Sunday 31 January 2016

టిపినీ లో మజ్జిగ

అరచేతి లో కొబ్బరికాయ ఉంచుకుని మూడున్నర ఎకరాల పొలం లో చుట్టూ తిరిగాడు రాఘవయ్య 

అక్కడక్కడా ఆగటం విభూది పూసిన నుదుటిని చిట్లించి ఆకాశం లోకి చూడటం అనుమానంగా తలూపటం మళ్ళీ కొంత దూరం నడవటం ఇలా అరగంట నుండి పోలమంతా నీటి ధార కోసం గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాడు. 
అతని తో పాటు రైతు వెంకట్రామయ్య కూడా ఆకాశం లోకి అతడి నుదుటి వైపు కి దీనంగా చూస్తూ ఉత్త కాళ్లతో తిరుగుతున్నాడు.
***
రాఘవయ్య హట్టాత్తుగా అగాడు. పెద్దగా మంత్రాలు చదివాడు. చేతిలో కొబ్బరి కాయ పక్కకి  వంగింది.
..
ఇక్కడే ..ఇక్కడే పాతాళ గంగ ఉంది .. రెపే తోవ్వించు మూడొందలు అడుగులో రెండు ఇంచులు నిళ్ళు ఉన్నాయి
..
వెంకట్రామయ్య ముఖంలో ఆనందం తొంగిచూసింది.
దానిలో చాలా బాగం ఆశ నిండి ఉంది.
ఈ ఏడాది అప్పటికే మూడు చోట్ల బోర్లు తవ్వించాడు.
చుక్క నీరు పడలేదు. ఉన్న ఒక్క బోరు వట్టి పోతూ ఉంది. .
నిమ్మ తోట ఏండి పోతూ ఉంది. నీటి తడి లేక చెట్టు కాపు లేక గిటకబారి పోతుంది.
మూడేళ్ళ నుండి కన్న బిడ్డళ్ళా పెంచుకున్న మొక్కలు. ఏండి పోతుంటే దుఖం తన్నుకు వస్తుంది.
***
రాఘవయ్య చెప్పిన చోట గుర్తుగా గడ్డపార్తో తవ్వి ఒక రాయి పాతాడు.
..
పొలం గట్టు వద్దకి వచ్చి నీడగా ఉన్న పాక దగ్గర ఆగారు ఇద్దరు...
***
వెంకట్రామయ్య బార్య అప్పటికే అక్కడికి వచ్చి ఉంది.
నిమ్మ చెట్టు మొదట్లో కలుపు మొక్కొకటి కనిపిస్తే శుభ్రం చేస్తూ ఉంది.
**
వెంకట్రామయ్య ని ఉద్దేశించి "ఆ టిపినీ లో మజ్జిగ ఉన్నాయి సాములోరికి ఇవ్వు" అంది
..
అక్కడ మూత పెట్టిన నాలుగు టీపీనీలు (మనం ఇళ్ళలో వాడే వంటింటి కాడ ఉన్న పప్పుడబ్బాలు ).. ఉన్నాయి.
..
ఎందులో ఉన్నాయే మజ్జిగ ? “ పెళ్ళాం మీద కేకేసాడు...
..
నీకు అర్ధం కాదులే మామా.. 300 అడుగుల కింద నీళ్ళు కనబడిన సాములోరికి మజ్జిగ ఎందులో ఉంది తెలుస్తుంది లే.. సాములోరిని అడుగు

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...