Friday, 1 January 2016

మీ బర్త ని ప్రేమించండి

సంగీతాన్ని మరిపించే మీ నాన్ స్టాప్ గొంతు వినటానికి 
మివారు ప్రాణాలకి తెగించి, జీవితం మీద విరక్తి పెంచుకుని 
బిక్కు బిక్కు మంటూ సాయంత్రం ఇంటికి వస్తాడు --- 
పాపం ఒక గ్లాసు మంచి నీళ్ళు, ఒక కప్పు టి/కాఫీ ఇవ్వండి.
ఇంకో గంట పాటు సృహ తప్పకుండా మీరు చెప్పినవన్నీ వింటాడు.
****
అతనెప్పుడయినా బయట స్త్రీ లని గమనిస్తుంటే అపార్ధం చేసుకోకండి.
వారందరి లేని (?) అందం మీలొ ఉందని క్లారిఫై చేసుకుంటుండొచ్చు. wink emoticon
***
మీ వంట కి వంకలు పెట్టినా ప్రేమించండి.
అతని నాలుక ఈ మధ్యే రుచులు గుర్తించడం మళ్ళీ ప్రారంభించి ఉంటుంది. tongue emoticon
***
రాత్రి పెద్ద శబ్దం తో గురక పెట్టి మీ నిద్ర ని పాడు చేస్తే అర్ధం చేసుకోండీ .
మిమ్మల్ని చేసుకున్నాక ఎంత రిలాక్సెడ్ గా జీవిస్తున్నాడో అని.
**
మీ బర్త్ డే కి చిన్న చిన్న గిఫ్ట్ లు తేలేదని/మర్చి పోయాడని అలగకండి.
కుటుంబం కోసం ఆదా చేస్తున్నాడని గుర్తించండి.
***
అతన్ని ప్రేమించండి.
***
ఎందుకంటే మరో గత్యంతరం లేదు.
పైగా హత్యా నేరానికి  చట్టాలు కూడా గట్టిగా ఉన్నాయి. grin emoticon


***
‪#‎susri‬ 01/01/16

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...