ఈ రోజు సాయంత్రం ఆప్తమిత్రుడు
డాక్టర్ వెంకట్ చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చాడు.
తాను ఉద్యోగానికి శెలవు పెట్టి MS జాయిన్ అయ్యాక గతం లో లా కలవటం కానీ కలసి మస్తాన్
ఇడ్లీ తినటం కానీ సాద్యపడటం లేదు.
హటాత్తుగా ఫోన్ చేసి “ఒంగోలు లో ఉన్నాను” అన్నారు.
“ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే
ఫ్రీ అయ్యాను వచ్చేయండి”
హల్లో దివానీ మీద సిట్టింగ్
వేశాం.
మా పెద్దమ్మాయి, అనాటమీ గురించి అడిగిన కొన్ని సాదారణ
ప్రశ్నలతో ప్రారంభం అయిన సమావేశం మూడున్నర గంటల పాటు సాగింది.
అనేక సందేహాలకి తన యాపిల్
6+ నుండి కొన్ని వీడియో లు పిడిఎఫ్ లు చూయిస్తూ
‘బయాలజీ తో ఏమాత్రం సంబందం’ లేని మాకు చక్కగా
బోదపడేట్టు గా అనేక విషయాలు చెప్పు కొచ్చారు.
గొప్ప మెడికల్ కాలేజీ లలో
ఆ మాత్రం చెబుతారని కూడా నేను అనుకో ను.
సత్సంగమ్ అంటే ఇదే. దేవాలయపు ఆవరణాలలో కూర్చుని
మైకుల్లో ప్రార్ధన లు, నోటితో అప్రస్తుతాలు మాట్లాడు కోవటం
కాదు.
సంభాషణ మద్యలో విట్ k గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక
చిన్ననాటి సంఘటన జ్ఞాపకం వచ్చింది.
‘వెంకట్’ కి సెండాఫ్ ఇవ్వటానికి మెట్లు దిగుతుంటే మెట్లమీద వర్షం నీళ్ళు ఉన్నాయి.
***
అలాటి వర్షం పడిన ఒక సాయంత్రం
చాన్నాళ్ల క్రితం ..
పెంకుటింటి వరండాలో ఉన్న
లో ఒల్టేజ్ బల్బు వెలుగులో మరి కొంతమంది పిల్లలతో కలసి హోం వర్కులు చేసుకుంటున్నాప్పుడు
మా నాన్న (టీచరు) బజారు నుండి వచ్చారు.
వచ్చి రాగానే కాళ్ళు కడుక్కుని వరండాలో కుర్చీ
లో కూర్చుని మా హోమ్ వర్క్ పుస్తకాలు చూడటం మొదలెట్టాడు.
బాగస్వామ్య లెక్కలు చేస్తున్నట్టు
గుర్తు. అప్పట్లో మనం లెక్కల్లో ఇరగదీసే వాళ్ళం?
ఎందుకో తెలీదు ఒక లెక్క తప్పుచేశాను.
తలమీద చెయ్యి వేసి వంగదీసి వీపున ఒక దెబ్బ వేశాడు.
తూలి కింద పడిన నేను ఎంతకీ లేవలేదు.
ఆయన కంగారుగా నన్ను లేపబోయాడు. “నాన్న ఏందిది
?” నేను బయంగా అరిచాను.
ఆయన కాలికి ఆరోవేలు ఉంది.
అది మూడో వేలుకి ముందుపక్క అతుక్కుని.
అది ఒక్కటే కదులు తుంది.
నాన్నకి ఏమి టో అర్ధం అవలేదు.
లో ఒల్టెజ్ కాంతి లో అది సరిగా కనిపించడం లేదు.
నేను దాన్ని పట్టుకున్నాను.
మెత్తగా ఉంది నాన్న కాలి నుండి లాగుతున్నాను. అది కాలికి అతుక్కొని ఉంది. నేను లాగినంత
అది సాగుతుంది గాని కాలి నుండి వీడి రావటం లేదు.
“నాన్నా ఇదేదో పాము నిన్ను
కరుస్తుంది.” నేను దాన్ని వదలకుండా నే పెద్దగా ఏడుపు లంకించుకున్నాను.
నాన్నకి ఏమి అర్ధం కాలేదు.
అమ్మ ఇంట్లోంచి బాటరీ లైట్ తీసుకువచ్చి చూసింది.
“వాసు చెయ్యి తియ్యరా” అంది.
“ఏదో పామమ్మా నాన్న కాలి
వేలు పట్టు కుంది.”
అమ్మ జాగర్తగా చూసి వరండా
గూట్లో ఉన్న సున్నం ముగ్గు తీసి నేను పట్టుకున్న చోట పోసింది.
నిమిషం తిరగకుండా అది నా
చేతిలోకి వచ్చేసింది. నాన్న కాలు వెనక్కి లాక్కున్నారు.
“అది జలగ రా, ఎక్కడో వర్షం నీళ్ళలో నుండి నడిచేటప్పుడు
పట్టుకుని ఉంటుంది.”
“నాన్నా నువ్వు
బండోడివా?? ఆమాత్రం తెలీదు” పెద్దగా ఏడుస్తూ నాన్న ని కొప్పడ్డాను.
నాన్న నన్ను ఎత్తుకుని లోపలికి
తీసుకెళ్ళాడు. ఏమి అనలేదు.
ఆ రాత్రి ఆయన నన్ను దగ్గరగా పొదువుకోవటం మగత నిద్రలో నాకు గుర్తుంది.
No comments:
Post a Comment