ఒక అప్లికేషన్
స్పీడ్ పోస్ట్ చేయటానికి ఒంటిగంట లోపు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాను.
కవర్ తూకం వేయించి
స్టాంపులు అంటించి రెసిట్ తీసుకున్నాక వెనక్కి వస్తుంటే..
ఒక ‘పెన్షనర్’ అనుకుంటాను
నన్ను ఆపాడు.
“ఈ పూట ఆర్థరైటిస్
ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉంది. వేళ్ళు వంగటం కూడా కష్టంగా ఉంది.
ఈ కార్డ్ మీద
అడ్రెస్ రాసి పెడతావూ ?? “ అన్నారు.
చెప్పిన చిరునామా
ని అడ్రస్ బాక్స్ లో ఆంగ్లం లో రాశాను. పిన్ కోడ్ నెంబరు కూడా వేశాక
“అదే చేత్తో రెండు
మాటలు తెలుగులో వ్రాసి పెడతావూ “ అన్నాడాయన.
“చెప్పండి.”
అతను కొడుకు దగ్గర
బెంగుళూరు లో ఉంటున్న బార్యకి. తన ఆరోగ్యం సరిగా లేనందున వీలయినంత త్వరగా రమ్మని రెండు వాక్యాలు చెప్పాడు.
అంతే.
“ఇంకేమయినా రాయమంటారా?”
కింద PS అని వ్రాసి “చేతి వ్రాత సరిగా లేనందుకు
ఏమి అనుకోకు” అని మరొక్క మాట రాయండి సరిపోతుంది..
*******************
(ఒక్క
సారి పేపర్ మీద ఏదో ఒకటి, పది వాక్యాలు తెలుగు లో మీరూ రాసి చూడండి.. ధ్యావుడా .. ఇది తెలుగేనా అనిపించక
పోతే ఒట్టు. మనందరం ఇప్పుడు టైపు వీరులమే J మినహాయింపులు
అరుదుగా ఉంటాయి )
No comments:
Post a Comment