“తిమింగిలాలు మమ్మెల్ జాతికి
సంభందించినవి. మనుషుల్లాగే పిల్లలని గర్భం ద్వారా జన్మనిచ్చి , పాలిచ్చి పెంచుతాయి. ఇవి సినిమాల్లో
చూయించినట్లు మనుషులని మింగలేవు వాటి గొంతు ఆకారం తో పోలిస్తే చాలా సన్నగా ఉంటుంది.
“ క్లాస్ టీచర్ పాఠం చెప్పుకుంటూ పోతుంది.
చివర్లో సందేహాలు అడగమన్నప్పుడు
ఒక పిల్లాడు “మా ఫ్రెండ్ రాజుని పోయిన సంవత్సరం కొత్తపట్నం బీచ్ లో తిమింగిలాలు లాక్కుపోయి
మింగేసాయి” అన్నాడు.
“అవి మింగలేవు. కొన్ని తప్పుడు
నమ్మకాలని సినిమాలు మనకి చూపిస్తున్నాయి. ఉదాహరణకి పాములు ద్రవపదార్ధాలు తీసుకోలేవు. మన సినిమాల్లో
పాల గిన్నెలోంచి పాలు తాగినట్లు చూపిస్తారు”
టీచర్ మరింత వివరణ ఇచ్చే
ప్రయత్నం చేశారు.
పిల్లాడు కరుడుగట్టిన అనుమానస్థుడు.
“నేను స్వర్గానికి వెళ్ళాక రాజుని నిజమో కాదో అడుగుతాను” తను చెప్పినదాన్ని టీచర్ సమర్ధించక
పోవటం ఆ పిల్లాడిని బాధపెట్టింది.
టీచర్ కి నవ్వొచ్చింది.
పిల్లల మనసుల్లో సమాజం ఎంత చెత్త నింపుతుందో అని ఆవిడకి బాదేసింది.
“ఒకవేళ మీ ఫ్రెండ్ రాజు నరకానికి వెళ్ళి ఉంటే? అప్పుడేం చేస్తావు?”
**
**
**
“రాజుని మీరు అడిగి తెలుసుకోండి.”
పిల్లాడి సమాదానం.
No comments:
Post a Comment