హెచ్చార్
మేనేజర్ తో పంచాయితీ నడుస్తుంది.
లక్షల రూపాయలు
వెచ్చించి ఆరేడు నెలల ట్రైనింగ్ ఇచ్చిన కంపనీ ని కనీసం రెండేళ్ళు పని చేయకుండా ఎలా వదిలి వెళ్ళి పోతారని ప్రశ్నోకటి ?
“మా రీజన్స్ మాకుంటాయి. ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన కట్టు బానిసలాగా
జీవితాంతం ఊడిగం చెయ్యాలా ఏమిటి??”
శ్రీధర్ కి
కంపెనీ పాలసీ మీద చిర్రెత్తు కొచ్చింది.
వీకెండ్
వచ్చిందాకా అదే మూడ్ కొనసాగింది.
****
శనివారం
ఉదయాన్నే 'సంఘీ టెంపుల్'
కి వెల్ధామని శ్రీమతి అడిగింది.
మనసు కి కొంత
స్వాంతన ఉంటుందని శ్రీధర్, ఆమెతో కలసి బయలు దేరాడు.
లక్కీగా ఆరోజు
ఏ షూటింగులు లేకపోవటం తో దేవాలయం ప్రశాంతంగా ఉంది.
గోత్రనామార్చన
చేయించు కుని గుడి మెట్ల మీద కూర్చుని కొబ్బరి నోట్లో వేసుకుంటూ అడిగాడు.
“ఏం కోరుకున్నావు?”
“ వచ్చే జన్మలో కూడా మీరే నా బర్త కావాలని “ పాత సినిమా లో
వాణిశ్రీ లాగా చెప్పింది ఆమె.
****
అంతేలే!!
కష్టపడి ఈ జన్మ లో ఇచ్చిన ట్రైనింగ్ వేస్ట్ అవకుండా, ఆమాత్రం కోరిక సబబే
No comments:
Post a Comment