తెల్లారగట్ల
చీకటి ఇంకా పూర్తిగా తొలగిపోకుండానే, నగరానికి బయట
ప్రాంతం లో పాదచారుల సందడి మొదలయ్యింది.
ఆమె, ఒక హైస్కూల్ టీచరయిన బర్తని ఇష్టం లేకున్నా బలవంతాన ఉదయం నడక కోసం
తీసుకొస్తుంది. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అప్పటికే వెంకట్రావ్ వంట్లో షుగర్
లెవల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి.
ఒక వారం రోజులు
గా వాళ్ళు ఇద్దరు
రోజూ కొంత వ్యాయామం చేస్తూ ఉన్నారు.
సరిగ్గా ఆ రోజు
పొగ మంచు ఇంకా తొలగి పోనీ ఆ రోజు, ఒక బైక్ వచ్చి
వారి ముందు ఆగింది. ఇంజను ఆపని బైక్ మీద ఉన్న మనిషి కిందకి దిగి ముందు కవర్లో ఉంచుకున్న
పొడవాటి కత్తి తీసి వెంకట్రావుని పొట్టలో పొడిచాడు. ఇరుక్కు పోయిన కత్తిని బయటకి
లాగే ప్రయత్నం చేయకుండా ఆగంతకుడు ఎక్కిన బండి వేగంగా వెళ్ళి పోయింది..
క్షణాల్లో
జరిగిపోయిందది. ఆమెకి ఏదో యాక్షన్ సినిమా చూస్తున్నట్టు ఉంది. కత్తి పోటులో
ప్రోఫ్ఫెషనలిజం లేదు కానీ,
కత్తి మాత్రం పదునుగా ఉన్నట్టు
ఉంది.
వెంకట్రావు
మట్టి రోడ్డు మీద కూలబడి పోయాడు. చిరిగిన సంచి లోనుండి పాములు కదులు తున్నట్టు అతని కడుపులో ప్రేగులు బయటకి
జారుతున్నాయి. రక్తం ధారగా కారుతుంది.
నిమిషాల్లో
అక్కడికి వాకర్స్ పొగయ్యారు. ఎవరో 108 కి ఫోన్ చేశారు.
వాకింగ్ కి వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ ఆ అంబులెన్సే లో ఎక్కారు. వెంకట్రావు ని
చంద్ర శేఖర్ గారి హాస్పిటల్ కి తరలించింది
ఆ వాహనం. హాస్పిటల్ చేరే లోపు స్టాఫ్ కి ఫోన్ చెయ్యటం, నేరుగా దియేటర్ లో వెంకట్రావుని తరలించడం అన్నీ నిమిషాల్లోనే..
ప్రమాదం కి
వైద్యం లబ్యత కి
మద్య కాలమే చాలా సార్లు కీలకంగా
ఉంటుంది.
అతన్ని మూడు
రోజుల తర్వాత ICU నుండి సాధారణ వార్డ్ కి వచ్చాక చాలా మంది బందు మిత్రులు పరామర్శ కి
వచ్చారు. అతను పని చేసే స్కూల్ సహచర ఉపాద్యాయులు, స్నేహితులు బందువులు ఇలా ..
నాలుగో రోజు ఒక
పదమూడు లేదా పద్నాలుగు వయసు ఉండే ఒక అమ్మాయి ఉదయాన్నే వచ్చి నేరుగా రౌండ్స్ లో ఉన్న డాక్టర్ గారిని కలిసింది. ” వెంకట్రావు
మాస్టారికి ఏమి ప్రమాదం లేనట్టేగా? “ ఆదుర్దా గా
అడిగింది
ఆయన నవ్వి “ఆయన స్టూడెంటు వా ??” అన్నాడు.
“అవునండి. ఫోర్త్ ఫామ్ చదువుతున్నాను.”
“మీ మాస్టారంటే అంత ఇష్టమా ?”
ఆమె సమాదానం
చెప్పలేదు. “ప్రాణ భయం ఏది లేదుగా “ అంది మరో సారి.
ఆయన ఆ పాప
తలమీద చెయ్యి వేసి “ఔట్ ఆఫ్ డేంజర్ అన్నాడు”
“థాంక్స్ డాక్టర్.. మానాన్న ఇంటికి రావాలంటే ఈ యదవ బతికే ఉండాలని
లాయర్ గారు చెప్పారు .”
“మాకు మా నాన్న కావాలి “ ఆ అమ్మాయి
కళ్ళు చూడటానికి డాక్టర్ చంద్ర శేఖర్ కి దైర్యం చాల్లేదు.
(వసంతం లోకి అడుగేడుతున్న చెట్టుని వంట చెఱకుగా చూడకు – శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ)
No comments:
Post a Comment