Friday, 29 January 2016

సిద్దూ

మొన్నోక రోజు  పొదిలి నుండి నేను, నా కొలీగ్, ఒంగోలు లో మర్నాడు అటెండవాల్సిన ఆడిట్ కోసం కొన్ని రికార్డ్స్ తీసుకుని బస్సులో వచ్చి బై పాస్ రోడ్డు వద్ద దిగాము.
అప్పటికే తాను ఫోన్ చెయ్యటం వల్ల , ఎం.టెక్ చదివి హైదరాబాదు లో స్ట్రక్చరల్ ఇంజనీరుగా పని చేస్తూ శలవు మీద ఇంటికొచ్చిన కుమార్డు సిద్దు , ఆల్తో 800 తీసుకుని వచ్చాడు. లగేజీ అందులో వేసుకుని ఇంటికి బయలు దేరాము.
మంగమూరు రోడ్డులో జెడ్.పి కాలనీ వద్దకి వచ్చే సరికి మా దారులు  మారే చౌరస్తా వచ్చింది.
మా కొలీగ్ దిగి, అంకుల్ ని ఇంటివద్ద దించి రా నేనిక్కడే ఉంటాను” అన్నాడు కొడుకుతో.
అక్కడికి సరిగ్గా అయిదు నిమిషాలు కూడా పట్టదు.మా ఇంటివరకు రావటానికి.
“రా పి వి  .. ఇంట్లో టి తాగుదాం” నేను పిలిచాను.
ఇక్కడే ఉంటాను వెళ్ళి రండి అని మరో సారి చెప్పాడు మా వాడు.
“రా.. డాడీ నువ్వు కార్లో కూర్చో ఎంత సేపు వచ్చేస్తాం గా ??” సిద్దు అడిగాడు.
“నువ్వు పోయి రారా ఇక్కడే ఉంటాను “  మావాడు ఈ సారి గట్టిగా..
రా డాడీ “ అని 23 ఏండ్ల కొడుకు ..
ఒక తెలియని ఇబ్బంది తో కూడిన వాతావరణం.
సిద్దు అయిష్టం గానే కారు గేరు మార్చాడు.
ఆ అయిదు నిమిషాల్లో వాడితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న నాకు.. కూడా  ఏమి మాట్లాడాలనిపించలేదు.
ఇంటి ముందు కారు దిగి లాగేజీ దించుకుంటుంటే మా శ్రీమతి ఎదురొచ్చింది సాయం కోసం.
“ సిద్దు బాగున్నావా ?” తను కూడా బాబుని పలకరించింది.
వాడు “బాగున్నాను ఆంటీ” అని పేలవంగా నవ్వాడు.
నన్ను దించి వేగంగా కారు మలుపు తిప్పుకు ని వెళ్ళాడు.
కనీసం రెండో సిగిరెట్టు ముట్టించకుండా వాళ్ళ డాడీని ఆపాలని వాడి ఆరాటం.

ఆరే  పి.వి (మా మిత్రుడు).. పిల్లాడి  గొంతులో ప్రేమ ని నువ్వు గుర్తించలేదా ?? 
అంత తోలుమందం మంచిది కాదేమో ఆలోచించు..” 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...