గాఢ నిద్రలో ఉన్న ‘భోపాల్’ ఉలిక్కి పడింది.చల్లటి
ఉదయపు గాలుల్లో విషం. విపరీతమయిన వేగం తో
నగరాన్ని చుట్టుముడుతున్న విష వాయువు.
కాల్చిన ఉక్కు గుండెల్లోకి పీల్చి నట్లు
ఊపిరితిత్తుల మంట. ఏం జరగబోతుందో
తెలుసుకునేలోగా జనాలను మృత్యువు మింగేస్తోంది .
శరీరం మీద మంటలు, దద్దుర్లు.ఎక్కడివారక్కడ ఎలా ఉన్నవారు అలానే గిల
గిలా తన్నుకుంటున్నారు.
అది 1984 డిశంబరు 3.యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి మిథైల్ ఐసోసినెట్
అనే విషవాయువు రెండు గంటల్లో 42 టన్నుల విషాన్నికక్కిన
రోజు.
రెండున్నర వేలమంది మృత్యువాత పడిన రోజు. వేలాది మంది శరీరాలని, ఊపిరి తిత్తులని విషం అంటుకున్న రోజు.
చరిత్రలో ఒక చీకటి రోజు.
***
ముందు రోజు రాత్రి ‘ ప్రవీణ్’ పండా సిటీ నుండి భోపాల్ వచ్చాడు. తన వివాహానికి మిత్రులని ఆహ్వానించాల్సి ఉంది అని ‘పూజా’ తో చెప్పి వచ్చాడు .
సాయం కోసం సైన్యం రంగం లోకి దిగింది. వేలాది గాస్ మాస్కు లు ధరించిన సైన్యం బ్రతికి
ఉన్న వారిని సిటీకి దూరంగా తరలిస్తున్నారు.
అనేక మెడికల్ క్యాంపు లు నిర్వహణ జరుగుతుంది. ఎంతో మంది బాధితులని గుర్తిస్తున్నారు.
సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నగరాన్ని సాధ్యమయినంతగా ఖాళీ చేయిస్తున్నారు.
మృతదేహాలని గుర్తించినవి పోను మిగిలినవి అనాధ
ప్రేతాలా తగలెడుతున్నారు. అశ్రద్దగా ఉంటే ప్లేగులాటి
ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
ఉన్నతాధికారులు/సైన్యం ఆక్సిజన్ మాస్కు లు ధరించి
తమ విధుల్ని చిత్త శుద్దితో చేస్తూ ఉన్నారు.
అలాటి భోపాల్లో ఆ విపత్తు జరిగిన మూడో రోజు ఒక
పోలీసు ఉన్నతాధికారిని కలిసింది 'ఆమె '.ఆమెకి అతడిని కలవటం అంత సులభంగా సాధ్యపడలేదు.
హోం మినిస్ట్రీ లో పనిచేస్తోన్నతన మేనమామ పలుకుబడి
ఉపయోగించి ఆ పోలీసు ఉన్నతాధికారి అప్పాయింట్మెంట్ పొందగలిగింది.అతను వెహికల్
దిగుతూనే సబార్డినేట్స్ తో మాట్లాడుతూ క్యాబిన్ లోకి వెళ్తుంటే ఆమె డోర్ వద్ద
నిలబడి ఉంది.
ముఖాన మాస్క్ ఆమె మొఖం లోని ఆదుర్దాని కానీ, బేల తనాన్ని కానీ దాచలేక పోతున్నాయి.అతను ఆమెకి
సైగ చేసి లోనికి పిలిచాడు.
"ఎస్ ప్లీజ్” ఆమె అతని టేబుల్ మీద ఒక కవరు ఉంచింది.అది ఒక
పెండ్లి పత్రిక.
అతడు ఆమె వైపు విచిత్రంగాను, కవరు వైపు ఆసక్తి గాను చూసాడు. "ప్రవీణ్ వెడ్స్ పూజా” అందంగా ఉన్న కార్డు అంతే అందం గా ఆ జంట ఫోటోలు.
"డిశంబరు 6 వ తేదీ ఉదయం"పండా సిటీ లోని రైల్వే కల్యాణ
వేదిక"లో వివాహం." అని ఉంది.
అతను చప్పున తన చేతి వాచి చూసాడు. ఆరో తేదీ ఉదయం 9.00 గంటలు.
భోపాల్ కి 18 కిలోమీటర్ల దూరం లోని పండా నగరం లో ఈ పాటికి
పెళ్లి జరుగుతూ ఉండాలి.
అతని ఆలోచనలని అడ్డుకుంటూ "నేనే పూజ "
అందామె.
"ఈ నెల 2 వ తేదీ రాత్రి మిత్రులని ఆహ్వానించాల్సి ఉందని
భోపాల్ వచ్చాడు.
ఆ తర్వాత ఏమయ్యిందో తెలీదు." ఆమె ముఖానికి
ఉన్న గ్యాస్ మాస్క్ మెల్లిగా కదులుతుంది దాని వెనుక దుఃఖం కరుగుతుంది అని
అతనికి అర్ధం అయ్యింది.
ఆమె బ్యాగ్ లో నుండి ఇరవై పైగా ఫోటోలు తీసి టేబుల్
మీద ఉంచింది.అన్నిటి లోను ఎర్రగా పొడవుగా ఒకే యువకుడు.
చిరునవ్వు తో ఉన్న ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అతనికి విషయం అర్ధం అయ్యింది.
" వియ్ ట్రై టు లొకేట్. గివ్
మీ కాంటాక్ట్ నెంబర్" అతను ఆమె కళ్ళలోకి చూడలేక పోయాడు.
ఆమె ‘పండా సిటీ’ లో తన ఫోన్ నెంబరు, చిరునామా వ్రాసిఉన్న కాగితం అతని టేబుల్ మీద ఉంచి
నమస్కరించింది.
***
ఆతరువాత జరిగిన అత్యవసర సమావేశం లో అతను ఆ ఫోటో లు
అధికారులకి పంచి క్లుప్తంగా విషయం చెప్పాడు.
" ట్రయ్ టు ఫిగర్ ఔట్ థి
మ్యాన్ వేర్ ఎవెర్ హీ ఈజ్ "
మర్నాటి ఉదయం అతను ఆఫీసుకి వస్తూఉంటే వైర్లెస్
సెట్ మోగింది.
తన ఇమ్మిడియట్ సబార్డినేట్ నుండి.“సర్ .. ప్రవీణ్ దొరికాడు. సారీ అతని బాడీ దొరికింది. కానీ సార్ హీ
ఈజ్ ఏ సన్ ఆఫ్ బిచ్. అతని బాడీ తోపాటు హోటల్ గది లో నగ్నంగా ఉన్నమరొ మహిళ బాడీ కూడా దొరికింది."
No comments:
Post a Comment