రహదారి మీద ప్రమాదం
జరిగింది.
వేగంగా వెళ్తున్న
ప్రక్క రాష్ట్రం మంత్రి గారి కారుకి ఊరి చివరనున్న
దాబా హోటల్ వద్ద ఒక గాడిద గుద్దుకుంది.
స్పాట్ లో చనిపోయిందా
జీవి.
హోటల్ వాళ్ళు
కారు ఆపేశారు. జనం ప్రోగయ్యారు. మంత్రి గారిని గుర్తుపట్టలేదు.
గాడిద ల తో పాటు
ఉన్న పిల్లాడి తండ్రి రావాల్సిందే, నష్ట పరిహారం కట్టాల్సిందే. అప్పుడు కానీ కారు కదలనిచ్చేది లేదని తేల్చేశారు.
కారు పక్కగా ఆపించి
తాళాలు స్వాదినం చేసుకున్నారు. గాడిదల కాపరి
సెల్ ఫోన్ లు హామిగా దగ్గర ఉంచుకున్నాడు.
ఎటు పాలుపోని
పరిస్థితిలో మంత్రి గారు డ్రైవర్ ని దూరంగా కనిపిస్తున్న ఊర్లోకి సాయం కోసం ఎవరినయినా
పట్టుకు రమ్మని పురమాయించారు.
***
అర్ధ గంట గడిచింది.
గంటయింది. గంట మూడు గంటలయ్యాయి.
డ్రైవర్ తిరిగొచ్చాడు.
మెడలో పూల దండలు ఉన్నాయి. కడుపునిండాక పైన ఒలికిన కల్లు వాసనతో, ఎర్రటి కళ్లతో తులుకుంటు వచ్చాడు.
మంత్రి గారికి
కోపం వచ్చింది. “ ఏం జరిగింది? సాయం తీసుకు రమ్మన్నాను. ఈ తాగుడేమిటి?” కేకలెట్టాడు.
డ్రైవర్ సంబాళించుకుని చాలా మంది గుమిగూడి రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. వాళ్ళకి అర్ధం కావాలని నా కొచ్చిన ఉర్దు లో
"మినిస్టర్ కా గాడి కొ యాక్సిడెంట్ హోగయా, గధా వహీ మర్ గయా .’ అని చెప్పాను.
పూలదండలు వేసి కల్లు తాపించి కడుపునిండా స్వీట్స్ పెట్టి పంపించారు.”
"మినిస్టర్ కా గాడి కొ యాక్సిడెంట్ హోగయా, గధా వహీ మర్ గయా .’ అని చెప్పాను.
పూలదండలు వేసి కల్లు తాపించి కడుపునిండా స్వీట్స్ పెట్టి పంపించారు.”
No comments:
Post a Comment