"మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినయ్
మామీదున్న టెన్షన్ లు తగ్గినయ్ .. "
లౌడ్ స్పీకర్ లు దమాయించి మొగుతున్నాయ్.
గ్రామ సభ మొదలయ్యింది.
సందేశాలు, ప్రమాణాలు. అన్నీ షరా మామూలే.
విన్నపాలు, ఆధారాలు,సెల్లు నెంబర్లు, కార్డులు
యదావిది గా సాగుతున్నాయ్.
గత యడాదిగా శాఖలవారి సమీక్షలు ..
ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎన్ని ఆన్లైన్ చేశాము.
ఏ విదంగా ప్రపంచం నలుమూలల నుండి ఒక్క బటన్ నొక్కి (ఉత పదం) ఎలా చూసుకోవచ్చో
అర్జీ పరిష్కారం ఎదశ లో ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్ లో ఉంది?. ఎంతకాలం ఉంది?
ఎంతో వివరంగా తెలుకోవచ్చు.
వక్తలు అందరూ ధారాళంగా "ఖాళీ చెంచాతో కడుపు నింపారు"
ఒకావిడ మరుగు దొడ్డి వినియోగం తర్వాత, బోజనానికి ముందు చేతులు 20 నిమిషాల పాటు ఎలా కడుక్కోవాలో డెమో ఎచ్చింది.
మరుగుదొడ్డి వినియోగం అవసరం, వ్యర్ధాల మీద వాలే ఈగలు చేసే అనర్ధం, అనారోగ్యం వంటివి వివరంగా చర్చకి వచ్చాయి. కట్టుకున్న మరుగుదొడ్ల బిల్లులు పెండింగ్ గురించి ఆన్లైన్ లో చూసుకోవచ్చు . డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి కూడా ఆన్లైన్ లో చూసుకోవచ్చు.
అంతా పారదర్శకం.
వృదాప్య పింఛను రానివాళ్లు అర్జీలుఇవ్వటానికి, వచ్చిన వాళ్ళు గ్రామసభ అయ్యాక పంపిణీ కోసం ఎండలో సభని విజయవంతం చేశారు.
..
సరే మందుబాబుల సందడే సందడి.
వాళ్ళు చెప్పే నిజాలు తాగుబోతు మాటల కింద కొట్టేశారు...
..
టేబుల్ మీద ఉంచిన కిన్లే నీళ్ళు తాగి అదికార్లు సభ ముగించారు.
ఏర్పాటు చేసిన బోజనానికి కి న్యాయం జరిగింది...
..
ఇరవై నిమిషాలు చేతులు కడగమన్నావిడ,
చేతి లో చెంచాడు నీళ్ళు వంచుకుని ఇస్తరతో పాటు పొదుపుగా కడిగేసింది...
..
రెండో సెషన్ లో మెడికల్ కాంపు ..
అగ్రికల్తురల్ పరికరాల ప్రదర్శన జరిగింది...
..
ఈ లోగా వెటర్నరీ కాంపు లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన కోడె ఒకటి కట్లు తెంచుకుంది.
చాకచక్యంగా అందర్నీ కవర్ చేసుకుంటూ, పరిగెత్తి పొడవసాగింది. ..
..
అదికార్లు, సైజులతో సంబందం లేకుండా పరిగెత్తారు.
పార్కింగ్ చేసిన బండ్లు పక్కకి పడిపోయాయి.
కార్లమీద కొమ్ముల గుర్తులు పడ్డాయి..
**
మొత్తానికి ఒక యువ రైతు దాన్ని కట్టడి చేశాడు.
**
మెడికల స్టాఫ్ వారు ప్రప్రధమంగా తాము ప్రధమ చికిత్స చేసుకుని ..
మిగిలిన వారికి మరిచిపోయిన వైద్యం మొదలెట్టారు.
****
సాయంత్రం ప్రత్యేక నివేదిక కోసం పై అదికార్ల బృందం వచ్చింది.
ఎలా జారిగింది?.
దాని వయసు ఎంత?. ఎంత మంది గాయ పడ్డారు?
వయస్సులవారి వివరాలు
ఆడా/మగా/ ట్రాన్స్ జెండర్ (ఇప్పుడీ పదం ఫాషన్) ఎంత మంధి?
వారిలో ఆధార్ కార్డు ఉన్న వారు ఎంత మంది?.
ఇలాటి కొచ్చెనీరు తీసుకొచ్చారు.
**
ముందు కోడె దూడ రైతు వద్దకి వచ్చి వివరాలు అడిగారు.
అతను చెవిలో చుట్ట తీసి వెలిగించుకుని
" ఏం ఆన్ లైన్ లో లేదా సమాచారం? ఒక్క బటన్ నొక్కండి "
అని కోడెల మేత కోసం సైకిలు ఎక్కి పొలం వైపు వెళ్ళాడు.
#susri 05/01/16

No comments:
Post a Comment