మా ఊర్లో
స్టేట్ బాంక్., మైన్ బ్రాంచ్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది.
ఉత్తరం తూర్పు
రోడ్డు ఎడమవైపు ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఎదురుగా రోడ్డు దాటాక మండల
కార్యాలయాలు, మరో పక్క సబ్ జైల్ ఉంటాయి.
***
మొన్నో రోజు
సోమవారం నాడు ఉదయం స్టేట్ బాంకు లో ఒక సమస్య వచ్చింది.
శని ఆది వారాల రోజుల సెలవు మీద వరంగల్ వెళ్ళి వెచ్చిన మానేజర్ బాంకు కీస్ బదులు అదే ఆకారం లో ఉన్న మరో తాళాల గుత్తి పట్టుకురావటం, తీరా లాకర్ ఓపెన్ చేసే టప్పుడు
పొరపాటు
గమనించడం జరిగింది. వరంగల్ నుండి తాళాలు మనిషి
చేత పంపించమని కొడుక్కీ ఫోన్
చేశాడు. సాయంత్రానికి గాని అవి రావు.
***
అది మైన్
బ్రాంచ్ అవటం, నెల మొదటి వారం అవటం తో భారీ
లావాదేవీలు జరగాల్సి ఉంది. మేనేజర్ కి ముచ్చెమటలు పోశాయి. టైమ్ పది అవుతూ
ఉంది. స్టాఫ్ ఒక్కొక్కరే వచ్చి తమ సీట్ లో కూర్చుంటున్నారు.
స్ట్రాంగ్ రూము దగ్గర అంతా పొగయ్యారు.
***
సమస్య
పరిష్కారానికి ఎప్పుడు రెండు మూడు మార్గాలు ఉంటాయి.
మనం ఎప్పుడు బాక్స్ లొంచే ఆలోచిస్తాం. బాక్స్ బయటనించి కూడా ఆలోచించవచ్చు
అలా
ఆలోచించగలిగిన ఒక క్లర్క్ మన మేనేజర్ చెవిలో
ఒక అయిడియా చెప్పాడు.
***
ఎదురుగా ఉన్న ‘సబ్ జైల్’ లో ఖైదీ గా ఉన్న ఒక ప్రొఫెషనల్
ని గార్డు సాయం తో రహస్యంగా. (?)
తీసుకు వచ్చారు. జైలర్ కి మానేజర్ కి ‘తడి’ స్నేహం ఉండటం తో కొంత పని
సులువయ్యింది. ‘తడి’ స్నేహాలు చాలా ఘాడం గా ఉంటాయి.
***
పదంటే పది
నిమిషాలలో లాకర్ ఓపెన్ అయ్యింది.
మేనేజర్ కి
సంతోషం తో మాట రాలేదు. కళ్ళు చెమ్మగిల్లాయి.
"చాలా థాంక్స్ గంగులూ ." అతని చేతులు పట్టుకున్నాడు.
***
నీకు ఎంత
కావాలో చెప్పు, జేబులోంచి వాలేట్ తీశాడు మానేజర్.
..
..
..
"పోయిన సారి ఇదే పనికి 23 లక్షలా 74 వేల ఆరువందల
యాబై గిట్టింది "
గంగులు గర్వంగా
చెప్పాడు.
No comments:
Post a Comment