Friday, 1 July 2016

థాంక్స్ చెప్పట్లేదు

అతని పేరు సుధాకర్ అనుకుందాం. అతను NMR వాచ్మేన్ అని, అతని బార్య ఒక స్కూల్ ఆయా అని అనుకుందాం.
ముగ్గురు పిల్లల్ని చదివించాలని పట్టుదల, పిల్లలకి చదివే గుణం ఉందనుకుందాం. అద్దె ఇంట్లో ఉంటూ ఎదిగిన పిల్లల్ని నెలకి 15000 లోపు ఆదాయం తో చదివించడం అంటే ఎంత కష్టం.
ఆ కష్టం తోనే పెద్దమ్మాయి ని ece చదివించాడు. అమ్మాయి బాంక్ ఎగ్జామ్స్ రాస్తుంది. కేటగిరీ కూడా ఉంది ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తుంది. రెండో వాడు PACE లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు మూడో సంవత్సరం, మూడో వాడు ఇప్పుడు QIS కాలేజీ లో మెకానికల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది. ఫీ రీ ఎంబర్స్మెంట్ ఉంది. కానీ అడ్మిషన్ ఖర్చులు కొన్ని ఉన్నాయి. బస్ పాస్ లాటివి, యునివర్సిటి ఫీ, యూనిఫార్మ్ లాటివి. 
అబద్దం ఆడని అతని మనస్తత్వం అంటే నాకు ఇష్టం. నాకు వ్యక్తిగతంగా తెలుసు. మా హెడ్ ఆఫీసు. ఒంగోలు లో పని చేస్తాడు. పని చేసి సాయం అడిగే మనిషి. నా గురించి తనకి, తన గురించి నాకు ఎప్పటినుండో తెలుసు. నన్నెప్పుడు పెద్ద సాయం అడగలేదు. రెండు నెలల క్రితం అడిగాడు. రెండు రోజులు టైమ్ కావాలని చెప్పాను.
మిత్రుడు Raj Kanneganti కి నేను ఇన్బాక్స్ లో కొంత డబ్బుకావాలని అడిగాను. ఎందుకు ? ఏమిటి? అని వివరాలు చెప్పలేదు. నెల రోజుల తర్వాత అవసరం అని చెప్పాను. అతను ఏమి సమాదానం ఇవ్వలేదు. మూడో రోజు నా అకౌంట్ లోకి డబ్బు జమ అయి ఉన్నాయి. 

ఇవాళ QIS లో మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్న సుందర్ కుమార్కి అభినందనలు. ఇలాటి పరంపర మా పిల్లలచేత కొనసాగిస్తాను అని సుధాకర్ చెప్పడం నాకు సంతృప్తి ని ఇచ్చింది. రాజ్ కుమార్ జీ మీకు 'థాంక్స్' చెప్పట్లేదు  
శుబోదయం. _/\_

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...