అతనికి మెళుకువ
వచ్చింది. నిజానికి మెళుకువ అనే పదమే కరెక్ట్ కాదు.
అసలు
నిద్రపట్టలేదు అనటం సబబు.
గత
కొన్నాళ్లుగా తల పోటుగా ఆలోచనలు . కానీ ఇప్పుడు లేదు.
ఎందుకంటే తాను
నిర్ణయించుకున్నాడు.
తన నిర్ణయం లో
ఎలాటి మార్పు ఉండదు.
**
తలగడ కింద
చేత్తో తడిమాడు. తను తేచ్చుకున్నది అక్కడే ఉంది.
లోహం తో చేసిన
చిన్న డబ్బా.. అది.
మెడలో వేసుకునే
తాయత్తు సైజు లో ఉంది.
ఎక్కడ ఉండే
వాడు ? ఎంత సౌకర్యంగా ?
అసలు ‘రేపు’
అనే పదానికి భయపడకుండా ?
**
ఎందుకు? అసలు ఎందుకు తన కి పరిస్థితి వచ్చింది. ఆశ .. అశేనా ?
అవును ఆశే, ఆశ కూడా కాదు అత్యాశ ,
జూదం మిగులు
డబ్బుతో అడితే పర్లేదు కానీ ఎక్కడ ఆపాలో తెలీలేదు ??
నిలువుగా
మునిగిపోయాడు. ఉన్న డబ్బు అంతా కుమ్మరించేశాడు. ఎంత డబ్బు? లక్షలు,
కాదు కాదు రెండున్నర కోటి ?
ఆరేళ్లుగా
బార్యా పిల్లలని పట్టించు కోకుండా?
పగలు రాత్రి
తేడా లేకుండా, సరయిన తిండి తినకుండా, విశ్రాంతి
లేకుండా సంపాదించిన డబ్బు?
ఒక్క సారి గా రాష్ట్రం కా ని
రాష్ట్రం లో మహాబలిపురం లో ఆరు ఎకరాలు ఎగబడి కొనేశాడు. రెండేళ్లలో రెండు రేట్లు
పెరుగుతాయని ఆశ పడ్డాడు. తన జీవితం మారి పోతుందని కలలు కన్నాడు.
**
ఇప్పుడు
ఏమయింది.? లాండ్ మీద సివిల్ వాజ్యం నడుస్తుంది. కోర్టు నోటీసు వచ్చింది.
స్టేటస్ కొ ఇచ్చారు.
అమ్మటానికి
లేదు. కొనేవాడు లేడు.
**
ఎంత డబ్బు ?? ఎంత డబ్బు?
మూడు నాలుగు రూపాయల వడ్డీకి కూడా
తెసుకెళ్లి ఇన్వెస్ట్ చేశాడు. ఎండా వాన తో సంభందం లేకుండా వడ్డీలు పెరుగుతున్నాయి.
మొత్తం వ్యవస్థ అంతా స్తంభించింది.
ఉన్నవన్నీ
అమ్మి కట్టు బట్టల్తో మిగిళ్తే చాలు అనే పరిస్తితి.
తాను ఒట్టి
కుండ. గాలిలో దీపం.
**
ఇప్పుడు తనను
కాపాడేది. తలగడ కింద ఉన్న తాయెత్తే ..
ఆందులో ఉన్న ‘పొటాషియం సైనేడ్’ ఒక్కటే
నాలుక మీద రుచి
తెలిసే లోపు ప్రాణం పోతుంది
అంతా ప్రశాంతం
ఏ సమస్యలు ఉండవు.
హాయిగా ఉంటుంది
.. హా యి గా ..
**
అతను తలతిప్పి
మంచం పక్కనే చాప మీద బొంత వేసుకుని పడుకున్న బార్య రాజ్యాన్ని , పాలు తాగుతూ నిద్రపోతున్న తమ గారాల పట్టి ని గాజు కళ్ళతో చూశాడు.
ఖరీదయినా జీవనం
గడిపేటప్పుడు ఎలా ఉందో,
రెండు గదుల ఈ
ఇంట్లో కి మారాక కూడా అలానే ఉంది రాజ్యం .
అదే అమాయకత్వం
అదే చిరునవ్వు.
తనంటే అదే
ప్రేమ అదే నమ్మకం.
**
అతడు చెదిరిన
రాజ్యం పమిటని తల్లిని హత్తుకు పడుకున్న ‘నైమీ' ని చూస్తుండి పోయాడు. తన కుమార్తె చిన్ని కాలికి ఉన్న వెండి పట్టాల
వద్ద అతని చూపులు ఆగి పోయాయి.
బహుశా రాజ్యానికి ఆమాత్రం ‘నగ’ కూడా మిగల్చలేదు.
వెచ్చటి
కన్నీళ్లు అతని చెంపల నుండి జారీ తలగడ మీదకి జారాయి.
అతను తలగడ కింద
తడిమి తాను తెచ్చుకున్న డబ్బా అందుకుని లేచి కూర్చున్నాడు.
..
హటాత్తుగా
అతనికి ఒక ఆలోచన వచ్చింది . రేపు ఎలా ఉంటుంది ?
రాజ్యం లేసే
సరికి తను మంచం మీద నిస్తేజంగా పడి ఉంటాడు.
రాజ్యం ఏం
చేస్తుంది? గుండెలు పగిలేలా ఏడుస్తుందా? నైమీ ?? మా నైమీ ??
రాజ్యం ఏడవటం
అనే ఆలోచన అతని గాయాన్ని మరింత నలిపింది.
'ఇంటి యజమాని' తన శవాన్ని
ఇంట్లో ఉండనిస్తాడా? ..
శవం తో పాటు
రాజ్యాన్ని .. నైమి ని బయటకి గెంటి ?? అతనికి ధూఖం
ఆగలేదు
చేతుల్లో ముఖం
దాచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగాడు.
***
ఎప్పుడు లేచి
వచ్చిందో రాజ్యం అతని పక్కన కూర్చుని ఉంది.
“ఏమయింది బావా ? “ అంది.
అతను ధూఖం
ఆపుకోలేక పోయాడు . .
“రాజీ నీకు అన్యాయం చేశాను అంతా కాజేశాను . నేను వెళ్ళి పోతాను”
బార్యని
కరుచుకుని ఏడ్చేశాడు.
**
ఆమె అతన్ని
పొదివి పట్టుకుంది.
ఎద లోపలి భారం
తగ్గేదాకా ఏడవనిచ్చింది.
..
“బావా .. నువ్వు .. ఇది చాలు నాకు. ..
మనం మళ్ళీ
జీవితం మొదలెడదాం. ఎక్కడి కయినా వెళ్ళి పోదాం.
ఇక్కడ అన్నీ
అప్పగించేసెద్దాం.
‘పోలిక’
ఎవర్ని అయినా చంపేస్తుంది.
మనలాటి వారిని
ఇంకా త్వరగా చంపేస్తుంది.
మనకి వయసు
ఉంది. ఆరోగ్యం ఉంది. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు ఉన్నాయి.
ఎంతో కొంత
చదువుంది. మనం మళ్ళీ మొదలెడదాం.
ఏ డబ్బయితే
ఆరేళ్ళ నుండి నిన్ను మానుండి పరిగెత్తిచ్చిందో అదే డబ్బు మనని ఒకటిగా కలిపింది.
బావా .. నన్ను .. మన నైమి ని వదిలి , ఎలా ? “ రాజ్యం అతన్ని చుట్టుకు పోయింది.
**
చాప మీద నైమి
కదిలింది. తండ్రి లేచి పిల్లని ఎత్తుకున్నాడు.
ఆ గదికి ఉన్న
చిన్న కిటికీ వద్దకి వెళ్ళి చేతి లో ఇమిడి ఉన్న డబ్బాని బయట కాలవలో పడెట్టు
విసిరేశాడు.
..
దూరంగా కొత్త
సూర్యుడు చీకటిని ఉచ కోత కోస్తున్నాడు.
No comments:
Post a Comment