్దరం అడుగు పెట్టాం. వాడికి కావలసిన వస్తువుల బాగ్ మోసుకుంటూ.. సాయంత్రం 5.15 అయింది. నేను ఫోన్ రింగ్ చేసేసరికి దూరం నుండి పరిగెత్తు కొస్తూ సాయి. 
ఎదురోచ్చి వాళ్ళ అమ్మని కరుచుకున్నాడు. నా దగ్గర బాగ్ లాక్కున్నాడు. తన కళ్ళు తడిబారటం నాకు తెలుస్తూనే ఉంది. నేను కళ్ళతోనే స్కాన్ చేసుకున్నాను. కిలోమీటర్ పైగా ఉన్న హాస్టల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. వాడి కొత్త స్నేహితులకి మమ్మల్ని పరిచయం చేస్తూ.. కాలేజీ విషయాలు చెబుతున్నాడు. హాస్టల్ లోపలికి ఆమెని రానివ్వరు. తను రిసెప్షన్ లో కూర్చుని ఉంటే.. నేను వాడి రూమ్ కి వెళ్ళాను. పక్కనే కూర్చొబెట్టుకుని మరోసారి వాడి కళ్లలోకి చూశాను. “మీరు వస్తున్నారని మొన్ననే క్రాఫ్ చేయించుకున్నాను” అన్నాడు. నేను నవ్వాను. వాడి ఫ్రెండ్స్ కి అమ్మ చేతి వంటకాలు పంపిణీ చేశాడు. వార్డెన్ పర్మిషన్ తీసుకుని వాడి మిత్రులతో కొద్దిసేపు మాట్లాడి, బస్ ఎక్కి గంట ప్రయాణం చేసి Trichy వచ్చాం. బస చేసిన హోటల్ రూమ్ కి వెళ్ళి బోజనం ఆర్డర్ చేశాం. 
హాస్టల్ నుండి తెచ్చిన దుప్పట్లు, బకెట్ లో నానబెట్టి ఎలా ఉతకాలో వాడికి చిన్న డెమో ఇచ్చింది. తల్లి. “అక్కర్లేదమ్మా మా హాస్టల్ లో వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి. 9 కే‌జి కెపాసిటీ వి రెండు వారాలకి ఒక సారి ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు అందులో వేస్తాను.. రోజు స్నానం చేసేటప్పుడు ఏరోజువి ఆరోజు ఉతుక్కుంటాను.” చెప్పాడు వాడు. 
ఆ రాత్రి మేం నిదరపోయింది తక్కువ. 
కాలేజీ ఆక్టివిటీస్ గురించి బోలెడు చెప్పాడు. మాకు కొన్ని అర్ధం అవకపోయినా సంగీతం లాగా వాడి మాటలు విన్నాం. 
ఆదివారం అంతా ముగ్గురం కలిసే Trichi లో తిరిగాం.
ఒకటి రెండు దేవాలయాలు కి ప్రశాంతంగా చూశాం. మద్యాన్నం ముగ్గురం హోటల్ గది లోనే బోజనం చేశాం. సాయంత్రం దాకా వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆరున్నర లోపు కాలేజీ కి వెళ్ళాలి trichi నుండి గంట జర్నీ ఉంది.
అయిదవుతుండగా నేను కర్కశంగా 'ఇక వెళ్దామా' అన్నాను. ఆమె నావైపు చూసింది. సెల్ నొక్కి టైమ్ చూసుకుంది. లేచి తయారయింది. సాయి తన బాగ్ సర్దుకున్నాడు. ముగ్గురం హోటల్ నుండి ఎదురుగా ఉన్న బస్స్టాండ్ కి నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరిమీ ఏమి మాట్లాడుకోలేదు. 1 వ నెంబరు బస్టాండ్ వద్ద వాడిని తంజావూరు బస్ ఎక్కించాక, కిటికీ లోంచి వీడ్కోలు చెప్పాము. వాడి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అనేకం చెప్పాలనుకున్నాను. ఏమి మాట్లాడలేక పోయాను. నా శరీరం నుండి, మా ఆవిడ కళ్ల నుండి అనేక విషయాలు వాడికి చేరాయి. వాడు నా చెయ్యి వత్తాడు. చెప్పలేకపోయిన అనేక జాగర్తలకి సమాదానం ఉంది అందులో. 
నిర్ధాక్షణ్యంగా బస్ ‘హారన్’ మ్రోగిస్తూ కదిలింది. మలుపు తిరిగెంతవరకు చూస్తూనే ఉన్నాం. 
నా బార్య కళ్లలోకి చూడటానికి నాకు దైర్యం చాలలేదు. ఆమె కళ్ళలో కన్నీరు నన్ను వేటాడుతుంది. మౌనంగా బస్ స్టాండ్ లో ఒక బెంచీ మీద కూర్చుండి పోయాను. మరో వైపు ఆమె కూర్చుంది. ఎవరిమీ ఏమి మాట్లాడుకోలేదు. 
నా ఫోన్ మోగింది. “నాన్నా .. నేను కాలేజీ దగ్గర బస్సు దిగాను. మీరు ఇంకా అక్కడే ఉండి ఉంటారు. హోటల్ కి వెళ్ళండి. I can manage. డిసెంబర్ లో నేను ఇంటికి వస్తాను. అమ్మకి చెప్పండి.” అన్నాడు స్థిరంగా.

నిజాయితీ

వాళ్ళిద్దరూ ఫామిలీ సెక్షన్ లో కూర్చుని మంచి బోజనం చేస్తుంటే, కూర్చున్న టేబుల్ కింద ఒక చిన్న చేతి పర్సుపడి ఉండటం గమనించాడతను.
అంతకు ముందు బోజనానికి వచ్చిన వారు ఎవరో మర్చి పోయినట్లుంది.
ఫింగర్ బౌల్స్ లో చేతులు శుభ్రం చేసుకుని ఆ పర్సు తీసి చూస్తే.. అందులో నాలుగు బంగారు గాజులు ఉన్నాయి. 
కొత్తవి. తూకం చీటి కూడా ఉంది. అరవై గ్రాముల బరువు సుమారుగా లక్షన్నర విలువ చేసేవి. 
వాళ్ళిద్దరూ కౌంటర్ వద్దకి వచ్చి మేనేజర్ కి చెప్పి ఆ పర్సు అప్పగించారు. 
మేనేజర్ ఈ మద్య కాలం లో ‘మనుష్యులని’ చూడని వాడిలా, ఆశ్చర్యపోయాడు.
కౌంటర్ లోంచి లేచి ‘చేతులు’ కలుపుతూ “ఈ రోజుల్లో ఎవడండి ? ఇంత గొప్ప నిజాయితీ గా ఉండేది” అంటూ అభినందించసాగాడు. నాలుగురయిదుగురు చుట్టూ చేరారు. ఎవరో లోకల్ టి‌వి కి ఫోన్ చెయ్య బోయారు.
అతను వారించానడు. మరెవరో ఇన్సిడెంట్ అంతా ఫోన్ లో ఫోటో తీసుకోబోయారు.
లేదండీ.. ఇలాటి విషయాలు ప్రజలకి తెలియాలి. నిజాయితీ ఇంకా మన మద్య మిగిలే ఉంది అని తెలియాలి. మేనేజర్ పట్టు పట్టాడు.
“మీ. గోల మీదేనా? మా సమస్యలు మాకుండవా? ఇంటివద్ద మా ఆవిడకి టీవి న్యూస్ చూసే అలవాటు ఉంది.”
అతను ప్రాదేయపడ్డాడు. 

Thursday, 8 September 2016

సర్వమత సారం

అమరావతి లో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్ధనలకి హాజరయ్యాను. 
ప్రార్ధనలు పూర్తయ్యాక మతగురువుల వద్ద ఆశీర్వాదం తీసుకునే విషయం వచ్చింది. 
ఆహుతుల మద్యకు వచ్చిన గురువులు అందరినీ వరుసగా ఆశీర్వదిస్తున్నారు. 
ఒక సాధువు వచ్చి నా చేతులు పట్టుకుని “నాయనా ని కాళ్లతో నడవగలవు ఇది దేవుని ఆశీర్వచనం” చెప్పాడు.
‘నా కాళ్ళు బాగానే ఉన్నాయి’. సమాదానం చెప్పాను.
చర్చి ఫాదర్ వచ్చి శిలువ శిరస్సు మీద ఉంచి “కుమారుడా నీవు ని పాదముల పై నడిచెదవు. తిరిగి మంద ని చేరేదెవు” అన్నాడు. 
“ నా పాదముల కు ఎటువంటి ఇబ్బంది లేదు” మళ్ళీ చెప్పాల్సి వచ్చింది.
ఈసారి ఒక ఒక ముల్లా వంతు “ బేటా అల్లా తుజే దొనోమ్ ఫైర్ సే చల్నే దేగా”
“మై ఠీక్ హు” అరవాలనిపించింది. 
బౌద్ద సన్యాసి వచ్చాడు.”బుద్దుని మహిమ గొప్పది. నీవు ఈ రోజు నడుస్తావు”
అందరికీ ఎలుగెత్తి అరిచి చెప్పాలనిపించింది. ‘ఐ యామ్ అల్రైట్’ అని.
****
సెమినార్ పూర్తి అయ్యింది.
ఆకలిగా ఉంది బోజనానికి వెళదామని పార్కింగ్ ఏరియా కి వచ్చాను. 
‘పార్క్ చేసిన నా బండి లేదు’ :v :v
నేను ఇప్పుడు సర్వమతాలని నమ్ముతున్నాను.

Wednesday, 7 September 2016

లస్సీ దొంగ

తనవద్ద పని చేసే ‘రంగడి’ ని రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు కిశోర్.
మూడు నెలల నుండి గమనిస్తూ ఉన్నాడు అతను. తన మిత్రుల దగ్గర నుండి తెచ్చుకున్న ఖరీదయిన ‘లస్సీ’(లిక్కర్) దొంగచాటుగా తస్కరించి తాగటం, అనుమానం రాకుండా మినరల్ వాటర్ తో నింపడం. 
రుచి లో మార్పు అనుభవజ్ఞులకి వెంటనే తెలిసిపోతుంది 
బార్యతో ఒక రోజు హల్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతూ 
“రంగడు నా మందు తాగుతున్న విషయం వాడి చేతే చెప్పిస్తాను చూడు “ అన్నాడు. 
**
“ఒరేయ్ రంగా “ పిలిచాడు.
“సార్ “ సమాదానం వచ్చింది.
“బాటిల్ లో లస్సీ(లిక్కర్) దొంగతనంగా తాగేస్తున్నావు కదూ?”
“________”
“ఒరేయ్ రంగా?”
“సార్”
“లస్సీ దొంగవి నువ్వే కదా?”
“________”
కిషోర్ కి వళ్ళు మండింది.
కోపంగా కిచెన్ లోకి వచ్చి పిలిస్తే పలుకుతావు, ఏదయినా అడిగితే సమాదానం చెప్పవే ?
“సార్ .. ఇక్కడ ఈ వాషింగ్ మిషన్ ముందు ఒక తమాషా గా ఉంది. ఏదో ఒక్క పిలుపే వినబడుతుంది మిగిలినవన్నీ ఏమి వినబడటం లేదు “
“నిజమా? “
“అవును సార్ “
“సరే నేను ఇక్కడ ఉంటాను . నువ్వు హాల్లో కి వెళ్ళి మాడమ్ గారి దగ్గర ఉండి మాట్లాడు”
రంగడు హాల్లోకి, కిశోర్ కిచన్ లోనూ ఉండి మాట్లాడుకోవటం మొదలెట్టారు.
“సార్ “ పిలిచాడు. రంగడు.
“ఆ రంగా వినబడుతుంది”
“ఆర్నెళ్ళ క్రితం పని మానేసిన అమ్మాయిని, నిన్న మెటర్నటి హాస్పిటల్ వద్దకి తీసుకువెళ్లారు, ఎందుకు?” రంగడు అడిగాడు.
కిశోర్ రొప్పుకుంటూ హాల్లోకి పరిగెత్తి “ నిజమేరోయ్ అక్కడ పిలుపు ఒక్కటే వినబడుతుంది . నువ్వేళ్లి పని చూసుకో “
ఇప్పుడతను తలెత్తి మాడమ్ గారిని చూడాలి.
తరవాత ఏమయి ఉంటుంది ?
A. ఎగిరి కాళ్ళు పట్టుకోవటం.
B. నాకేమీ సంభందం లేదని బుకాయించడం
C. మిగిలిన లస్సీ మొత్తం వితౌట్ టచ్చింగ్ తాగేయ్యటం.
D. అర్జెంటు గా పని గుర్చొచ్చి రెండు జతలు బట్టలు పెట్టుకుని కాంపు కి వెళ్ళటం.
మీ ఆప్షన్ ని A/B/C/D ఆని టైప్ స్పేస్ ఇచ్చి,………….. అని టైప్ చేసి కిశోర్ గారికి పంపండి.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...