రాత్రి మాకు దగ్గర్లో ఉన్న ఒక
అపార్ట్మెంట్ కి, అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట (10-08-2016) కి ఆహ్వానం మరియు విరాళాలు కోసం మిత్రులతో కలసి వెళ్ళాం.
....
ఒక ఫ్లాట్ తో సమావేశం అయ్యామ్. ఒక పెద్దమనిషి "మీరు మాదగ్గరకి ఎప్పుడు రాలేదే? మేము రెండు లక్షల దాకా వసూలు చేసి ఇస్తాం. కమిటీ లో మెంబర్ షిప్ ఇస్తారా?, అసలు కమిటీ లో ఎవరెవరున్నారు? ముస్లిం వ్యక్తి కమిటీ ప్రసిడెంటు గా ఎలా ఉన్నాడు. అసలు అకౌంట్ ఎలా మైన్టైన్ చేస్తున్నారు. ఆడిటర్ ఎవరు. మీ లెక్కలు పట్టుకొచ్చారా? " అని అడిగాడు.
..
"మేం వచ్చింది వారం గడువులో జరగనున్న ప్రతిష్ట కార్యక్రమం గురించి ఆహ్వానించడానికి వీలయితే కొంత డబ్బుగాని, వంట సరుకులు కానీ విరాళం ఇస్తారని ". మా ఓబులు రెడ్డి మాస్తారు నెమ్మదిగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు.
మా వాళ్ళు నా వైపు కంగారుగా చూశారు ఇలాటి సందర్భం లో నా నోటి వెంట వచ్చే 'శూలాల' సంగతి తెలుసు వాళ్ళకి.
నేను ముభావంగా కూర్చుని ఉన్నాను.
..
ఇంతలో లోపలి నుండి వచ్చిన ఇంటావిడ మేము తాగిన మంచి నీళ్ళ గ్లాసులు ట్రే లో లోపలికి తీసుకెళ్తుంటే .. ఖాళీ గ్లాసు ఒకటి కింద పడి శబ్దం చేసింది.

నేను లేచి నిలబడి "ఖాళీ గ్లాసు లకి శబ్దం ఎక్కువ. లేవండి మన సమయం విలువయినది ." అని లేచి ముందుగా బయటకి వచ్చాను.
No comments:
Post a Comment