రెండు సంవత్సరాల క్రితం నేను ఒక పిల్లాడిని ఇంజినీరింగ్
(సివిల్) చేర్చడానికి ప్రకాశం జిల్లా, ఏ.పి కందుకూరు రోడ్డు లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ కి నా మారుతి
కార్లో వెళ్ళాను.
గేటు నుండి మైన్ క్యాంపస్ వరకు ఫర్లాంగ్ దూరం పైనే ఉంది. పదినిమిషాలు కాలం పట్టింది అక్కడికి చేరటానికి. నడిచి వెళ్తే మరో రెండు నిమిషాల ముందే చేరేవాళ్లం.
అన్నీ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి (స్పీడ్ బంపర్స్).
JUNE 01 1906 లో మొదటిసారిగా న్యూ జెర్సీ లో ప్రారంభమయిన స్పీడ్ బ్రేకర్స్ ని అప్పట్లో స్లీపింగ్ పోలీస్ మెన్ గా భావించే వాళ్ళు.

***
వీటి నిర్మాణాన్ని ఒక్క నిమిషం పరిశీలిద్దాం. వేగంగా వెళ్ళే వాహనాల వేగాన్ని 25 కి మీ కి దిగువగా తగ్గించడానికి వీటి నిర్మాణం ప్రారంభించారు. ఒక్కో SB రెండు మీటర్ల వెడల్పు (6'5"), 12.5 సెంటిమిటరు (5") ఎత్తు మించ కుండా ఉండాలి. రెండు వైపులా రాత్రి పుట కూడా మెరిసేలా గళ్ళ పెయింటింగ్ వెయ్యాలి. రెండు SB ల మధ్య మరో రెండు మీటర్లు దూరం ఉండాలి. ఇవి నియమాలు.
***
వాస్తవం ఏమిటి మనందరికీ తెలుసు. పర్మిషన్ లేని SB లు ఎవరికి వారే దగ్గర దగ్గర గా ఆరంగుళాల మించిన ఎత్తు, అడుగు వెడల్పుతో అడ్డుగోడలా వేసుకోవటం, వాహనాల వేగాన్నే కాదు, వాటి మన్నికని, చోదకుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదం లోకి నెట్టేస్తున్నాయి. ఇక వార్నింగ్ నేమ్ బొర్డ్స్, రేడియం కలర్స్ ను ఊహించే ప్రయత్నం చేయకండి.
ముఖ్యంగా బైకెర్స్ ఒక్క సారి ఒక SB మీద గమనించలేక డ్రైవింగ్ చేసినప్పుడు వెన్నెముక కనీసం అయిదు వేల ప్రకంపనాలు చేస్తుందని మా డాక్టర్ మిత్రుడు చెబితే నోట మాట రాలేదు. ఈ లెక్కన మనన్ని ఇవి కాపాడుతున్నాయా? లేక మన వాహనాలను, మనన్ని నాశనం చేస్తున్నాయా?.
నగరాల్లో స్కూటీలు, నడిపే చిన్నారులు, పసివాళ్లని స్కూల్స్ లో దించడానికి వెళ్ళే తల్లులు, వేగాన్ని నియంత్రించుకోలేని చోదకులు ఎంత మండి ప్రమాదాల బారిన పడుతున్నారో గమనిస్తే కడుపూ తరుక్కు పోతుంది. అదికార్ల నిర్లక్షం, సహచరుల అజ్ఞానం నుండి బయట పడక పోతే ఇవి ప్రాణాలని తీయడం కొనసాగుతూనే ఉంటుంది.
**
స్పీడ్ బంప్స్ /బ్రేకేర్స్ అవసరమే. కానీ డిజైన్ ప్రకారం ఉంటే అందరికీ ఉపయోగం.
ఒక్క సారి ఆలోచించండి మన SB ల పరిస్తితి??
****
PS: నేను ఆపిల్లాడిని ఆ కాలేజీ లో చేర్పించ లేదు. .వాళ్ళ HOD తో ఇదే చెప్పాను. ముందు మీ క్యాంపస్ లో స్పీడ్ బ్రేకర్స్ చూసిన వాడేవడూ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చదవడు అని .

No comments:
Post a Comment