మీరు తొందరపడలేదు అనుకోండి..
పసుపుపచ్చ చొక్కామీద ఎర్ర కాలరు, బులుగు రంగు జేబులు ఉండేది, బుడబొక్కలోడి ఫాంటు మీ ఆవిడ
మీ కోసం ప్రేమగా సంక్రాంతికి కొనే అవకాశం ఉంది.(పోయిన దశాబ్దం లో హింది నటుడు గోవిందా
డ్రెస్సులు గుర్తు తెచ్చుకోండి)
మీరు ఎంత డి గ్లామర్ గా తన పక్కన నిలబడితే, తనంత ‘హందంగా’ కనిపిస్తుంది ..
అది లాజిక్కు ..
కనుక పండక్కి బట్టలు కొనే ఆలోచన ఉంటే మీ అబ్బాయి
/ అమ్మాయి ని సెలెక్షన్ కి తీసుకెళ్ళండి. మీకేం నప్పుతాయో వాళ్ళు సరిగ్గా చెబుతారు.
ట్రయల్ రూములో చెక్ చేసుకుని జబర్దస్ట్ గా తెచ్చుకోండి. :D.
***
ఇంట్లోకి దైర్యంగా ఆ బట్టలు ఎలా ప్రవేశ పెట్టటం
అనేది మీ తర్వాత సమస్య.
సాయంత్రం ఒక పావుకేజీ హల్వా కొనుక్కుని ఇంటికి
వెళ్ళండి.
పెదాలు చెవుల దాకా సాగించి సకిలించండి .. సారి
... నవ్వండి.
“ఏంటి విషయం” అంటుంది ఆవిడ . మాటలే అక్కర్లేదు.
కంటి భాష చాలు.
వేడి వేడి హల్వా చేతిలో ఉంచండి.
అప్పటికే ఏదో జరిగిందని ఆవిడకి తెలుస్తుంది.
గుండెల నిండా గాలి పిల్చుకుని మీరు కొనుక్కున్న
డ్రస్ చూయించండి.
ఆమె ఖచ్చితంగా “చండాలంగా ఉంది “ అంటుంది. మీరేమీ
మాట్లాడరు.
వీలయితే చిన్నప్పుడు కాగబెట్టిన వంట ఆముదం తాగినట్టు
మొహం ఉంచడానికి ప్రయత్నిస్తారు. “మీకేనా?” అని మరో చెత్త
ప్రశ్న వేస్తుంది.
“మా ఫ్రెండ్ రామకృష్ణ గాడు న్యూ ఇయర్ బహుమతి ఇచ్చాడు
“
“ఆయనేవరు?”
“ట్రంక్ రోడ్డు లో రెడీమేడ్ షాపు నడుపుతుళ్ళా..
అతను “
“అతను మీకేందుకు ఇచ్చాడు?”
“ఏమో పాపం ఆర్ధిక ఇబ్బంది అంటే రెండు వేలు ఇచ్చాను
“
ఆమెకి విషయం అర్ధం అవటానికి రెండు మూడు నిమిషాలు పట్టుద్ది.
ఈ లోగా ఇంట్లో దూరేయ్యండి.
చేతికి అడ్డం వచ్చిన పనులు చేస్తుండండి.
++క్లయిమాక్స్ ++
కొంత ‘మాన్ హండ్లింగ్’ జరిగే సూచనలు ఉన్నాయి. కానీ దైర్యంగా ఉండండి.
ఇన్నాళ్ళుగా నాటుకొళ్ళు, నానా ద్రవాలతో పెంచిన శరీరం. ఆమాత్రం తట్టుకుంటుంది. ఏం పర్లేదు.
ఏం జరిగినా బిట్వీన్ ది ఫోర్ వాల్సే కదా ? ..
ఆల్ ది బెస్ట్. అన్నట్టు ఇంట్లో ‘ఉడుకులాం’ ఉందా??
No comments:
Post a Comment