Thursday 7 July 2016

భయపెడదామని

మైన్ డోర్ లాక్ చేశాడో లేదో సరి చూసుకుని స్నానానికి బయలు దేరాడతను.
బాత్ టబ్ నింపుకుని లిక్విడ్ సోప్ కలుపుకుని, తలకి ప్లాస్టిక్ కాప్ తగిలించుకుని నీళ్ళలో పడుకున్నాడు. 
ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటూ, పక్కనే ఉంచుకున్న డ్రింక్ సిప్ చేస్తూ.. రిలాక్స్ గా ..
అరగంట గడిచాక మ్యూజిక్ ఆల్బమ్ పూర్తి అయి రెండో ఆల్బమ్ మొదలయ్యే గాప్ లో ఇంట్లోంచి ఏదో శబ్దం వినబడింది. చెవిలోంచి ఇయర్ ఫోన్లు పక్కలి లాగేసి, చెవులు రిక్కించాడు. అవును తమ ఇంట్లోనుండే.. 
ఇంట్లో ఎవరు లేరు. ఇంటావిడ హాస్పిటల్ లో ఉన్న స్నేహితురాలిని పరామర్శించడానికి వెళ్ళి ఉంది. 
హల్లో ఏదో శబ్దం వినిపించింది. ఏదో సర్దుతుంటే జారీ క్రింద పడిన వస్తువులు చేసే శబ్దం.
అతను మెల్లిగా లేచి టవల్ చుట్టుకుని, బెడ్ రూము లో గోడకి తగిలించి ఉన్న రైఫిల్ పట్టుకుని జాగర్తగా హాల్లోకి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. వంటగది లోకి తడిచిన వంటి మీది చుట్టుకున్న టవల్ తో మెల్లగా అడుగేట్టాడు. వంటింట్లో బార్య అంట్లు సింక్ లో వేసి కడుగుతూ ఉంది. 
ఎవరో దొంగ అని భయపడి పోయాను?” 
డూప్లికేట్ కి తో తాళం తీసుకుని ఇంట్లోకి వచ్చి మీకు వినబడేటట్టు కేకవేసానే?”
మ్యూజిక్ వింటున్నాను.? “
ఆ తుపాకి పని చేయదు కదా దాన్నెందుకు తెచ్చారు?”
పని చెయ్యని విషయం మనకే గదా తెలిసేది. ఉత్తినే భయపెడదామని
ఆమె అతన్ని ఒక్కసారి నింపాదిగా చూసి భయపెట్టటాని తుపాకి ఎందుకు ?” అంది.
ఆయన జారిన టవల్ అందుకున్నాడు. J 


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...