ఈ ఉదయాన్నే సన్నటి వర్షం లోనూ
మార్నింగ్ వాక్ కి వెళ్ళాను.
రెగ్యులర్ గా వెళ్ళే చోటకి కాకుండా మొన్నామధ్య
హాస్టల్ లో ఉంచిన ఇంద్రసేనారెడ్డి (8th క్లాస్) ని చూడాలనిపించింది.
నేరుగా
హాస్టల్ కి వెళ్ళాను.
అప్పటికే పిల్లలు పక్కన ఉన్న గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉన్నారు.
వారిలో ఇంద్రసేనారెడ్డి లేడు.
**
వివరం తెలుసుకుని మూడో ఫ్లోర్ లో ఉంటున్న వాడి దగ్గరకి వెళ్ళాను.
వివరం తెలుసుకుని మూడో ఫ్లోర్ లో ఉంటున్న వాడి దగ్గరకి వెళ్ళాను.
అప్పుడే లేచాడు.
రెండు రోజుల నుండి
కడుపు లో నొప్పి, కళ్ళు మంటలు ఆట.
**
."నిన్న ఆంటీ (మా ఆవిడ) వచ్చి జున్ను ఇచ్చి వెళ్లింది" అని
చెప్పాడు
సహజంగా బెంగ లాటివి
గాని ఏడుపు లాటివి గాని లేవు.
.
"స్కూల్ నచ్చిందా" అంటే .
"బాగుంది ఇక్కడే చదువు
కుంటా" అన్నాడు.
పర్మిషన్ తీసుకుని మా మిత్రుడయిన ఒక డాక్టర్ ఇంటికి తీసుకువెళ్లాను.
నేను ఊహించినట్లే 'నులిపురుగుల' సమస్య అని కన్ఫర్మ్ చేసి ఒక డోసు టాబ్లెట్ ఇచ్చారు. కళ్ళు మంటలకి 'డ్రాప్స్' ఇచ్చారు.
పర్మిషన్ తీసుకుని మా మిత్రుడయిన ఒక డాక్టర్ ఇంటికి తీసుకువెళ్లాను.
నేను ఊహించినట్లే 'నులిపురుగుల' సమస్య అని కన్ఫర్మ్ చేసి ఒక డోసు టాబ్లెట్ ఇచ్చారు. కళ్ళు మంటలకి 'డ్రాప్స్' ఇచ్చారు.
..
సహజంగా హాస్టల్ లో
ఉమ్మడి విధానం వల్ల ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల చిన్నపిల్లలకి ఈ సమస్య వస్తుంది. ..
మనం ప్రతి విషయాన్ని నెగెటివే గా చూడటం వాళ్ళు హాస్టల్ మానుకుని వెళ్లిపోతానికి 'అబద్దాలు' చెబుతున్నారు
అనుకోవటం సరి అయిన విషయం కాదు.
..
శుభ్రంగా గోళ్ళు
తీపించి, కొన్ని జాగర్తలు
చెప్పి బయలు దెరుతుంటే ..
"బాబాయ్.. మళ్ళీ ఎప్పుడొస్తావ్ ?" అన్నాడు...
"బాబాయ్.. మళ్ళీ ఎప్పుడొస్తావ్ ?" అన్నాడు...
..
వాడిని దగ్గరగా
పొదువుకున్నాను.
సాయి చందు (మా అబ్బాయి) ని దగ్గరకి తీసుకున్నట్లు ఉంది.
సాయి చందు (మా అబ్బాయి) ని దగ్గరకి తీసుకున్నట్లు ఉంది.
..
"ఆదివారం అన్న నీ, నిన్ను కొత్తపట్నం బీచ్ కి తీసుకు వెళ్తాను"..
చెప్పాను.
ఇంద్రసేనారెడ్డి నవ్వాడు. ..
ఇంద్రసేనారెడ్డి నవ్వాడు. ..
No comments:
Post a Comment