Sunday, 31 July 2016

గ్లాసు

రాత్రి మాకు దగ్గర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ కి, అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట (10-08-2016) కి ఆహ్వానం మరియు విరాళాలు కోసం మిత్రులతో కలసి వెళ్ళాం. 
....
ఒక ఫ్లాట్ తో సమావేశం అయ్యామ్. ఒక పెద్దమనిషి "మీరు మాదగ్గరకి ఎప్పుడు రాలేదే? మేము రెండు లక్షల దాకా వసూలు చేసి ఇస్తాం. కమిటీ లో మెంబర్ షిప్ ఇస్తారా?, అసలు కమిటీ లో ఎవరెవరున్నారు? ముస్లిం వ్యక్తి కమిటీ ప్రసిడెంటు గా ఎలా ఉన్నాడు. అసలు అకౌంట్ ఎలా మైన్టైన్ చేస్తున్నారు. ఆడిటర్ ఎవరు. మీ లెక్కలు పట్టుకొచ్చారా? " అని అడిగాడు. 
..
"
మేం వచ్చింది వారం గడువులో జరగనున్న ప్రతిష్ట కార్యక్రమం గురించి ఆహ్వానించడానికి వీలయితే కొంత డబ్బుగాని, వంట సరుకులు కానీ విరాళం ఇస్తారని ". మా ఓబులు రెడ్డి మాస్తారు నెమ్మదిగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు.
మా వాళ్ళు నా వైపు కంగారుగా చూశారు ఇలాటి సందర్భం లో నా నోటి వెంట వచ్చే 'శూలాల' సంగతి తెలుసు వాళ్ళకి. 
నేను ముభావంగా కూర్చుని ఉన్నాను. 
..
ఇంతలో లోపలి నుండి వచ్చిన ఇంటావిడ మేము తాగిన మంచి నీళ్ళ గ్లాసులు ట్రే లో లోపలికి తీసుకెళ్తుంటే .. ఖాళీ గ్లాసు ఒకటి కింద పడి శబ్దం చేసింది.

..
నేను లేచి నిలబడి "ఖాళీ గ్లాసు లకి శబ్దం ఎక్కువ. లేవండి మన సమయం విలువయినది ." అని లేచి ముందుగా బయటకి వచ్చాను.

Saturday, 30 July 2016

నిర్మల


1994 నవంబర్/డిశంబర్ నెలలో ఒక రోజు.
ఒంగోలు, కొండమీది శివాలయం ముందున్న ఒక మెస్ లో బోజనమ్ చేయటానికి ఆగాను. రెడ్డి మెస్ అని బోర్డు ఉంది. (బి‌జే‌పి రెడ్డి అంటే ఫేమస్ అప్పట్లో). అప్పటికే  రెండు రోజులయింది కడుపునిండా బోజనం చేసి నాన్న బేతున్ నర్సింగ్ హోం లో ఉన్నాడు. మా చిన్నమ్మాయి రోజుల పిల్ల. రమ పిల్లలు మా అత్తగారింట్లో ఉన్నారు. హాస్పిటల్ లో అమ్మ నాన్నకి తోడుగా ఉంది. బోజనమ్ చేసి అమ్మకి నాన్నకి ఒక పార్సిల్ బోజనమ్ తీసుకెళ్దామని బైట ఉంచిన తొట్టిలో నీళ్ళతో చేతులు మొహం కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాను.
పాతకాలం నాటి మిద్దె ఇల్లు అది. వరండా లో టేబుల్ కుర్చీలు వేసి ఉన్నాయి. అరటి ఆకులు వేసి ఉంచారు. ఆకు కడుక్కోగానే ఒక అమ్మాయి, కూరలు వడ్డించింది. రెడ్డి గారు వేడి వేడి అన్నం వడ్డించి మద్యలో నెయ్యి వంచి అప్పడం వేశారు. తెల్లటి అన్నం శుబ్రంగా రుచిగా ఉన్న కూరలు కడుపులో ఆకలి. పెద్ద పెద్ద ముద్దలు నాలుగు మింగాక కానీ నాకు కళ్ళు తిరగటం ఆగలేదు. ఈ లోగా పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి పలకరించాడు రోశయ్య పంతులు గారి పిల్లాడివి కదూ ?’ అని . అవునండి. ఆయన కొడుకునే” ఉదాసీనంగా చెప్పాను.
పిచ్చాపాటి నడిచాక “నాన్న ఆరోగ్యం బాగాలేదండీ. అర్జంటుగా GJ (అన్నవాహిక నుండి పెద్దపేగు కి వెళ్ళే మార్గాన్ని మరో మార్గం ద్వారా కలపటం) చేయాల్సి వచ్చింది. హాస్పిటల్ లో ఉన్నారు. సర్జరీకి రక్తం HB కౌంట్ చాలా తక్కువ ఉంది. ప్రొఫెషనల్ డోనర్స్ బ్లడ్ నుండి హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా పెరగటం లేదు. ఫ్రెష్ బ్లడ్ అయితే మంచిది అని చెబుతున్నారు. పైగా నాన్నారికి A + రక్తం. అంత విరివిగా దొరికేది కాదు. కనీసం 50 శాతం కి చేరితే కానీ సర్జరీ వీలవదట.” అనవసరం అయినా దొరికిన చిన్న ఆదారాన్ని కూడా వదులుకోవటం ఇష్టం లేక వివరంగా చెప్పాను.
ఆయన అనవసరంగా వీడిని కదిలించాను అనట్టుగా చూశాడు.
అప్పుడు బోజనం వడ్డించే అమ్మాయి, ఒక్కసారి నాముందు ఆగి “నాది A+ బ్లడ్డే నేను ఇస్తాను” అంది స్థిరంగా.
అప్పుడామెని గమనించాను. సుమారు ఇరవై ఏళ్ల అమ్మాయి, ఎర్రగా చక్కటి పుటక, ముఖాన చదువు వల్ల వచ్చిన అందం. నేను ఆమెని అనుమానం గా చూశాను.
“రేపు సాయంత్రం తిరుపతి వెళ్తున్నాను. ఎల్లుండి నుండి ఎం‌ఏ క్లాసులు మొదలవుతాయి. ఎస్‌వి యూనివర్సిటీ లో ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అయితే నాకు వీలవుతుంది.” నాకు షాక్ మీద షాకు.
ఇంతలో పక్క నుండి నన్ను పలకరించిన ఆయన మొత్తానికి రెడ్డి గారి కూతురు అనిపించుకున్నావు” అన్నాడు.
అప్పుడు బి‌జే‌పి రెడ్డి గారి కి స్వయానా కుమార్తె అని నాకు అర్ధమయింది.
బోజనం పూర్తి చేసి పార్సిల్ కట్టించుకుని రెడ్డి గారితో చిన్నగా” మీ అమ్మాయి మా ఫాదర్ కి బ్లడ్ ఇస్తానని అంటుంది” నేను మాటలకోసం వెతుక్కుంటుంటే “ఇస్తానంటే తీసుకెళ్లు” అన్నాడాయన విషయం చాలా మామూలన్నట్లు.
మర్నాటి ఉదయం తొమ్మిది గంటలకి వచ్చాను. గేటు తీసుకుని లోనికి వెళ్ళేసరికి కూరగాయలు కోస్తున్ననిర్మల ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి డ్రస్ మార్చుకుని నాతో వచ్చేసింది. నేను రిక్షా పిలవబోతుంటే “డబల్స్ తోలటం రాదా అంది?”  నా bajaj M -80 బండి వెనుక కూర్చుని వచ్చి 300ఎం‌ఎల్ బ్లడ్ ఇచ్చింది. (నాన్న బ్లడ్ కి మ్యాచ్ చెయ్యటం నాన్నకి ఎక్కించడం దాదాపు 18 శాతం పెరిగి సర్జరీకి సరిపడే స్థితికి రావటం జరిగింది.)
తిరిగి నా బండి మీదే వాళ్ళ ఇంటి వద్ద దించాను. ఆ సాయంత్రం ఆమె బస్సులో తిరుపతి వెళ్ళేటపుడు బస్స్టాండ్ కి వెళ్ళి బలవంతాన “విజయానికి అయిదు మెట్లు” పుస్తకం చదవమని ఇచ్చాను.  
తరువాత కాలం లో నాలుగయిడు సార్లు రెడ్డి గార్ని కలిశాను కానీ నిర్మల ని మాత్రం కలవలేక పోయాను. ఎందుకో తెలీదు. ఈ రోజు ఆమె గుర్తొచ్చింది. ఈ పోస్ట్ ద్వారా ఆమె తారసపడితే సంతోషం.
నిర్మలా ఎక్కడున్నా, గొప్ప మనసున్న నీవు బాగుండాలి . stay blessed.  



టెక్నిక్


జైల్లో ఖైదీలకి కొన్సిలింగ్ జరుగుతుంది.
..
నిజానికి మీరు చేసే పనులన్నీ బయట చాలామంది చేసి సంఘం లో పేరు తెచ్చుకున్నవే. మీరు టెక్నిక్ లేకుండా మొరటుగా చేసి ఇక్కడికి వచ్చారు. అదే టెక్నిక్ గా చేసి ఉంటే బోలెడు డబ్బు, పేరు వచ్చి ఉండేది.”..
..
మోటివేటర్ మాటలు విన్న జైలర్ ఉలిక్కి పడ్డాడు...
..
ఖైదీలు ఆసక్తి గా వినసాగారు. ..
ఒక ఖైదీ లేచి నిలబడి “నేను పిల్లల్ని వాళ్ళ కుటుంబం నుండి కిడ్నాప్ చేసి ransom డిమాండ్ చేసేవాడిని.”
..
మోటివేటర్  ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా “అదే పని ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు/ యూనివర్సిటీలు చేస్తున్నాయి; అది కూడా చాలా గౌరవంగా ..”..
..

రెండు నిమిషాల్లో మోటివేటర్ ని అక్కడి నుండి జైలర్ కిడ్నాప్ చేయించాడు.  

Sunday, 24 July 2016

చె ద లు

స్వంత ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి లేదా ఫ్లాట్ ఉన్న వారికి బాగా పరిచయం ఉండే చికాకు చెదలు
చెదలు అంటే తెల్ల ఛీమలు అని వాడుకలో అంటుంటారు కానీ అవి చీమలు కావు. చెదపురుగులు సాంఘీకంగా (చీమల లాగా) జీవించే కీటకాలు. పని చేయటానికి. లార్వాలు పుట్టించడానికి, సైన్యం లా కాపలాకి, ఆహార పరిశోదనకీ, విడివిడిగా ఇవి పనులు కేటాయించుకుంటాయి. రాణి కీటకాలు, కూలీ కీటకాలు ఇక్కడకూడా సేమ్ టూ సేమ్.  ఇవి ఎక్కువగా చనిపోయిన వృక్ష సంభందాల పై జీవిస్తాయి. ముఖ్యంగా కలప, ఎండిన ఆకులు, మట్టి, జంతువుల పేడ వీటికి ఆహారం. సుమారు నాలుగువేల జాతుల పైగా ఉండే వీటిలో 10 శాతం మాత్రమే కట్టడాలకి, పంటలకు/అడవులకు నష్టం కలిగిస్తాయి.
ఇళ్లలో ఎంతో మోజు పడి, ఖర్చు పెట్టి చేయించుకున్న ఫర్నిచర్, దరవాజాలు, తలుపులు, ముఖ్యంగా ఫ్లై వుడ్ లేదా న్యూ వుడ్ తో చేసిన కప్ బొర్డ్స్ వీటికి అత్యంత ప్రియమయిన ఆహారం. వేప లాటి చక్క ని ఇవి తినవు అని అనుకోవటం భ్రమ, బాగా ఆకలి అయ్యి, దగ్గర్లో హోటల్ లాటివి లేనప్పుడు పెళ్ళాం వండినది తిన్నట్టే ఇవి మరేవి దొరకనప్పుడు, చేదుగా ఉండే వేపని కూడా వదలవు. కార్డ్ బోర్డు, పై వుడ్, న్యూ వుడ్, పొరలు పొరలుగా ఉండే ఫ్లష్ డోర్లు, పుస్తకాలు, వాటికి మైదా అంటించి వేసే అట్టలు లాటివి వీటికి ప్రియాతి ప్రియమయిన ఆహారం , తదుపరి వీటి దాడి బట్టల మీదకి ముఖ్యంగా స్టార్చ్ వేసిన బట్టల మీదికి మల్లుతుంది. చమట తో తడిచిన కరెన్సీ నోట్లని కూడా ఇవి గుటకాయ స్వాహా చేస్తాయి.





చెద పురుగులు కంటే వాటి లార్వాలు చాలా రేట్లు ప్రమాదకరమయినవి. అవి పురుగులుగా  మారే క్రమంలో చుట్టూ అందుబాటులో ఉండే ఆహారాన్ని తినేస్తాయి.  ఎంతోకొంత తడి ఉండే వస్తువులపై ఇవి త్వరగా దాడి చేస్తాయి. బయటకి చక్కగా కనబడే పాలిషెడ్ ఫర్నిచర్ హటాత్తుగా ఒక రోజు చిన్న వత్తిడికి చొట్ట పడొచ్చు. తోలుస్తూ ఉంటే మీరు భయపడేంతగా లోపల పాడయి పోయి ఉండొచ్చు. లక్షల విలువయిన నగిషీలు చెక్కిన ప్రధాన ద్వారం కి మీరు మంచి పనివాళ్ళ చేత చక్కటి పాలిష్ చేయించ వచ్చు. భవిషత్తు లో ఒక రోజు మీరు తాళం తిప్పినప్పుడు తాళం తో పాటు దరవాజాకి బిగించిన లాక్ కింద ఊడిపడి లోపల పెద్ద లొట్ట కనిపించవచ్చు. అత్యంత ప్రమాదకరమయిన ఈ చెదలు ఎలా వ్యాపిస్తుంది? దీనిని అరికట్టటం ఎలా అనే విషయాలు తెలుకోవటం మంచిది. చాలా కాలం నుండి ఈ విషయాల గురించి ఆర్టికల్ రాద్దామనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు తీరిక చేసుకున్నాను.
చెదలు ఎలా వ్యాపిస్తుంది ?
ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే , కొంతమంది ఇష్టంగా తినే ఉసుళ్ళు కూడా చెదలు జాతికి చెందినవే.
వీటిని ఆపటం కష్టం. అపార్మెంట్స్ లేదా/ ఇళ్ళు ల్లో మనం కరెంటు వైర్లు నడపటానికి వాడే కంసీల్  పి‌వి‌సి పైపులు  చెదపురుగులకి హైవే ల వంటివి . స్వచ్చగా ఎక్కడి నుండి ఎక్కడికయినా వెళ్తాయి. వాటర్ లీకేజి సమస్య ఉన్న చోట తడి గోడల వద్ద గోడలకి అంటుకుని సైన్యాన్ని తయారు చేసు కుంటాయి. మనం ఇష్టపడి వేయించిన మార్బుల్/ గ్రానైట్ ఫ్లోరింగుల కింద నుండి  ఇల్లంతా వ్యాపిస్తాయి. ముఖ్యంగా గోడలకి మనం అంటించే స్కర్టింగ్ నుండి వేగంగా ప్రయాణం చేస్తాయి. skirting వెనుక పూర్తి స్తాయిలో mortor (మాలు) అంటించి ఉండదు. సిమెంటు ని ఒక ఉండ లాగా ఉంచి రాయిని గోడకి ఫ్లోరింగ్ కి లంభంగా ఉండెట్టు అతికిస్తారు. పై భాగాన మూసే స్తారు. లోపల అంతా ఖలీనే. పైగా ప్రతి రోజు తుడవటం కడగటం చేసినప్పుడు మూలలవద్ద తేమ ఉంది వాటి స్తావరాలు పెరుగుతాయి. సేనిటరీ పైపులు కింది సగభాగం లో మాత్రమే తడి ఉంటుంది. పైన ఉండే సగభాగం లో చదలు స్తావరాలు ఉంటాయి. పల్లెల్లో ఎక్కువ బాగం ఒక తప్పు చేస్తుంటారు. ఇంటి బయటి పక్క పూత పని చెయ్యరు. వృధా ఖర్చు అని వీళ్ళ నమ్మకం. నిజానికి ఇంటి నిర్మాణం లో ముందు బయట పూత చెయ్యాలి. లేదంటే వర్షాకాలం లో గోడలు నీళ్ళు తాగి టెర్మైట్స్ పెరగటానికి దోహదం చేస్తాయి. పైగా అరమార్లకి మేష్ మెత్తుతారు. అవి అంగుళం మించి ఉండవు. వీటిలో తడి ఉండి పోయి అరమారలో సర్దిన పుస్తకాలు, బట్టలు చెదపురుగులకి లడ్లవుతాయి. గొడల్లో ఉంచిన చక్క కరెంటు బోర్డు లు ఈ మద్య కాలం లో వాడక పోవటానికి కారణం చెడలే అన్న విషయం మార్చి పోవద్దు. పల్లెల్లో ఇంటికి దగ్గర్లోనే పశువులు ఉండటం వాటి పెడ నుండి, మనుష్యుల కాళ్ళకి అంటుకుని ఇంట్లోకి చేరతాయి. కానీ పల్లెల్లో చెదలు ని కాపాడే ఒక దివ్యమయిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఆవు నుండి వచ్చే పేడ/పంచకం. రెండోది ఎండ.  అవును ఎండ. రోజు మొత్తం లో ఎంతోకొంత కాలం ఇంట్లోకి  ఎండ రావటం సాద్యమయితే చెదలు భాద తక్కువగా ఉంటుంది. లేదా ? ఎర్ర చెమలు ఉన్న ప్రాంతం లో చెదలు ని ఇవి తేనేస్తాయి. కానీ చీమలు ఫ్లోరింగ్ లోని మట్టి లాగేసి కుప్పగా పోస్తాయి. ఇంటికి తాళం వేసి రెండు మూడు నెలల తర్వాత చూడండి. తెలుస్తుంది.
పరిష్కారం??
చీమలు తవ్వుతుంటే. వైట్ సిమెంట్ (కేజీ ల లో దొరుకుతుంది. ఏ పెయింట్ షాపులో నయినా) లో కిరోసిన్ ఆయిల్ కలిపి రంధ్రాలలో ప్లాసిక్ టూత్ పిక్ తో కూరండి. కూరే ముందు ఒక సిరంజీ నీడిల్ తో రంద్రాలలో కిరసనాయిలు పిచ్చికారి చేయండి.
చెదలు నివారణ ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు ఫ్లోరింగ్ వేసే ముందు సున్నం చల్లితే మంచిది. ఇంటి నిర్మాణానికి వాడే కలప బాగా ఆరుదల కర్ర అయ్యేలా జాగార్త పదండి. ఇంటి నిర్మాణానికి చాలా ముందే (సుమారు ఆరు నెలలు) శాల్తీలు కోయించుకుని ఒక క్రమ పద్దతిలో (అడితి లో అడగండి)
ఆరబెట్టాలి. సీజనింగ్ అంటారు ఆంగ్లం లో (తిరగమాత కాదు) గోడలోకి వెళ్ళే బాగం కి  బోయిడెక్స్ కెమికల్  (మార్కెట్ లో అమ్ముతారు) పూశాక తారు పెయింట్ వేయించండి. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక పెయింటింగ్ పెసే ముందు గడపల క్రింద బాగాన అడుగు/అడుగున్నర కి ఒక రంధ్రం చేసి ఐకన్  & బోయిడెక్స్ (ఇది 20 లీటర్లలో లబ్యమవుతుంది) సిరంజీ ద్వారా ఎక్కించండి. దీనిలో ఆయిల్ బెసేడ్ మంచిది. ప్లాస్టిక్ గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో ఈ మందు వేసి కలిపి చూస్తే ఆయిల్ బెసేడ్ అవునా కాదా అర్ధం అవుతుంది.
ఇలాటివి ముందుగా చేపట్ట లేక పోయారు. అప్పుడు ఇంటి నిర్మాణం లో ఎక్కువగా ప్లైవుడ్/న్యూ వుడ్  వాడకండి. వాడారు ఫో తరచూ గడపలని గమనిస్తుందండి. ప్రారంభం అక్కడి నుండే ఉంటుంది. ఫ్లాట్ లలో అందరూ కలిసి ఈ ట్రీట్మెంట్ చేయించ వలసి ఉంటుంది.
ఆల్రెడీ చెదలు తినటం ప్రారంభమయితే ఉపేక్షించకుండా పూర్తిగా ఆ బాగాన్ని తొలగించండి. ప్రతి అడుగు /అడుగున్నర కి చక్క గోడకి ఆనే ఉపరితలం లో ద్రిల్లు తో రంధ్రాలు వేసి ఐకన్  & బోయిడెక్స్ సిరంజీ లతో ఎక్కించి వైట్ సిమెంట్ తో రంద్రాలని పుడ్చేయండి. మీ ఆవరణ లో ఉన్న అన్నీ ఇండ్లకు ఒకేసారి చేయిస్తేనే ఫలితం లేదా అవన్నీ ట్రీట్మెంట్ జరగని చోటకి పరిగెడతాయి.

ఈ ఆర్టికల్ ఇంత సుదీర్ఘంగా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే ఈ రోజు మా దేవాలయపు ద్వజ స్తంభానికి ఐకన్  & బోయిడెక్స్ లతో ట్రీట్మెంట్ చేయించాము. అదన్న మాట సంగతి. ఓపిగ్గా చదివినందుకు థాంక్స్. అందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.



బహాయి – లోటస్ టెంపుల్

'మీర్జా హుసేన్‌ అలీ నూరి' ఒక 'వజీరు' కుమారుడు. 
1817
లో టెహరాన్ (పర్షియా) లో జన్మించారు. 
ఒక పెద్ద పదవిని చేపట్టవలసిన సమయం లో దాని ని తృణీకరించి, దైవ ప్రేరణ వల్ల కొత్త మతాన్ని స్థాపించాడు. 
ఆయన్ని 'బహాయుల్లా' అని కూడా పిలిచేవారు. 
ఆ పేరు తోనే బహాయిజం అనే పదం వాడుకలోకి వచ్చింది. 
..
భాహాయుల్లా అంటే దేవుని వెలుగు, తేజస్సు, శోభ అని. ..
..
భగవంతుడు ఒక్కడే. సర్వ మానవాళి ఒకే కుటుంబం. స్వర్గ నరకాలనేవి ఎక్కడో ఉన్నవి కావు, అవి కేవలం మనం అనుకునే స్థితులు మాత్రమే. 
చేసిన మంచి చెడుల బట్టి మరణానంతరం ఆత్మదేవుని దగ్గరగానో, దూరం గానో పయనిస్తుంది. 
ఎవరి పట్ల ఎవరికి అసహనం కూడదు. 
సత్యాన్వేషణ అనేది ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుకోవలసిందే
---
క్రీ.శ. 1863లో ఇరాన్ రాజధాని టెహరాన్ లో ప్రారంభమైన బహాయి  అనే ఈ మతం ప్రభోదిస్తుంది. 
..
బహాయి మత విశ్వాసం ప్రకారం మొత్తం మానవాళి ఒకే జాతి, ఇభ్రహీమ్, మూసా, జొరాస్టర్, గౌతమ బుద్దుడు, శ్రీకృష్ణుడు, ఈసా, మహమ్మద్ మరియు బహావుల్లా వీరందరూ ప్రవక్తలు.. మాత్రమే .. 
..
ఈ మతాన్ని పాటించేవారు ఇండియా తో కలసి చాలా దేశాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు. తొమ్మిది కోణాల నక్షత్రం ఈ మతం గుర్తు. ..


బహాయుల్లా రచనలే ఈ మతానికి పవిత్ర గ్రంధాలు. వీరికి అర్చక వర్గం అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు. 
ఇరాన్ లో పుట్టిన ఈ మతానికి అక్కడి పాలకుల నుండి వ్యతిరేఖత ఉంది .. అందువల్ల కేంద్ర స్థానం ఇరాన్‌ వదల వలసి వచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోని హైఫాఈ మతం కేంద్ర స్థానం.

..
క్లుప్తంగా చెప్పాలంటే కృష్ణుడు ని చూడలేదు, రాముని చూడలేదు కానీ వారి రిరువురూ పూజించిన సూర్యుడిని/ వెలుగుని మాత్రం మనం చూడగలుగు తున్నాం. కనుక మనకి జ్ణానాన్ని ఇచ్చే ..'వెలుగే' భగవంతుడు అనేది బహాయిల విశ్వాసం.
..


ప్రపంచం లో ఒకానొక గొప్ప బహాయి మందిరం ఢిల్లీ లోని లోటస్ టెంపుల్యాడాదికి 40 లక్షల మంది దర్శించే ఈ విశ్వాస మందిరం మద్యలో ప్రార్ధనామందిరాన్ని సూర్యుని కాంతి పుంజం ఒకటి తాకుతూ ఉంటుంది. చుట్టూ ఏర్పాటు చేసిన బెంచీ ల మీద ప్రశాంతం గా కూర్చుని ఏ మతస్తులయినా ప్రార్ధించు కోవచ్చు. తన లోని వెలుగు ని గుర్తించు కోవచ్చు...


Friday, 22 July 2016

చందనేనా?

మిస్సెస్ రాజు 22/07/16
----------------------------
ఈ రోజు ఉదయం నుండి తను మూడీగా ఉన్నాడు. 
తనకి ఇష్టమయిన టిఫిన్ చేసి పెట్టాను. కనీసం బావుందని చెప్పలేదు. ఆఫీసుకి వెళ్తూ కనీసం చెయ్యి ఉపలేదు.
సాయంత్రం బయటకి వెల్ధామనుకున్నాను. వస్తూనే సోఫాలో బాగ్ గిరాటేశాడు. 
ఏమయిందండీ ?” అడిగాను. పలకలేదు. సాయంత్రం దాకా టి‌వి కి అతుక్కు పోయాడు. నేను శాటిన్ పింక్ నైట్ డ్రస్ వేసుకున్నది కూడా గమనించలేదు. బోజనమ్ కూడా అన్యమస్కంగానే కానిచ్చాడు. 
బెడ్ రూమ్ లో కూడా అదే నిర్లిప్తత. ఎప్పుడు నిద్ర పోయాడో ఏమిటో
మనసులో ఎవరున్నారో? క్లాస్ మెట్ చందనా?’ చందనేనా 
రాజు 22/7/16
-----------------
ఇడియట్ మూడు రోజులనుండి ట్రై చేస్తున్నాను. కబాలిటికెట్స్ దొరకలేదు. చట్ ..

ఆమె సరే! అతడెవరు?

గాఢ నిద్రలో ఉన్న భోపాల్ఉలిక్కి పడింది.చల్లటి ఉదయపు గాలుల్లో విషం. విపరీతమయిన వేగం తో నగరాన్ని చుట్టుముడుతున్న విష వాయువు.
కాల్చిన ఉక్కు గుండెల్లోకి పీల్చి నట్లు ఊపిరితిత్తుల మంట. ఏం జరగబోతుందో తెలుసుకునేలోగా జనాలను మృత్యువు మింగేస్తోంది .
శరీరం మీద మంటలు, దద్దుర్లు.ఎక్కడివారక్కడ ఎలా ఉన్నవారు అలానే గిల గిలా తన్నుకుంటున్నారు.
అది 1984 డిశంబరు 3.యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి మిథైల్ ఐసోసినెట్ అనే విషవాయువు రెండు గంటల్లో 42 టన్నుల విషాన్నికక్కిన రోజు.
రెండున్నర వేలమంది మృత్యువాత పడిన రోజు. వేలాది మంది శరీరాలని, ఊపిరి తిత్తులని విషం అంటుకున్న రోజు.
చరిత్రలో ఒక చీకటి రోజు.
***
ముందు రోజు రాత్రి ప్రవీణ్పండా సిటీ నుండి భోపాల్ వచ్చాడు. తన వివాహానికి మిత్రులని ఆహ్వానించాల్సి ఉంది అని పూజాతో చెప్పి వచ్చాడు .
సాయం కోసం సైన్యం రంగం లోకి దిగింది. వేలాది గాస్ మాస్కు లు ధరించిన సైన్యం బ్రతికి ఉన్న వారిని సిటీకి దూరంగా తరలిస్తున్నారు.
అనేక మెడికల్ క్యాంపు లు నిర్వహణ జరుగుతుంది. ఎంతో మంది బాధితులని గుర్తిస్తున్నారు.
సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నగరాన్ని సాధ్యమయినంతగా ఖాళీ చేయిస్తున్నారు.
మృతదేహాలని గుర్తించినవి పోను మిగిలినవి అనాధ ప్రేతాలా తగలెడుతున్నారు. అశ్రద్దగా ఉంటే ప్లేగులాటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
ఉన్నతాధికారులు/సైన్యం ఆక్సిజన్ మాస్కు లు ధరించి తమ విధుల్ని చిత్త శుద్దితో చేస్తూ ఉన్నారు.
అలాటి భోపాల్లో ఆ విపత్తు జరిగిన మూడో రోజు ఒక పోలీసు ఉన్నతాధికారిని కలిసింది 'ఆమె '.ఆమెకి అతడిని కలవటం అంత సులభంగా సాధ్యపడలేదు.
హోం మినిస్ట్రీ లో పనిచేస్తోన్నతన మేనమామ పలుకుబడి ఉపయోగించి ఆ పోలీసు ఉన్నతాధికారి అప్పాయింట్మెంట్ పొందగలిగింది.అతను వెహికల్ దిగుతూనే సబార్డినేట్స్ తో మాట్లాడుతూ క్యాబిన్ లోకి వెళ్తుంటే ఆమె డోర్ వద్ద నిలబడి ఉంది.
ముఖాన మాస్క్ ఆమె మొఖం లోని ఆదుర్దాని కానీ, బేల తనాన్ని కానీ దాచలేక పోతున్నాయి.అతను ఆమెకి సైగ చేసి లోనికి పిలిచాడు.
"ఎస్ ప్లీజ్”  ఆమె అతని టేబుల్ మీద ఒక కవరు ఉంచింది.అది ఒక పెండ్లి పత్రిక.
అతడు ఆమె వైపు విచిత్రంగాను, కవరు వైపు ఆసక్తి గాను చూసాడు. "ప్రవీణ్ వెడ్స్ పూజాఅందంగా ఉన్న కార్డు అంతే అందం గా ఆ జంట ఫోటోలు.
"డిశంబరు 6 వ తేదీ ఉదయం"పండా సిటీ లోని రైల్వే కల్యాణ వేదిక"లో వివాహం." అని ఉంది.
అతను చప్పున తన చేతి వాచి చూసాడు. ఆరో తేదీ ఉదయం 9.00 గంటలు.
భోపాల్ కి 18 కిలోమీటర్ల దూరం లోని పండా నగరం లో ఈ పాటికి పెళ్లి జరుగుతూ ఉండాలి.
అతని ఆలోచనలని అడ్డుకుంటూ "నేనే పూజ " అందామె.
"ఈ నెల 2 వ తేదీ రాత్రి మిత్రులని ఆహ్వానించాల్సి ఉందని భోపాల్ వచ్చాడు.
ఆ తర్వాత ఏమయ్యిందో తెలీదు." ఆమె ముఖానికి ఉన్న గ్యాస్ మాస్క్ మెల్లిగా కదులుతుంది  దాని వెనుక దుఃఖం కరుగుతుంది అని అతనికి అర్ధం అయ్యింది.
ఆమె బ్యాగ్ లో నుండి ఇరవై పైగా ఫోటోలు తీసి టేబుల్ మీద ఉంచింది.అన్నిటి లోను ఎర్రగా పొడవుగా ఒకే యువకుడు.
చిరునవ్వు తో ఉన్న ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అతనికి విషయం అర్ధం అయ్యింది.
" వియ్ ట్రై టు లొకేట్. గివ్ మీ కాంటాక్ట్ నెంబర్" అతను ఆమె కళ్ళలోకి చూడలేక పోయాడు.
ఆమె పండా సిటీలో తన ఫోన్ నెంబరు, చిరునామా వ్రాసిఉన్న కాగితం అతని టేబుల్ మీద ఉంచి నమస్కరించింది.
***

ఆతరువాత జరిగిన అత్యవసర సమావేశం లో అతను ఆ ఫోటో లు అధికారులకి పంచి క్లుప్తంగా విషయం చెప్పాడు.
" ట్రయ్ టు ఫిగర్ ఔట్ థి మ్యాన్ వేర్ ఎవెర్ హీ ఈజ్ "
మర్నాటి ఉదయం అతను ఆఫీసుకి వస్తూఉంటే వైర్లెస్ సెట్ మోగింది.

తన ఇమ్మిడియట్ సబార్డినేట్ నుండి.సర్ .. ప్రవీణ్ దొరికాడు. సారీ అతని బాడీ దొరికింది. కానీ సార్ హీ ఈజ్ ఏ సన్ ఆఫ్ బిచ్. అతని బాడీ తోపాటు హోటల్ గది లో నగ్నంగా ఉన్నమరొ మహిళ బాడీ కూడా దొరికింది."

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...