పెద్దావిడ షాపింగ్
మాల్ లో ఏడు గజాల చీరలు చూస్తూ ఉన్నప్పుడూ రెండున్నరేళ్ల మనమడు తప్పించుకు పోయాడు.
అయిడు అంతస్తుల
షాపింగ్ మాల్ అది. డిస్కౌంట్ సేల్స్ కారణంగా
జనం భారీగా ఉన్నారు.
పెద్దావిడ కి
ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మాయి. ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుక్కి
పెళ్ళయిన ఆరేళ్ళ తర్వాత కలిగిన ఏకైక సంతానం.
ముసలాయన పెన్షన్
డబ్బుల్తో బుడ్డోడికి బాటరీ కారు లాటిది కొనిద్దామని మాల్ కి వచ్చిందావిడ.
వెదవ మనసు చీరల
మీదికి వెళ్లింది ఈ లోగా వీడు .. అసలే సూపర్ యాక్టివ్ పిల్లలు.
ఇంకా మాటలు సరిగా
రాలేదు గాని క్షణం కుదురుగా ఉండడు.
ఆవిడ పరుగు లాటి
నడకతో సేల్స్ అస్సిస్టెంట్ వద్దకి వెళ్ళి చెప్పింది.
“ నా మనమడు ఎర్ర
రంగు టి షర్టు వేసుకుని ఉంటాడు. ఉంగరాల జుట్టు మెడలో గొలుసు కూడా ఉంది ఇప్పుడే తప్పి
పోయాడు.”
ఆమె ముఖాన కంగారూ
భయం చూసిన అతను “భయం లేదు మాడామ్ మా వద్ద సి సి కేమారాలు ఉన్నాయి . పబ్లిక్ అడ్రసింగ్
సిస్టెమ్ లో అనౌన్స్ చేయిద్దామ్ “
ఇద్దరు హడావిడిగా
అక్కడికి చేరే సరికి మామ్మ గారి మనమడు అక్కడే ఉన్నాడు. ఒక సేల్స్ గర్ల్ వాడిని ఆడిస్తూ
ఉంది.
పెద్దావిడకి ప్రాణం
లేచి వచ్చింది. ఐదు నిమిషాల్లో జరిగిన సంఘటన అయినా బి పి పెరిగి ఆవిడ ముఖాన చెమటలు పట్టాయి.
పెద్దావిడ పరిస్తితి
గమనించిన సేల్స్ గర్ల్ కూర్చోపెట్టి ‘మంచినీళ్లు’ అందించింది.
“అసలు మేమే అనౌన్స్
చేద్దామని బాబు ని ప్రశ్నలు వేస్తున్నా మండీ.. వాడికి మీ పేరు తెలియదు లా ఉంది. మా
నానమ్మ అంటున్నాడు.. “
“మీ తాత ఏమని
పిలుస్తాడురా అంటే ‘ముసలిదానా’ అని చెబుతున్నాడు”
“మీ నాన్న, నానమ్మ ని ఎలా చెబుతాడు అంటే ‘అమ్మా’ అంటాడని చెబుతున్నాడు “
ఒక్క నిమిషం తటపటాయించి
సేల్స్ గరల్ అంది ”మీ అమ్మ ఏమని పిలుస్తుందిరా అంటే చెప్పాడు గాని అలా అనౌన్స్ చేయటం
సభ్యత కాదని ఆలోచిస్తున్నాను ఇంతలో మీరొచ్చారు
“
J
No comments:
Post a Comment