Thursday, 7 January 2016

కొద్దిగా లేటు :D

డాక్టర్ గారు కొత్తగా నాలుగు వీదుల అవతల నిర్మించుకున్న భవనం లోకి హాస్పిటల్ మారుస్తున్నారు.
..
సామాను అంతా.. ఏమాత్రం డమేజి అవకుండా జాగర్తగా మారుస్తున్నారు.
..
అర్ధో డాక్టర్ అయిన ఆయన పేషంట్స్ కి వివరించడం కోసం డిస్ప్లే లో ఉంచిన ..'అస్తిపంజరం' పాక్ చెయ్యటం వీలవలేదు. 
ఒక ఫిమేల్ నర్సు దానిని జాగర్తగా పట్టుకుని ఆటో లో బయలు దేరింది..
..
వీది మలుపులో ట్రాఫిక్ జామ్ అయింది...
..
ఆటొ పక్కనే ఆగిన కార్లో విషయం గ్రహించలేని ఒకావిడ అది గమనించి..
"ఎక్కడికి ?" అడిగింది యూనిఫార్మ్ లో లేని నర్సుని .
..
"కొత్త హాస్పిటల్ కి "..
..
"మీ అత్త గారా ఆవిడ ? కొంచెం ముందుగా తీసుకెళ్ళాల్సింది.". కారు విండో లోంచి బాద పడింది  మహా ఇల్లాలు .

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...