Monday, 4 January 2016

ప్రచార కర్త

సోమ వారం లంచ్ అవర్లో ఇద్దరు ఐ‌టి అమ్మాయిల సంభాషణ.
**
నిన్న సండే అనేగాని ఒక ముద్దు లేదు ముచ్చటా లేదు. 

పగలంతా ఊరెమ్మట తిరిగొచ్చాడు. తిన్నాడు. 
పడుకుని గుర్రు కొట్టాడు. మా హస్బెండ్
***
మా వారు సాయంత్రం రాగానే బయటకి తీసుకెళ్లారు. 
కిటికీ లోంచి సముద్రం కనబడే హోటల్ లో బోజనమ్ చేశాం. 
వస్తు బీచ్ రోడ్డు లో గంటసేపు కబుర్లు చెప్పుకుంటూ నడిచాం . 
ఇంటికి రాగానే ఆయన కాండీల్స్ వెలిగించాడు ;)” 
****
మరో చోట ఇద్దరు మగాళ్ల సంభాషణ 
**
నేను ఇంటికి వెళ్ళానా? టేబుల్ మీద డిన్నర్ రెడీ గా ఉంది. 
తిని హాయిగా నిద్రోయాను
***
నేను కరెంటు బిల్లు కట్టడం మరిచిపోయాను. 
ఇంటి కేళ్ళేసరికి చీకటి. ఆమె వండలేదు. 
ఆర్కే బీచ్ రోడ్డు లో త్వరగా సర్వ్ చేసే చిన్న హోటల్ కి వెళ్ళాం. 
తిన్నాక చూసుకుంటే ఇంటికి రాటానికి ఆటొ కి డబ్బు లేదు.
కార్ద్లు ఇంట్లో మరిచిపోయాం. ఇంటికి చేరటానికి గంట సేపు నడవాల్సి వచ్చింది. 
ఇల్లు చీకటిగా ఉంది. కాండిల్స్ ముట్టించి ఆ వెలుగు లోనే నిద్ర పోయాం 
****
ఇప్పుడో ప్రశ్న ?
రెండో అమ్మాయి ప్రబుత్వ పధకాల ప్రచారకర్త గా పనికొస్తుందంటారా?

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...