Friday 24 June 2016

'మాల'

కిషోర్ కి ఇంట్లో మర్యాదలు తగ్గినయ్. 
వంట తనే చేసినప్పటికీ చల్లా కాలం లో అంట్లు తోమటానికి వేడి నీళ్ళు రెడీ గా ఉంచడం లాటివి ఆపెయ్యబడ్డాయి.
వెంటనే రజని కాంత్ తో స్కైప్ లో మాట్లాడాడు.
తలైవర్ సలహా తీసుకుని వెంటనే బయలు దేరి .
పూల చొక్కా, షార్ట్ వేసుకుని పాత క్రికెట్ టోపీ పెట్టుకుని హిమాలయాలకి వెళ్ళాడు.
మంచు పర్వతాల .ప్రారంభం  లో ఒక స్వామి జి కనిపించారు.
ముక్తి మార్గానికి గురువు అవసరం ఎంతో ఉందని తెలిసిన వాడు కనుక ..
ఆయన్ని ఆశ్రయించాడు ..
****
"నాయనా ఒక మాల తీసుకువెళ్ళు, అక్కడ జలపాతం ఉంది తీర్ధం పుచ్చుకో, నేరుగా హిమాలయాల పైకి వెళ్ళు అక్కడో గుహ చూసుకుని ద్యానం చేసుకుంటూ ఉండు నాయానా. త్వరలో బాహుబలి షూటింగ్ అవ్వగానే అనుష్క కూడా వచ్చే సూచనలు ఉన్నాయి". 
Kishore 
మంచి 'సాంగ్' హామ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. 
****
కొన్నాళ్ళకి శిష్యుడి నిర్వాకం చూద్దామని గురువుగారు విజిటింగ్ కి వెళ్లారు.
చాలా దూరం వెళ్ళాక భీభచ్చమయిన చలిలో శిష్యుడు పద్మాసనం వేసుకుని ద్యానం చేస్తూ కనిపించాడు.
తట్టుకోలేనంత హశ్చర్యం లో శిష్యుడిని పరామర్శించాడు.
"
నాయనా కిశోర్ "
"
స్వామీ " మెల్లిగా కళ్ళు తెరిచిన కిశోర్ గురువుగారి రాక కి ముగ్దుడయ్యాడు.
"
ఎలా ఉన్నావ్ ? నీ  బగవంతుని ధ్యానం ఎందాకా వచ్చింది??"
"
అంతా ప్రశాంతంగా ఉంది స్వామి . తమరు చెప్పినట్లు మాల,తీర్ధం , ద్యానం తో హాయిగా గడిచిపోతుంది."
"
చలిగా లేదా నాయనా?" స్వామి గారు వణుకుతూ అడిగారు.
"
ఏమి లేదు హాయిగా ఉంది. తీర్ధం లస్సీ తో పాటు పుచ్చుకుంటున్నాను. చలి గిలి ఏమి ఉండదు .. అంతా నిత్యానందం."
"
ఆలానా నాయనా? నాకు ఆ లస్సీ ఇవ్వు నాయనా. చలికి తట్టుకోలేక పోతున్నాను."
****
ఒక్క నిమిషం స్వామి అని 
"
మాలా .. ఓ మాలా గురువు గారు వచ్చారు, తీర్ధం రెండు గ్లాసుల్లో తీసుకు వచ్చాయ్"
   

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...