Saturday, 9 January 2016

రక్తం తో తడిచింది.

తెల్లవారు ఝామున మంచం పక్క ఏదో శబ్దానికి అతనికి మెళుకువ వచ్చింది. 
టి వి రిమోట్ క్రింద పడ్డ శబ్దం .
మంచి నిద్రలో ఉన్న అతను లేచి దుప్పటి తొలగించాడు.
మళ్ళీ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే 
వాష్ రూము తలుపు శబ్దం వచ్చేట్టు తెరుచుకుంది. 
మరో రెండు నిమిషాలకి బెడ్ రూములో ట్యూబ్లైట్ వెలిగింది. 
ఇంటావిడ హాల్లోకి వెళ్ళి వాళ్ల అమ్మతో చిన్నగా (అంటే అతనికి గట్టిగా అని అర్ధం) మాట్లాడసాగింది. అతన్ని తన్ని నిద్రలేపడం అనమాట .
ట్రైన్ తెనాలి దాటిందా ? ఇంకెంత అరగంట. ఈయన వచ్చేస్తున్నారు . స్టేషన్ కి బయలుదేరుతున్నారుఇదొక మెత్తటి గుడ్డ లాటిది. 
మర్యాద గానే ఉంటుంది.
నిద్ర మొహమా లేచి మా అమ్మ ని తీసుకురా? “ అని దాని పరమార్ధం.
**
ఇక ఎటు నిద్రపోనివ్వదని అతను లేచి బాత్రూము కి వెళ్ళి వచ్చేటప్పటికి
అతని సెల్ లో అలారం మోగింది. 
పావుగంట దూరం లో ఉన్న స్టేషన్ కి అంత చలిలో బండి తీసి బయలు దేరాడు.
బాగా చలిగా ఉంది శాల్ అయినా తెచ్చుకున్దో లేదో అన్నది కానీ
స్వెటర్ వేసుకుని చెవులకి కాప్ పెట్టుకోండి అని మాత్రం అనలేదు 
...
అతను మంకీ కాప్ తగిలించుకుని బయలు దేరాడు. ...
రైలు బండి సమయానికే వచ్చింది కానీ అతన్ని ముందుగా తరమటం వల్ల 
అతనికి అక్కడ దోమల్తో బడ్మింటన్ ఆడే అవకాశం దొరికింది.
..
సరే, ఎలా కోలా లాగేజీ ని, అత్తగారిని బండి ఎక్కించుకుని తిరుగుముఖం పట్టాడు.
గాంధీ నగర్ వైయస్సార్ విగ్రహం వద్ద వీది కుక్కల సమావేశం జరుగుతుంది. ..
ఎంత జాగర్తగా వచ్చినా కల్గేట్ తో పళ్ళు తోమే కుక్కోకటి అతని ఎడం కాలి పిక్క పట్టుకు లాగింది. 
వాహనాన్ని బర్రున లాక్కొచ్చే సరికే దాని పళ్ళు దిగిన ప్రాంతం లో నెత్తురు కారి అత్తగారి చీర తడిచింది.
...
ఇంటికి రాగానే తెల్లటి శిఫానో, బొఫానో ఆ చీర మీద ఎర్రటి మరక ఇల్లాలు వెంటనే గుర్తించింది....
..
ఏమయింది? “అందావిడ కంగారుగా.
ఏదో కుక్క అల్లుడుగారి పిక్క పట్టుకుని కొరికింది.”..
..
ఆవిడ కంగారు పడింది. ..
మాట వరసకి ఏదో అంటాం గాని బార్యలకి బర్తల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. 
ఆమె కంగారుగా ఫోను అందుకుని వాళ్ళ ఫామిలీ ఫ్రెండ్ కం డాక్టరు అయిన పార్వతీశానికి 
ఫోన్ చెయ్యబోతుంటే అతను వారించాడు.
వాళ్ళు నిద్రలో ఉంటారు. నీళ్ళ కింద కడిగి పసుపు రాస్తే ఇప్పటికీ సరిపోతుంది. 
ఉదయాన్నే హాస్పిటల్ కి వెళ్తాను ఆమె అతని కాలు చూసి
మీకేం తెలీదు మీరుండండి అని ఫోన్ కలిపింది.
...
రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాక ఫోన్ లిఫ్ట్ అయ్యింది. డాక్టర్ గారి బార్య ఫోన్ తీసింది.
...
...
......
..
..
..
..
..
హలో ప్రభ గారా నేను సావిత్రిని.. సారి నిద్ర పాడుచేసినట్లున్నాను. 
మా వారు రైల్వే స్టేషన్ నుండి వాళ్ళ అత్తగారిని ఇంటికి తీసుకువస్తుంటే కుక్క కరిచింది. 
రక్తం బాగా పోయింది. మా అమ్మ చీర తడిచి పోయింది"
..
..
..
..
మీ వీదిలో మంచి 'డ్రై క్లీనర్' షాపు ఉందని చెప్పావుగా .. 
వాళ్ళ ఫోన్ నెంబరు ఇస్తావా ?” 




No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...