Wednesday 13 July 2016

భానుమతి తెలివి

బూందీ, స్వీటు టిస్యూ పేపరు మూడు ఒకే ప్రెస్ కవర్లో ఉంచిన పాకెట్లు.. డిపార్ట్మెంటల్ స్టోర్ ప్రారంభానికి విచ్చేసిన వారందరికి ఇచ్చారు.
..
"
టిస్యూ పేపరు అయిడియా బాగుంది కదా?" అంది బర్తతో భానుమతి.
..
"
టిస్యూ పేపరు విడిగా అందుబాటులో ఉంచాలి కానీ పాకెట్ లో వేస్తే ఏమిటి ఉపయోగం?" ఆమెకి బర్త మాట నచ్చదు.
...
తన 'టాలెంట్' ని తోక్కెస్తున్నాడని గొప్ప అనుమానం. అందుకే అతన్ని మాట్లాడనివ్వదు. సమాదానం కోసం చూడదు. తను తెలివిగలదానిని అని భానుమతికి ఒక గొప్ప నమ్మకం. ఆ నమ్మకం తోటే బాంక్ నుండి లోను తీసుకుని భారీగా స్టోర్ ఓపెన్ చేసింది.
..
"అంతా బాగుంది కానీ ఆ రాక్ వద్ద చిన్న పొరపాటు జరిగినట్లుంది."
భానుమతి కి అప్పిచ్చి రిబ్బన్ కటింగు కి వచ్చిన బాంకు మేనేజర్ అన్నాడు..

..
"
అక్కడ చూడండి .Tooth Brush లూ, Tooth Paste లు తారుమారుగా ఉన్నాయి." ఆమెకి చూయిస్తూ చెప్పాడతను. వచ్చిన అతిదులు ఇంకా గమనించలేదు.
...
బానుమతి హడావిడిగా paste లు, brush లు అయిదు నిమిషాల్లో స్టాఫ్ చేత సర్దించింది.. ప్రైస్ టాగ్ లు సరిచూసి. స్వయంగా తానే అంటించింది.
..
సరిపోయిందిగా?? అన్నట్టు చూసింది మానేజర్ వైపు.
.....
"
రాక్ పైన ఉంచిన పేర్లు మారిస్తే సరిపోయేది కదా ?" అంతా గమనించిన బానుమతి మొగుడు.
ఈయనకి ఎందుకండి. రాత్రికి ఇంట్లో బువ్వ లేకుండా చేసుకోవటం తప్పితే..
..
.'
మేనేజరు గారు దిగులు పడకండి...విభూతి పెట్టుకు పడుకోండి. EMI లు వాళ్ళాయన తీర్చేస్తాడు


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...