Thursday, 14 July 2016

ఆపండీ

చర్చి లో వివాహం జరుగుతుంది.
ఫాదర్ ప్రమాణాలు చేయిస్తున్నారు.
హటాత్తుగా వెనుక నుండి ఒక స్త్రీ తన ఒడిలోని పసిపిల్లని బుజాన వేసుకుని జనం లోంచి ముందుకు రాసాగింది. 
***
బిత్తరపోయిన వధువు 'వరుడు' ని లాగి ఒకటి పీకింది. 
వధువు తల్లి స్పృహతప్పింది. 
వరుడి స్నేహితులు ఈ సన్నివేశాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు. 
వరుడి తండ్రి కుమారుడిని అనుమానంగా చూశాడు. 
ఫాదర్ బేలగా ఆమెని గమనిస్తున్నాడు.
ఏమయింది బిడ్డా ?” ఆయన పలకరించాడు.
ఆమె బిడ్డని అందరికీ కనిపించే టట్లు రెండో భుజం మీదకి మార్చుకుంది.


...
...
...
...
...
...
...
అక్కడ ఆమూల కూర్చున్నవాళ్ళకి పెళ్లి ప్రమాణాలు వినబడటం లేదు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...