బిజినెస్ స్కూల్ లో చదివే
పిల్లాడికి డబ్బు ఎన్ని రకాలుగా వినియోగించు కోవచ్చో రెండు నెలల లోనే తెలిసింది.
మూడో నెలలో తండ్రికి ఫోన్
చేశాడు. “నాన్న
గారు ఇక్కడ బిజినెస్ స్కూల్ లో నవీన విధ్యా విధానాలు ఎంతగా అభివృద్ది చెందాయి అంటే
మీరు నమ్మ లేనంత. మన కుక్క పిల్ల పింటో కి అయినా మాట్లాడటం నేర్పించగలరు.”
“నిజమా .
అయితే మన పింటో ని మన ఆఫీసు లో మేనేజర్ కి కిచ్చి పంపుతాను. మాటలు నేర్పించమను.
దానికి అవసరమయ్యే యాబై వేలు కూడా పంపుతున్నాను”
మరో నెల గడిచింది.
పిల్లాడికి మళ్ళీ ఆర్ధిక అవసరాలు వచ్చాయి.
ఇంటికి ఫోన్ చేశాడు.
“పింటో ఎలా
ఉంది “ ఆతృతగా అడిగాడు తండ్రి.
“ఎక్ష్లెంట్
నాన్న గారు . చాలా మాటలు వచ్చాయి దానికి. ప్రస్తుతం మా స్కూల్ లో జంతువులకి చదివటం
నేర్పుతున్నారు”
“ఏమిటి
నిజమే” ఆశ్చర్యపోయాడాయన.
“ మన పింటో
ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ లో ఉంది. లాస్ట్ సండే టెస్ట్ లో టాపర్ కూడా పింటో నే “
మరో యబై పంపించాడు ఈయన.
“నాన్న
గారు మరో యబై పంపండి. ఫాకల్టీ ఇటలీ నుండి వచ్చారు”
డబ్బు జబ్బు చేసిన తండ్రి
అది కూడా పంపాడు.
మొదటి యడాది గడిచింది. “పింటో ఎలా ఉంది?” ఈయన ప్రశ్న.
“క్లాస్
టాపర్ నాన్నగారు. మీరు నమ్మరు గాని మిగతా జంతువులకి మన పింటో నే చదవటం లో సాయం చేస్తుంది.”
ఆయన ఉప్పొంగి పోయాడు. కొడుకి కంటే పింటో ని
కలవటానికే తహ తహ లాడాడు.
సెమిస్టర్ పూర్తి అయ్యాక
సెలవులకి ఇంటికొచ్చే ముందు రోజు కొడుకు ఫోన్ చేశాడు.
“నాన్నగారు
చిన్న బ్యాడ్ న్యూస్ “
“ఏమయ్యింది?” అడిగాడాయన.
“ఉదయం
లాగేజీ సర్దుకుంటుంటే మన పింటో హల్లో సోఫాలో కూర్చుని రోజూ లాగే ఏకానామిక్ టైమ్స్
చదువుతూ, అన్నట్టు మీ నాన్న ఇంకా కనకానికి లైన్
వేస్తూనే ఉన్నాడా?” అని అడిగింది.
“ లమ్దీ
ముండ దానికేట్టా తెలిసిందిరా.. అది వచ్చి మీ అమ్మ ముందు వాగక ముందే దాన్ని రైల్
కింద వేసి చంపు”
“ఇప్పుడు ఆ
పనే చేసి వస్తున్నాను నాన్న గారు”
***
ఆ పిల్లాడు తర్వాత కాలం
లో లా కూడా చదివి డిల్లీ లో పార్లెమెంటు లో ఇలాటి పనే చేస్తూ ఉన్నాడు .
ఇక నిద్ర పోండి. గుడ్
నైట్ ;)
No comments:
Post a Comment