Friday, 15 July 2016

రెండో టాబ్లెట్స్

ఒక సన్నిహిత మిత్రులు సీనియర్ డాక్టర్ గారిని ఒక మెడికల్ సలహా అడిగాను.
వారు దానికి సమాదానంగా టాబ్లెట్స్ ఏం వాడాలో తెలియజేస్తూ ఒక మెస్సెజ్ ఉంచారు. అప్పటికి తగ్గకపోతే రిలేటెడ్ డాక్టర్ ని కలవండి అని సూచించారు.
**
నాకు మందుల పేర్లు అంతగా జ్ణప్తికి ఉండవు.

సాయంత్రం బస్టాండ్ దగ్గర 3 స్టార్ హోటల్ రెసెప్షన్ ని తలదన్నేట్టు గా ఉండే A/C మెడికల్ షాప్ కి వెళ్ళాను. అక్కడ పొడవాటి కౌంటర్ వద్ద ఉన్న ఒక సేల్స్ అమ్మాయికి సెల్ లో మెస్సెజ్ చూపించి ఆ మందులు ఇవ్వమన్నాను.
**
ఆమె అది చదివి రెండు రకాల టాబ్లెట్స్ ఇవ్వమంటారా? అంది.
నేను ఆశ్చర్యంగా చూసి "టాబ్లెట్స్ ఒకటే గదా? రాసింది " అన్నాను.
"
కాదండీ DERMATOLOGIST అని మరో రకం రాశారు." అంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...