Wednesday, 3 August 2016

మనం చేస్తున్నది కరెక్టేనా?

శ్రావణ మాసం తొలి ఉదయం నేనో విషయం చర్చకు తీసుకు రాదలిచాను.
వ్యక్తిగతంగా నాకు భగవంతుని పూజా విధానాలు కానీ మంత్రాలు  కానీ తెలియదు . కానీ మనసు నిండా భగవంతుని ఉనికిని విశ్వసిస్తాను. పూజా కార్యక్రమాలప్పుడు మా శ్రీమతి పూజ చేస్తుంటే నేను లిప్ మువ్మెంట్ J ఇస్తుంటాను.
అభయంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణం లో నేను టెక్నికల్ విషయాల భాద్యత మాత్రమే తీసుకున్నాను, ఆగమ విషయాలు తెలిసిన పెద్దలు మిగిలిన విషయాలు చూస్తున్నారు. నేను కేవలం సర్వీస్ ప్రొవిడర్ ని. ఇది నిజం.
మంచి భావాలు, ఆలోచనలు ఎక్కడున్నా చదువుతాను వాటిని ఆస్వాదిస్తాను; వీలయితే మీతో పంచుకుంటుంటాను.
నాకో విషయం చెప్పాలని ఉంది.
ఆ మధ్య కాలికి వాడే చెప్పుల మీద, శరీరం కప్పుకునే బికినీల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ప్రచురించారని వాళ్ళని నానా తిట్లు తిట్టాము. ఆ వస్తువులు ఆన్ లైన్ లో అమ్మే సంస్థల సేవలు కూడా రద్దు చేయాలని ఆవేశపడ్డాం.









మరి మనం చేస్తున్న పని ఏమిటి?
శ్రావణ మాసం ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళండి. అప్పటికే చాలా మంది బక్తులు, దీపారాదన చేసి ఉంటారు, పసుపు, కుంకుమ పాకెట్లు, సాంబ్రాణీ కడ్డీలు, కర్పూరం, నూనె పాకెట్లు ఎక్కడివక్కడ కాలితో తొక్కకుండా నడవ లేకుండా పడి ఉంటాయి లేదా కొంచెం శ్రద్ద గలవాళ్లు చెత్తబుట్టలో వేస్తారు.




వాటన్నిటి మీదా భగవంతుని రూపాలు ముద్రించి ఉండవా?
ప్రసాదం పాకెట్లు, కేరి బాగులు వీటిమీద ఏం ముద్రిస్తున్నాం ??  చివరికి ఇవన్నీ ఎక్కడికి చేరుతున్నాయి? చెత్త లోకి లేదా మురికి కాలవలోకి.
మరి హిందువులుగా మనం మన దేవతా రూపాలని  నిజంగా గౌరవిస్తున్నామా?
మనసు లగ్నం కావటం కోసం ఏర్పాటు చేసుకున్న దేవతా మూర్తుల పాత్రలని  మన సినిమాల్లో _____ (మాటల్లేవు)
మన ఇంట్లో పెద్దని మనం గౌరవించకుండా పక్కింటి వాళ్లనుండి పూజలు అందుకోవాలనటం ఎంతవరకు సబబు?

03/08/16

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...