Sunday, 3 January 2016

టూ లేట్ ;)

విపరితమయిన హెల్త్ కాంషెస్ ఉన్న ఒకావిడ, 
మంతెన చప్పిడి తిండి, రామదేవ్ యోగా, ఇత్యాదులు ఆచరిస్తుండేది. 
బలవంతాన బర్త కి కూడా తప్పేది కాదు.
అలాటి ఒక జంట 87/82 వయసులో కారు క్రాష్ అయ్యి బక్కెట్లు తన్నేశారు.
***
స్వర్గానికి వచ్చాక వాళ్ళకి ఒక సౌకర్యవంతమయిన విల్లా కేటాయించారు.
విల్లా కి అనుసందానంగా ఒక మంచి గోల్ఫ్ కోర్ట్ ఉంది. 
ప్రొఫెషనల్ ప్లేయర్స్ తోపాటు కోచ్ లు కూడా ఉన్నారు.
మరో పక్క క్లబ్ కోర్ట్ ఉంది. 24 గంటలు ఫుడ్ అండ్ లిక్కర్ సర్వ్ చేస్తున్నారు.
శాటిలైట్ టి వి, స్నూకర్ టేబుల్. ఒక బంగారు పుష్పాల పూలతోట, 
సంపెంగ మొలకల్లాటి అందగత్తెలు, అబ్బో ఆ సౌకర్యాలు వర్ణించడం కష్టం.
***
పెద్దాయన బార్య వైపు తిరిగి
"కుళ్లు మోతు మొహం దానా.. నానా చెత్త తినిపించి 

ఇన్నాళ్ళ టైమ్ వెస్ట్ చేయించావు. 
ముప్పై యేళ్ళ ముందు వస్తే ఎంతో కొంత ఉపయోగం ఉండేది." 
బోరు మన్నాడు. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...